ముచ్చటగా మూడో సారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్.. గణేషుడితో కలిసి..!
సునీతా విలియమ్స్ అటువంటి మిషన్‌కు వెళ్ళిన ప్రపంచంలోనే మొదటి మహిళా వ్యోమగామిగా నిలిచారు. 2002లో తొలిసారి అంతరిక్షంలోకి వెళ్లిన సునీతా విలియమ్స్.. ఆ తర్వాత 2006లో మరోసారి అంతరిక్ష యాత్ర చేశారు. ఇక ఇప్పుడు ముచ్చటగా మూడోసారి స్పేస్ టూర్‌కు వెళ్ళారు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే..
భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ 58ఏళ్ల వయసులో సరికొత్త చరిత్ర సృష్టించారు. మరోసారి ఆమె అంతరిక్షంలోకి అడుగుపెట్టారు. సునీత తన సహోద్యోగుల్లో ఒకరితో కలిసి మూడోసారి అంతరిక్ష యాత్రకు వెళ్లింది. ఇద్దరూ బోయింగ్ కంపెనీకి చెందిన స్టార్‌లైనర్ అంతరిక్ష నౌకలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. దీంతో ఇద్దరూ సరికొత్త రికార్డును సృష్టించారు. సునీత అంతరిక్ష యాత్ర జూన్ 5న ప్రారంభమైంది.
సునీతా విలియమ్స్ స్టార్‌లైనర్ యాత్ర జూన్ 5న ఫ్లోరిడాలోని కేప్ కెనవెరల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్‌లోని స్పేస్ లాంచ్ కాంప్లెక్స్-41 ద్వారా ఈ రాకెట్ లాంచ్ చేయడం జరిగింది. ఈ యాత్రలో విలియమ్స్‌తో పాటు తన సహచరుడు బుచ్ విల్మోర్ కూడా ఉన్నారు. కానీ, వివిధ కారణాల వల్ల బోయింగ్ స్టార్‌లైనర్ విమానానికి పలుమార్లు అంతరాయం కలిగింది. కానీ, ఎట్టకేలకు ఈ వాహనం ఫ్లోరిడాలోని కేప్ కెనావెరల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుండి ప్రారంభించబడింది. సునీతా విలియమ్స్ అటువంటి మిషన్‌కు వెళ్ళిన ప్రపంచంలోనే మొదటి మహిళా వ్యోమగామిగా నిలిచారు. 2002లో తొలిసారి అంతరిక్షంలోకి వెళ్లిన సునీతా విలియమ్స్.. ఆ తర్వాత 2006లో మరోసారి అంతరిక్ష యాత్ర చేశారు. ఇక ఇప్పుడు ముచ్చటగా మూడోసారి స్పేస్ టూర్‌కు వెళ్ళారు సునీతా విలియమ్స్. 1987 సునీత విలియమ్స్ US నావల్ అకాడమీ నుండి శిక్షణ తీసుకుంది. ఆ తర్వాత ఆమె US నేవీలో చేరింది. 1998లో నాసా ద్వారా వ్యోమగామిగా ఎంపికయ్యారు. అంతకుముందు, సునీతా విలియమ్స్ 2006, 2012లో అంతరిక్ష యాత్రలలో పాల్గొన్నారు.
ఇక్కడ మరో విశేషం ఏంటంటే..అంతరిక్షంలోకి అడుగుపెట్టినప్పటికీ తాను దైవాన్ని నమ్ముతానని చెబుతున్నారు సునీతా విలియమ్స్. అందుకు నిదర్శనంగానే తన ఇష్టదైవం గణేషుడిని ప్రతిమను తన వెంట అంతరిక్షానికి తీసుకువెళ్లారని తెలిసింది. ఎందుకంటే..గతంలో రెండు సార్లు.. భగవద్గీత కాపీలను తన వెంట అంతరిక్షంలోకి తీసుకెళ్లినట్టుగా సునీతా విలయమ్స్ పలు ఇంటర్వ్యూలలో గుర్తుచేశారు. ఈ సారి వినాయకుడు నాతో ఉంటే ఎలాంటి ఆటంకాలు లేకుండా, తన ప్రయాణం సక్సెస్ అవుతుందని గతంలో ఆమె వెల్లడించారు. వినాయకుడు తన వెంట ఉంటే.. ప్రయాణంలో తనకు అదృష్టం కూడా కలిసి వస్తుందని ఆమె చెప్పారు. అందుకే, తన వ్యక్తిగత వస్తువులలో భాగంగా ఈసారి ఆమె గణేషుడి విగ్రహాన్ని తీసుకెళ్లిన్నట్టుగా సమాచారం.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..