Kaddu Ki Kheer: సొరకాయతో ఖీర్ ని ఇలా ట్రై చేయండి.. పిల్లలు, పెద్దలు ఇష్టంగా లాగించేస్తారు..

మన దేశంలో సొరకాయ ను వేదకాలం నుంచి సాగుచేయబడుతున్నట్లు తెలుస్తోంది. ఇక సోరకాయను దాహార్తిని తీర్చడానికి జ్యూస్ గా చేసి తాగవచ్చు. అంతేకాదు ఎన్నో రకాల ఆహారపదార్ధాలను కూడా తయారు చేస్తారు. సొరకాయ పప్పు, పచ్చడి,సొరకాయ పులుసు, ఇలా రకరకాల ఆహారపదార్ధాలను తయారు చేస్తారు. అయితే సొరకాయతో హల్వా, ఖీర్ వంటి స్వీట్స్ కూడా తయారు చేసుకోవచ్చు. ఈ స్వీట్స్ ను పిల్లలు, పెద్దలు కూడా ఇష్టంగా తింటారు. ఈ రోజు సొరకాయ పాయసం రెసిపీని తెలుసుకుందాం..

Kaddu Ki Kheer: సొరకాయతో ఖీర్ ని ఇలా ట్రై చేయండి.. పిల్లలు, పెద్దలు ఇష్టంగా లాగించేస్తారు..
Kaddu Ki Kheer
Follow us
Surya Kala

|

Updated on: Jun 06, 2024 | 11:38 AM

కూరగాయల్లో ఒకటి సోరకాయ. దీనిని కొన్ని ప్రాంతాల్లో అనప కాయ, ఖద్దు అని ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు. ఇది శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. అంతేకాదు చాలా ఈజీగా జీర్ణం అవుతుంది. విటమిన్ సి, బీ కాంప్లెక్స్ వంటి అనేక పోషకాలు ఉన్నాయి. అంతేకాదు ముత్రనాళాల జబ్బులకు సొరకాయ మంచి ఔషధంగా పనిచేస్తుంది. మన దేశంలో సొరకాయ ను వేదకాలం నుంచి సాగుచేయబడుతున్నట్లు తెలుస్తోంది. ఇక సోరకాయను దాహార్తిని తీర్చడానికి జ్యూస్ గా చేసి తాగవచ్చు. అంతేకాదు ఎన్నో రకాల ఆహారపదార్ధాలను కూడా తయారు చేస్తారు. సొరకాయ పప్పు, పచ్చడి,సొరకాయ పులుసు, ఇలా రకరకాల ఆహారపదార్ధాలను తయారు చేస్తారు. అయితే సొరకాయతో హల్వా, ఖీర్ వంటి స్వీట్స్ కూడా తయారు చేసుకోవచ్చు. ఈ స్వీట్స్ ను పిల్లలు, పెద్దలు కూడా ఇష్టంగా తింటారు. ఈ రోజు సొరకాయ పాయసం రెసిపీని తెలుసుకుందాం..

తయారీకి కావాల్సిన పదార్ధాలు

  1. సొరకాయ తురుము -ఒక కప్పు
  2. పాలు – ఒకటిన్నర వెన్న తీయని పాలు
  3. సగ్గుబియ్యం – ఒక కప్పు(నాలుగు గంటల ముందు నాన బెట్టుకోవాలి)
  4. కండెన్స్‌డ్ మిల్క్ – ఒక కప్పు
  5. ఇవి కూడా చదవండి
  6. జీడిపప్పు –
  7. బాదం పప్పు
  8. కిస్మిస్
  9. పిస్తా
  10. పంచదార – రెండు స్పూన్లు
  11. నెయ్యి – ఐదు స్పూన్లు
  12. యాలకుల పొడి – కొంచెం
  13. కుంకుమ పువ్వు – చిటికెడు

తయారీ విధానం: ముందుగా సొరకాయ చెక్కు తీసి తురమాలి. ఈ తురుము ఒక గిన్నె ఉండాలి. ఇప్పుడు స్టవ్ మీద దళసరి గిన్నె పెట్టి వేడి ఎక్కిన తర్వాత నాలుగు టేబుల్ స్పూన్ నెయ్యి వేయాలి. నెయ్యి వేడి అయ్యాక తర్వాత అందులో తీసుకున్న జీడిపప్పు, బాదాం పప్పు, కిస్మస్ వేసి వేయించుకుని .. బాణలి నుంచి తీసుకుని ఓ గిన్నెలో పెట్టుకోవాలి. మల్లీ బాణలిలో కొంచెం నెయ్యి వేసి సొరకాయ తురుముని వేసుకోవాలి. ఇలా కొంత సమయం సొరకాయ తురుమును వేయించి.. అందులో రెండు స్పూన్ల పంచదారను వేసి బాగా కలపాలి. ఈ సొరకాయ తురుము ఉండుకుతుండగా స్టవ్ మీద మంటను స్విమ్ లో పెట్టి.. సొరకాయ పచ్చి స్మెల్ లేకుండా వేయించండి. తర్వాత తీసుకున్న చిక్కటి పాలు వేసి పది నిమిషాల పాటు ఉడికించి అందులో ముందుగా నాన బెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసి ఉడికించాలి. చిన్న మంట మీద సొరకాయ తురుము, సగ్గుబియ్యం పూర్తిగా ఉడికించుకోవాలి. తర్వాత యాలకుల పొడిని వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో కప్పు కండెన్స్‌డ్ మిల్క్ ను వేసి బాగా కలపాలి. తర్వాత అన్నం వేసి బాగా కలిపి .. ఒక మూడు నిముషాలు ఉంచి స్టవ్ ని ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న డ్రై ఫ్రూట్స్, కొంచెం కుంకుమ పువ్వు రేకలిని వేసుకోవాలి. అంతే ఘుమఘుమలాడే టేస్టి, టేస్టి ఖద్దు ఖీర్ రెడీ..

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..