AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఒరేయ్..! ఎవర్రా మీరంతా.. తరమాల్సిందిపోయి.. ఏకంగా తాచుపామును భయపెట్టేశారుగా

మన జనాలకు ఎప్పుడూ ఏది చూసినా వింతే.. ఏం జరిగినా ఆశ్చర్యమే. ఏ చిన్నది జరిగినా వీడియోలు, ఫోటోలు తీసి ట్రెండ్ చేసే పరిస్థితికి మనం చేరుకున్నాం. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేసేస్తుంటాం. మనం చేసే పని ఎదుటివారికి ఏమైనా ఇబ్బంది కలిగిస్తుందా.. ఆ వివరాలు ఇలా..

Hyderabad: ఒరేయ్..! ఎవర్రా మీరంతా.. తరమాల్సిందిపోయి.. ఏకంగా తాచుపామును భయపెట్టేశారుగా
Viral Video
Noor Mohammed Shaik
| Edited By: Ravi Kiran|

Updated on: Jun 07, 2024 | 8:47 PM

Share

మన జనాలకు ఎప్పుడూ ఏది చూసినా వింతే.. ఏం జరిగినా ఆశ్చర్యమే. ఏ చిన్నది జరిగినా వీడియోలు, ఫోటోలు తీసి ట్రెండ్ చేసే పరిస్థితికి మనం చేరుకున్నాం. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేసేస్తుంటాం. మనం చేసే పని ఎదుటివారికి ఏమైనా ఇబ్బంది కలిగిస్తుందా అనే కనీస ఆలోచనా ధోరణి కూడా ఇప్పుడు ఎవరికీ ఉండడం లేదు. అలాంటి ఘటనే ఒకటి తాజాగా హైదరాబాద్‌లో జరిగింది. దానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్ నగరం హిమాయత్ నగర్ లిబర్టీ చౌరస్తాలో ఓ త్రాచుపాము కలకలం రేపింది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ, లిబర్టీ చౌరస్తా సిగ్నల్ వద్ద ఉన్న వేపచెట్టుపై ఉన్నట్లుండి ఓ పాము ప్రత్యక్షమైంది. అక్కడి నుండి కేబుల్ వైర్ల సహాయంతో సిగ్నల్ పోల్‌పై అటూఇటూ తిరుగుతూ కాసేపు పాకుతూ కనిపించింది. ఇక పాము కనిపిస్తే జనాలు ఎక్కడ ఊరుకుంటారు. చేస్తున్న పనులు అన్నీ వదులుకుని నడిరోడ్డుపైనే ఆ పాము సయ్యాటను వీక్షించారు. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. ఏం జరిగినా మాకేం సంబంధం అన్నట్లు అక్కడ చూస్తున్న కొంత మంది తమ ఫోన్లలలో ఆ పాము వీడియోలు, ఫోటోలు తీసుకున్నారు. కొందరు వాహనదారులు సైతం అక్కడే నిలిచిపోయి వెళ్లాల్సిన పని మర్చిపోయి కొంతసేపు ఆ పామును చూస్తూ ఉండిపోయారు. దాంతో లిబర్టీ చౌరస్తాలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

ఇది చదవండి: బైక్‌పై వెళ్లేటప్పుడు వీధికుక్కలు వెంబడిస్తున్నాయా.? భయం వద్దు.. ఈ ట్రిక్ పాటిస్తే చాలు..

ఇవి కూడా చదవండి

పైగా ఆ జనాలు చేస్తున్న గోలకు, ఆ అరుపులకు ఆ పాముకు కూడా ఎటు పోవాలో అర్థం కానట్లు ఉంది. దొరికితే తననేమైనా చేస్తారేమో అని అనుకుందేమో ఆ మూగజీవి. అటు ఇటూ కాసేపు తచ్చాడి మెల్లగా వైర్ల మీద పాకుతూ సిగ్నల్ పోల్ సహాయంతో కిందికి వచ్చింది. దాన్ని చూస్తూ అక్కడ జనం అరుపులు మరింత ఎక్కువయ్యాయి. ఈ పాము చేసిన పనికి సుమారు గంట పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది, లా అండ్ ఆర్డర్ పాటించే పోలీసులను ముప్పతిప్పలు పెట్టింది. ఎట్టకేలకు అలాగే కిందకు దిగిపోయి పక్కనే ఖాళీ బిల్డింగ్ వైపు పాకుతూ వెళ్లిపోయింది. అప్పటికీ రోడ్డు మీద ట్రాఫిక్ నిలిచిపోయి జనాలు వింతగా చూస్తుండడం ఇక్కడ గమనార్హం. అలా పాకుతూ వెళ్లిన ఆ బిల్డింగ్ సెల్లార్‌లోకి దూరి కనుమరుగైంది త్రాచుపాము. దీంతో ఫోటోలు, వీడియోలు తీసుకుంటున్న జనాలను పోలీసులు చెదరగొట్టారు. ఆ తర్వాత ట్రాఫిక్ క్లియర్ చేస్తూ ఆ రోడ్డుపై వెళ్తున్న జనాలకు ఇబ్బంది లేకుండా చేశారు.

ఇది చదవండి: పురావస్తు తవ్వకాల్లో బయటపడింది చూడగా స్టన్.! దెబ్బకు కళ్లు జిగేల్.. అదేంటంటే

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..