Miss World 2024: ర్యాంప్ పై భారతీయ చీరలో మెరిసిన మిస్ ఆస్ట్రేలియా..

మన సిని సెలబ్రేటీలు అయితే కేన్స్, ఆస్కార్ వంటి వేడుకల్లో విదేశీ తరహాలో మోడ్రన్ దుస్తులను ధరించి సందడి చేస్తారు. అయితే ఓ విదేశీ సుందరి చీర కట్టుకుని ర్యాంప్ వాక్ చేసింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో మిస్ వరల్డ్ 2024 వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ వేడుకల్లో భారతీయ సంస్కృతికి ప్రతీక అయిన చీర కట్టుకుని మిస్ ఆస్ట్రేలియా ర్యాంప్ వాక్ చేస్తున్న వీడియో సర్వత్రా వైరల్ అవుతోంది

Miss World 2024: ర్యాంప్ పై భారతీయ చీరలో మెరిసిన మిస్ ఆస్ట్రేలియా..
Miss Australia
Follow us
Surya Kala

|

Updated on: Jun 06, 2024 | 12:53 PM

భారతీయుల సంస్కృతి, సాంప్రదాయానికి ప్రతీక చీర. అయితే పోటీ ప్రపంచంలో కాలంతో సమానంగా పరుగులు పెడుతూ పయనించాల్సి వస్తోంది. దీంతో చీరను ధరించడానికి బదులు జీన్స్ , చుడీదార్లను ధరించడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. అయినప్పటికీ పండగలు, పర్వదినాలు, స్పెషల్ డేస్ లో చీరలను ధరించడానికి బుట్టబొమ్మలా అలంకరించుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతున్నారు. అయితే మన సిని సెలబ్రేటీలు అయితే కేన్స్, ఆస్కార్ వంటి వేడుకల్లో విదేశీ తరహాలో మోడ్రన్ దుస్తులను ధరించి సందడి చేస్తారు. అయితే ఓ విదేశీ సుందరి చీర కట్టుకుని ర్యాంప్ వాక్ చేసింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది.

ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో మిస్ వరల్డ్ 2024 వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ వేడుకల్లో భారతీయ సంస్కృతికి ప్రతీక అయిన చీర కట్టుకుని మిస్ ఆస్ట్రేలియా ర్యాంప్ వాక్ చేస్తున్న వీడియో సర్వత్రా వైరల్ అవుతోంది. భారతీయ అమ్మాయిలకు చీరలంటే ప్రత్యేక అభిమానం. అయితే ఇప్పుడు చీరలో ఆస్ట్రేలియన్ అందాల సుందరి బంగారు బొమ్మలా మెరిసిపోయింది. విదేశీయులకు చీరతో ఉన్న ప్రత్యేక బంధం అనేక ప్రశంసలను అందుకుంది. ఇదే సందర్భంగా ఇండియన్ బ్యూటీ సినీ శెట్టి సంప్రదాయ లెహంగా ధరించి ర్యాంప్ వాక్ చేశారు.. రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ నీతా అంబానీ కూడా చప్పట్లు కొట్టి అభినందించారు.

ఇవి కూడా చదవండి

2024 మిస్ వరల్డ్ వేడుకలు జరుగుతున్నా ప్రతిష్టాత్మక వేదికపై సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రదర్శించడానికి మిస్ ఆస్ట్రేలియా చీరలో దర్శనమిచ్చింది. దీంతో భారతీయ సాంస్కృతిక గౌరవం, ప్రపంచ ఐక్యత గురించి శక్తివంతమైన సందేశాన్ని పంపింది. ముఖ్యంగా తమ సొంత సంప్రదాయాలను, అలవాట్లను ఇష్టపడని యువ తరానికి మిస్ ఆస్ట్రేలియా ఓ మంచి సందేశాన్ని అందించింది.

చీరను ధరించిన మిస్ ఆస్ట్రేలియా

ఇప్పుడు ఈ వీడియో @Brinda_IND అనే ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. మే 31న షేర్ చేసిన ఈ వీడియోను లక్షలాది మంది చూస్తున్నారు. భారీగా షేర్ చేస్తున్నారు. భారతీయ చీరలో మిస్ ఆస్ట్రేలియా క్రిస్టెన్ రైట్ అద్భుతమైన వీడియో నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది. క్రిస్టెన్ రైట్ పై అభినందలన వెల్లువ వర్షంలా కురుస్తోంది. సోషల్ మీడియా యూజర్లు రకరకాల కామెంట్స్ తో ప్రశంసలు కురిపించారు. ఆమె చీరతో పాటు చిరునవ్వుతో మనసు దోచుకుంది అని ఒకరు.. భారతీయ దుస్తులను ధరించడమే కాదు భారతీయ సాంప్రదాయంలో నమస్తే చేసింది. అందమైన చిరునవ్వుతో మనసులను దొంగిలించిందని మరొకరు కామెంట్ చేశారు.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి