Hyderabad: ఇప్పుడే అందిన వార్త.. హైదరాబాద్‌లో కుండపోత వర్షం పడే ఛాన్స్.. బీ అలెర్ట్.!
హలో..! హైదరాబాదీ.. బీ అలర్ట్. ఈరోజు హైదరబాద్‌లో కుండపోత వాన కురిసే అవకాశం ఉందంటూ హెచ్చరించింది వాతావరణ శాఖ. ఇప్పటికే వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయింది. కొన్నిరోజులుగా సాయంత్రం పూట ఉరుములు, మెరుపులతో ఒక మోస్తరు వర్షం కురుస్తుంది.

హలో..! హైదరాబాదీ.. బీ అలర్ట్. ఈరోజు హైదరబాద్‌లో కుండపోత వాన కురిసే అవకాశం ఉందంటూ హెచ్చరించింది వాతావరణ శాఖ. ఇప్పటికే వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయింది. కొన్నిరోజులుగా సాయంత్రం పూట ఉరుములు, మెరుపులతో ఒక మోస్తరు వర్షం కురుస్తుంది. ఇక ఈరోజు సా.5 గంటల తర్వాత నుంచి అర్ధరాత్రి వరకు భారీ వర్షం పడే ఛాన్స్ ఉందని తెలిపింది వాతావరణ శాఖ. నగరవాసులు జాగ్రత్తలు తీసుకోవాలంటూ జీహెచ్‌ఎంసీ అల్టర్ చేసింది. అటు సహాయక చర్యల కోసం DRF బృందాలను సిద్ధం చేస్తోంది జీహెచ్‌ఎంసీ.
ఇది చదవండి: హైదరాబాద్‌లోని రియల్ ఎస్టేట్‌కి హాట్ కేకుల్లా ఇప్పుడీ ప్రాంతాలు.. మరో మాదాపూర్ అవ్వడం ఖాయం.!
హైదరాబాద్‌లో కొద్దిపాటి వర్షం కురిసిన చాలు రహదారులు జలమయం అవుతుంటాయి. వర్షం కారణంగా రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతుంటారు. ఐతే వర్షాలుంటాయన్న వాతావరణ విభాగం హెచ్చరికలతో అలర్ట్ అయిన జీహెచ్‌ఎంసీ కమిషనర్… రోడ్లపై వరద నీరు నిలవకుండా ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు అవసరమైన ప్రతిపాదనలు కూడా పంపాలని అధికారులను ఆదేశించారు. ఈ రోజు రాత్రికి కూడా నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఈ నేపథ్యంలో నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని, అవసరం ఉంటే తప్ప బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేసింది. బుధవారం సాయంత్రం కూడా ఇదే మాదిరి వాన విరుచుకు పడింది. వర్షం నీరు రోడ్డపైకి చేరడంతో పలు చోట్ల తీవ్ర ట్రాఫిక్ జామ్ నెలకొంది. దీంతో గంటల తరబడి వాహనాలు రోడ్లపై నిలిచిపోయాయి.
ఇది చదవండి: పురావస్తు తవ్వకాల్లో బయటపడింది చూడగా స్టన్.! దెబ్బకు కళ్లు జిగేల్.. అదేంటంటే
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..