ఆ మహిళకు విపరీతమైన కడుపునొప్పి, వాంతులు.. ఆస్పత్రికి తీసుకెళ్లగా.. వామ్మో.!
ఓ మహిళను స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అక్కడున్న డాక్టర్లు ఆమెకు స్కాన్ చేసి బిత్తరపోయారు. తీవ్రమైన కడుపునొప్పితో సదరు యువతి ఆసుపత్రికొచ్చింది. అక్కడ డాక్టర్ అల్ట్రాసౌండ్, సీటీ స్కాన్ చేయగా ఆమె కడుపులో వెంట్రుకలు ఉన్నట్టు గుర్తించారు. ఆ వివరాలు ఇలా..
ఓ మహిళను స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అక్కడున్న డాక్టర్లు ఆమెకు స్కాన్ చేసి బిత్తరపోయారు. తీవ్రమైన కడుపునొప్పితో సదరు యువతి ఆసుపత్రికొచ్చింది. అక్కడ డాక్టర్ అల్ట్రాసౌండ్, సీటీ స్కాన్ చేయగా ఆమె కడుపులో వెంట్రుకలు ఉన్నట్టు గుర్తించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది.
వివరాల్లోకెళ్తే.. స్థానిక మహోబా జిల్లాలో 25 ఏళ్ల మహిళ.. గర్భవతిగా ఉన్నప్పుడు జుట్టు పీక్కునే వింత అలవాటుతో బాధపడింది. సదరు మహిళ తన వెంట్రుకలను మాత్రమే కాకుండా ఇతరుల వెంట్రుకలను కూడా తినేది. ఇక ప్రసవం తర్వాత జుట్టు తినడం మానేసింది. అయితే ఇటీవల ఈ మహిళకు తీవ్రమైన కడుపునొప్పి, వాంతులు రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పుడు అక్కడున్న సిబ్బంది ఆమెకు కొన్ని మందులు ఇవ్వగా.. నొప్పి నుంచి ఎలాంటి ఉపశమనం దక్కలేదు. దీంతో సదరు మహిళను కుటుంబ సభ్యులు చిత్రకూట్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ డాక్టర్ అల్ట్రాసౌండ్, సీటీ స్కాన్ చేయగా ఆమె కడుపులో వెంట్రుకలు ఉన్నట్టు గుర్తించారు.
ఇది చదవండి: వర్షాకాలంలో పాములు ఇంట్లోకి వస్తున్నాయా.? ఈ వంటింటి చిట్కాలతో ఈజీగా తరిమేయండి..
మహిళ కడుపులో 2.5 కిలోల వెంట్రుకలు కనిపించడంతో వైద్యులు షాక్‌కు గురయ్యారు. ఆ తర్వాత పొత్తికడుపులోని హెయిర్‌బాల్‌ను 45 నిమిషాల శస్త్రచికిత్స ద్వారా విజయవంతంగా తొలగించారు. కాగా, ఆపరేషన్ అనంతరం డాక్టర్ మాట్లాడుతూ.. రోగి ట్రైకోఫాగియా అనే అరుదైన వ్యాధితో బాధపడుతోందని అన్నారు. ఈ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులు తినడం, తాగడంతో పాటు జుట్టును కూడా తినడం అలవాటు చేసుకుంటారని పేర్కొన్నారు. ఇలా తినడం వల్ల వారికి పోషకాహార లోపం, జీర్ణవ్యవస్థలో ఆటంకాలు వంటి అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుందని డాక్టర్ చెప్పుకొచ్చింది.
ఇది చదవండి: చేపల వల బరువెక్కడంతో జాలర్లు సంబరపడ్డారు.. తీరా పైకి లాగి చూడగా.!
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి