AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Beauty tips: ముఖంపై అవాంఛిత రోమాలకు శాశ్వత పరిష్కారం.. ! ఇంటి చిట్కాలతో చక్కటి ఉపశమనం..

ముఖంపై వచ్చే అవాంచిత రోమాలను తొలగించేందుకు మార్కెట్‌లో లభించే అనేక రకాల ఉత్పత్తులను ఉపయోగిస్తున్నారు. అయితే, ఇలాంటి ఉత్పత్తుల్లో ఉండే రసాయనాలు ముఖంలోని సున్నితమైన చర్మాన్ని దెబ్బతీస్తాయి. కాబట్టి, సహజంగా ముఖంపై జుట్టును ఎలా వదిలించుకోవాలో తెలుసుకుందాం.

Beauty tips: ముఖంపై అవాంఛిత రోమాలకు శాశ్వత పరిష్కారం.. ! ఇంటి చిట్కాలతో చక్కటి ఉపశమనం..
Facial Hair
Jyothi Gadda
|

Updated on: Jun 06, 2024 | 12:49 PM

Share

అందమైన ముఖ సౌందర్యం కావాలని అందరూ కోరుకుంటారు. కానీ, ముఖంపై మచ్చలు, మెటిమలు, అవాంచీత రోమాల కారణంగా చాలా మంది ఆందోళనకు గురవుతుంటారు. చక్కటి చంద్రబింబంలాంటి మెరిసే చర్మం కోసం మార్కెట్‌లో లభించే అనేక రకాల ఉత్పత్తులను ఉపయోగిస్తున్నారు. అయితే, ఇలాంటి ఉత్పత్తుల్లో ఉండే రసాయనాలు ముఖంలోని సున్నితమైన చర్మాన్ని దెబ్బతీస్తాయి. కాబట్టి, సహజంగా ముఖంపై జుట్టును ఎలా వదిలించుకోవాలో తెలుసుకుందాం.

బియ్యం పిండి- రోజ్ వాటర్ : బియ్యం పిండిలో కొద్దిగా రోజ్ వాటర్ మిక్స్ చేసి మెత్తటి పేస్టులా చేసుకోవాలి. ఈ పేస్టును ముఖానికి అప్లై చేసి కొన్ని నిమిషాల పాటు స్క్రబ్ చేయాలి.ఆ తర్వాత సాధారణ నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

శనగపిండి- పెరుగు : ముఖంపై కనిపించే అవాంఛిత రోమాలను తొలగించుకోవడానికి శనగపిండి, పెరుగు కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. దీనికోసం శనగపిండిలో పెరుగు కలిపి పేస్టులా తయారు చేసి అందులో చిటికెడు పసుపు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. కొద్దిగా అరిన తరువాత ముఖాన్ని స్మూత్‌గా రబ్‌ చేస్తూ శుభ్రం చేసుకోవాలి.

ఇవి కూడా చదవండి

అరటిపండు- ఓట్స్: 2 చెంచాల ఓట్స్, పండిన అరటిపండును ఒక గిన్నెలో తీసుకుని వాటిని బాగా మెత్తగా చేసి ముఖానికి పట్టించాలి. దీన్ని ఆరనివ్వండి. ముఖాన్ని 10 నిమిషాల పాటు మసాజ్ చేసి, ఆపై వదిలేయండి. కొంత సమయం తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి.

పసుపు- తేనె: పసుపు, తేనెను కలిపి పేస్టులా చేసుకుని, ఈ పేస్టును ముఖానికి పట్టించి, బాగా ఆరిపోయిన తర్వాత రుద్దుతూ శుభ్రం చేస్తే కూడా అవాంచిత రోమాలు పోతాయి.

శనగపిండి-పాలు: ఒక చెంచా శనగపిండి కి, మూడు చెంచాల పాలు వేసి చిక్కటి పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. దానిని ముఖానికి పట్టించి ఆరిన తర్వాత రుద్ది శుభ్రం చేయటం వల్ల అవాంచిత రోమాలు తొలగిపోతాయి.

బొప్పాయి- తేనే: బాగా పండిన బొప్పాయిని మెత్తగా చేసి అందులో కొద్దిగా తేనె లేదా పాలు కలిపి పేస్ట్ లా చేసుకోవాలి. దీన్ని ముఖానికి పట్టించి కాసేపు అలానే ఉంచి తర్వాత బాగా రుద్దుతూ సాధారణ నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

తేనె- పంచదార: 2 చెంచాల పంచదార, 1 చెంచా తేనె, 1 చెంచా నీటిని ఒక బాణలిలో 30 సెకన్ల పాటు స్టవ్ మీద వేడి చేయండి. పూర్తిగా కరిగిన తర్వాత ముఖం మీద అప్లై చేసి 10-15 నిమిషాల తర్వాత దాన్ని తొలగించండి.

బొప్పాయి- అలోవెరా: ఒక గిన్నెలో 2 చెంచాల బొప్పాయి గుజ్జు, అర చెంచా పసుపు, 3 చెంచాల కలబంద జెల్ తీసుకుని, వాటిని బాగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. బాగా ఆరిన తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడగాలి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!