దాల్చిన చెక్కని ఓ మసాలా దినుసుగా వాడతాం. అయితే అందులో ఎన్నో ఔషధ గుణాలు కూడా వున్నాయి. దాల్చిన చెక్కకు బ్యాక్టీరియాను నిరోధించే శక్తి వుంది. కాబట్టి మనం తాగే నీటిలో ఓ చిన్న దాల్చిన చెక్క ముక్క వేస్తే బ్యాక్టీరియాకి చెక్ చెప్పినట్టే అంటున్నారు నిపుణులు. దాల్చిన చెక్కను తీసుకోవడం ద్వారా శరీరానికి విటమిన్ ఎ, విటమిన్ సి అందుతాయి. కార్బోహైడ్రేట్లు ఇనుము, కాల్షియం, మెగ్నీషియంకు ఇది మంచి మూలం.