డెలివరీ తర్వాత నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
ప్రసవం తరువాత చాలా మంది మహిళలు తరచుగా మైకము, అలసట, బలహీనతగా ఉంటారు. సాధారణంగా ఎవరికైనా కళ్లు తిరగడం లేదా అలసట వంటి సమస్యలు ఉంటే ముందుగా నీళ్లు తాగమని సలహా ఇస్తారు. అయితే ప్రసవం తర్వాత మహిళలు ఇలాంటి సమస్యలు ఎదుర్కొన్నప్పుడు నీళ్లు తాగడం మానేయాలని ఇంట్లోని పెద్దలు చెబుతుంటారు.
ప్రసవం తర్వాత నీళ్లు తాగకూడదని పెద్దలు చెప్పడం మీరు వినే ఉంటారు. నేటికీ చాలా కుటుంబాలలోని పెద్దలు ప్రసవానంతరం నీరు తాగితే కడుపు ఉబ్బరం వస్తుందని, ఎప్పటికీ నయం కాదని నమ్ముతారు. ప్రసవం తరువాత చాలా మంది మహిళలు తరచుగా మైకము, అలసట, బలహీనతగా ఉంటారు. సాధారణంగా ఎవరికైనా కళ్లు తిరగడం లేదా అలసట వంటి సమస్యలు ఉంటే ముందుగా నీళ్లు తాగమని సలహా ఇస్తారు. అయితే ప్రసవం తర్వాత మహిళలు ఇలాంటి సమస్యలు ఎదుర్కొన్నప్పుడు నీళ్లు తాగడం మానేయాలని ఇంట్లోని పెద్దలు చెబుతుంటారు. కానీ, ప్రసవం తర్వాత మహిళలు తగినంత నీరు తాగకపోతే, వారు అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. డెలివరీ అయిన వెంటనే నీళ్లు తాగడం వల్ల పొట్ట పెరగడానికి ఎలాంటి సంబంధం లేదని వైద్యులు చెబుతున్నారు.
డెలీవరి అయిన మహిళ ప్రసవం తర్వాత గోరు వెచ్చని నీరు, వేడి పాలు, సూప్‌లు మాత్రమే తాగాలని చెబుతుంటారు. డెలివరీ తర్వాత చల్లని నీరు పొరపాటున కూడా తాగకూడదని అంటుంటారు. ఎందుకంటే ఇది జలుబు, దగ్గుకు కారణం కావచ్చునని చెబుతారు. బిడ్డ పుట్టిన తర్వాత ఆ తల్లి శరీరం కోలుకోవడానికి వేడిగా తీసుకునే నీళ్లు, పానీయాలు సహాయపడుతుందనే ప్రజాదరణ పొందిన నమ్మకం ఇప్పటికీ ప్రజల్లో బలంగా వినిపిస్తుంది. డెలివరీ తర్వాత చల్లటి నీటిని తాగడం వల్ల దీర్ఘకాలిక జలుబు వెంటాడుతుందని అంటారు. డెలీవరి అనంతరం వేడి నీళ్లు తాగటం వల్ల పొట్ట పెరగకుండా ఉంటుందని చెబుతారు. చల్లని నీరు తల్లి పాల నాణ్యత, ఉష్ణోగ్రతను ప్రభావితం చేస్తుందని, నవజాత శిశువుకు కూడా చలి, జలుబు వంటివి కలిగిస్తుందని చెబుతారు. కానీ, దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. కాబట్టి మీరు, డెలవరీ తర్వాత ధైర్యంగా చల్లని నీళ్లు తాగొచ్చు. మీరు తాగే నీళ్లు మరీ చల్లగా లేకుండా జాగ్రత్త పడండి. చల్లని నీళ్లు తాగితే.. మీరు త్వరగా రికవరీ అవ్వరనే దానిలో నిజం లేదని నిపుణులు అంటున్నారు.
నిజానికి ప్రసవం తర్వాత తగినంత నీరు లేకపోవడం వల్ల డీహైడ్రేషన్‌కు గురవుతారని వైద్య ఆరోగ్య నిపుణులు అంటున్నారు. బాలింతలు రోజుకు కనీసం 12 గ్లాసుల నీళ్లు తాగాలని చెబుతున్నారు. అలాగే, లస్సీ, మజ్జిగ , కొబ్బరి నీరు, నిమ్మకాయ నీళ్లు, తాజా పండ్లు, కూరగాయల రసాలు వంటి ఇతర ఆరోగ్యకరమైన పానీయాలను కూడా తీసుకోవచ్చు. మీ శరీరంలోని ద్రవ స్థాయిలు తల్లి పాల ఉత్పత్తికి కీలకం. మీరు తగినంత తల్లి పాలు ఉత్పత్తి చేయకపోతే అది శిశువుకు హాని కలిగించవచ్చు. ఇది డీప్ వెయిన్ థ్రాంబోసిస్, బ్లడ్ కోగ్యులేషన్‌ను నివారిస్తుంది. రక్త ప్రసరణకు ఆటంకం కలిగిస్తుంది. అంతేకాదు, డెలివరీ తర్వాత నీళ్లు తాగకపోతే రకరకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ప్రసవం తరువాత నీళ్లు తాగకపోతే ఎలాంటి సమస్యలు వస్తాయి..? – UTI – మలబద్ధకం – డీహైడ్రేషన్ – తీవ్రమైన బలహీనత – అలసట – శరీర నొప్పులు వంటి సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుంది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)