Hyderabad: చార్మినార్ వేదికగా అసాంఘిక చర్యలు.. పోలీసులు స్పందించరే?
మక్కా మజీదుకి సమీపంలో చార్మినార్ ముందర కూర్చొని కొంత మంది యువకులు, పోకిరీలు మద్యం సేవిస్తున్నారు. ఈ చర్యలు అక్కడికి వస్తున్న సందర్శకులకు ఇబ్బందిగా మారుతుంది. కానీ ఇలాంటి దుశ్చర్యలపై ఎలాంటి చర్యలు తీసుకుకపోవడం పట్ల పాతబస్తీ పోలీస్ వ్యవస్థకే ప్రశ్నార్థకంగా మారింది. అమాయక ప్రజలు గల్లీలో తిరుగుతున్నారని లాఠీలు కురిపించే పోలీసులు...
హైదరాబాద్ అంటేనే చార్మినార్. చారిత్రక నేపథ్యం ఉన్న చార్మినార్ అంటే ఎంతో మంది యాత్రికులకు, సందర్శకులకు ఒక అడ్డా. అలాంటి చార్మినార్ పరిసర ప్రాంతాల్లో కనిపిస్తున్న కొన్ని దృశ్యాలు ఇప్పుడు వేలెత్తి చూపేలా మారాయి. దీనిపై సంబంధిత అధికారులు, పోలీసులు ఎందుకు స్పందించడం లేదని ప్రజలు బాహాటంగానే విమర్శిస్తున్నారు.
మక్కా మజీదుకి సమీపంలో చార్మినార్ ముందర కూర్చొని కొంత మంది యువకులు, పోకిరీలు మద్యం సేవిస్తున్నారు. ఈ చర్యలు అక్కడికి వస్తున్న సందర్శకులకు ఇబ్బందిగా మారుతుంది. కానీ ఇలాంటి దుశ్చర్యలపై ఎలాంటి చర్యలు తీసుకుకపోవడం పట్ల పాతబస్తీ పోలీస్ వ్యవస్థకే ప్రశ్నార్థకంగా మారింది. అమాయక ప్రజలు గల్లీలో తిరుగుతున్నారని లాఠీలు కురిపించే పోలీసులు రాత్రి పూట నడిపించే ఇలాంటి అరాచకాల వైపు కన్నెత్తి చూడడం లేదని చాలా మంది విమర్శిస్తున్నారు. చారిత్రక కట్టడం చార్మినార్ నీడలో కనిపిస్తున్న ఇలాంటి దృశ్యాలు మన దేశ ప్రతిష్ఠకే భంగం కలిగించేలా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
రాత్రిపూట చార్మినార్ చూడటానికి వచ్చే పర్యాటకులకు సమయం మించిపోయిందనో, దగ్గరి వరకు వెళ్లే లేదని చెప్పి వెనక్కి తిప్పి పంపించే పోలీసులు ఇలాంటి వాటి మీద దృష్టి సారించడం లేదని విమర్శిస్తున్నారు. చార్మినార్ ముందర కూర్చొని మద్యం తాగుతూ, సిగరెట్లు కాలుస్తున్న పోకిరీలు దుశ్చర్యలపై ఇప్పటికైనా పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టాలని పలువురు కోరుతున్నారు. దీనిపై సోషల్ మీడియా వేదికగా పలువురు నెటిజన్లు పోస్టులు పెడుతూ.. ఇందుకు సంబంధించిన వీడియోలను వైరల్ చేస్తూ పోలీసు శాఖపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇకనైనా పాతబస్తీ పోలీసులు దీనిపై ప్రత్యేక చర్యలు చేపట్టి మరోసారి ఇలాంటివి జరగకుండా చూడాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..