డేటింగ్ యాప్‌లో అమ్మాయి పరిచయమైందా..? ఇది తెలుసుకోండి.. లేదంటే సీన్ సితారైనట్టే..

హనీ ట్రాప్ తరహాలో సెటప్ చేస్తున్నారు హైదరాబాద్‌లో పలు పబ్ నిర్వాహకులు. టిండర్ యాప్‌లో అమ్మాయితో కాంట్రాక్టు మాట్లాడుకుని బడాబాబులను నిండా ముంచుతున్న కొన్ని పబ్‌లు.. తాజాగా బయటపడ్డ మాదాపూర్‌లోని ఓ పబ్బు బాగోతం. అమ్మాయిలతో డీల్ కుదురుచుకుని.. ఆ వివరాలు ఇలా..

డేటింగ్ యాప్‌లో అమ్మాయి పరిచయమైందా..? ఇది తెలుసుకోండి.. లేదంటే సీన్ సితారైనట్టే..
Dating App
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jun 07, 2024 | 9:26 PM

హనీ ట్రాప్ తరహాలో సెటప్ చేస్తున్నారు హైదరాబాద్‌లో పలు పబ్ నిర్వాహకులు. టిండర్ యాప్‌లో అమ్మాయితో కాంట్రాక్టు మాట్లాడుకుని బడాబాబులను నిండా ముంచుతున్న కొన్ని పబ్‌లు.. తాజాగా బయటపడ్డ మాదాపూర్‌లోని ఓ పబ్బు బాగోతం. అమ్మాయిలతో డీల్ కుదురుచుకుని పబ్‌కు వస్తున్న అబ్బాయిలను నిండా ముంచింది మోష్ పబ్. రెండు రోజుల క్రితం డేటింగ్ యాప్‌లో పరిచయం అయిన అమ్మాయిని ఎరగా వేసి పబ్ వరకు రప్పిస్తున్న నిర్వాహకులు.. మద్యం పేరుతో వేలకు వేలకు బిల్ వేసి అక్రమాలకు పాల్పడుతున్నారు.

అసలు డేటింగ్ యాపే తప్పు అంటే.. దాన్ని అడ్డం పెట్టుకుని అమ్మాయిలతో మరో వ్యాపారం చేస్తున్నారు హైదరాబాదులోని కొందరు పబ్ నిర్వాహకులు. డేటింగ్ పేరుతో వెళుతున్న అమ్మాయిలని ముందే పబ్‌కు పిలిపించి డీల్ మాట్లాడి సెట్ చేస్తున్న పబ్ నిర్వాహకులు.. డేటింగ్ యాప్‌లో పరిచయం అయిన రెండు రోజులకే కలుద్దామని అమ్మాయి మెసేజ్ చేస్తుంది. సరిగ్గా ఇదే అదునుగా చూసుకుని అమ్మాయితో పబ్‌కి వెళ్లారో ఇక అంతే సంగతి.. వెళ్ళగానే అమ్మాయి మాదాపూర్‌లో ఉన్న మోష్ పబ్‌కు తీసుకెళ్తుంది. అక్కడ పీకలదాకా తాగినట్టు బిల్డప్ ఇస్తుంది. తాగింది ఎక్కువైందని తూలుతూ పబ్ నుండి బయటికి వెళ్లిపోతుంది. అమ్మాయి వెళ్ళిపోయాక తీరా పబ్ నిర్వాహకులు అబ్బాయి చేతిలో బిల్ పెడతారు. ఆ బిల్ చూసిన అబ్బాయి ఒక్కసారిగా షాక్‌లకు గురవుతారు. వచ్చింది ఇద్దరు తాగింది ఒక్కరూ, బిల్ మాత్రం 45 వేలు.. ఇదేంటని అడిగితే సర్వీస్ ఛార్జ్ అని 3500 రూపాయలు వేశారు. ఇక అక్కడ ఏమి అనలేక బిల్ కట్టేసి బయటికి వచ్చి ఈ మోష్ పబ్ రివ్యూ ఇద్దామని గూగుల్‌లో వెతికాడు.

ఇది చదవండి: బైక్‌పై వెళ్లేటప్పుడు వీధికుక్కలు వెంబడిస్తున్నాయా.? భయం వద్దు.. ఈ ట్రిక్ పాటిస్తే చాలు..

ఇవి కూడా చదవండి

గూగుల్ రివ్యూలో చూడగా అసలు విషయం బయటపడింది..ఇంతకు ముందు సైతం ఇలాంటి అమ్మాయి ఇదే రీతిలో మోసం చేసినట్టు వ్యాపారవేత్త గమనించాడు. గతంలో యాశీర్ అనే యువకుడు సైతం ఇదే తరహాలో అమ్మాయితో పబ్‌కు వెళ్లి 25 వేలు బిల్ కట్టి వచ్చాడు. ఇలాంటి పబ్‌లపై పోలీసులు చర్యలు తీసుకోవాలని నెటిజన్స్ పోస్ట్‌లు పెడుతున్నారు.

ఇది చదవండి: పురావస్తు తవ్వకాల్లో బయటపడింది చూడగా స్టన్.! దెబ్బకు కళ్లు జిగేల్.. అదేంటంటే

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
అమెజాన్‎లో ఆ పేరుతో గంజాయి అమ్మకం.. ఏపీ హోం మంత్రి అనిత కామెంట్స్
అమెజాన్‎లో ఆ పేరుతో గంజాయి అమ్మకం.. ఏపీ హోం మంత్రి అనిత కామెంట్స్
ఓట్స్‌తో ఇలా ప్యాక్ వేస్తే మీముఖం చంద్రబింబంలా మెరిసిపోవాల్సిందే!
ఓట్స్‌తో ఇలా ప్యాక్ వేస్తే మీముఖం చంద్రబింబంలా మెరిసిపోవాల్సిందే!
మిథున రాశిలో బుధ, శుక్రుల కలయిక... ఆ రాశుల వారికి శ్రమతో ధన లాభం!
మిథున రాశిలో బుధ, శుక్రుల కలయిక... ఆ రాశుల వారికి శ్రమతో ధన లాభం!
చెమట స్మెల్‌తో ఇబ్బంది పడుతున్నారా.. వంటింటి చిట్కాలు మీ కోసం
చెమట స్మెల్‌తో ఇబ్బంది పడుతున్నారా.. వంటింటి చిట్కాలు మీ కోసం
3 జట్లతో టీమిండియా సూపర్ 8 పోరు.. ఏ జట్టుపై రికార్డు ఎలా ఉందంటే?
3 జట్లతో టీమిండియా సూపర్ 8 పోరు.. ఏ జట్టుపై రికార్డు ఎలా ఉందంటే?
తమిళనాట పొలిటికల్ కిరికిరి.. అన్నాడీఎంకేపై కన్నేసిన చిన్నమ్మ..!
తమిళనాట పొలిటికల్ కిరికిరి.. అన్నాడీఎంకేపై కన్నేసిన చిన్నమ్మ..!
అలా అయితేనే పెద్ద పెద్ద వ్యక్తుల జోక్యం చేసుకోరు..
అలా అయితేనే పెద్ద పెద్ద వ్యక్తుల జోక్యం చేసుకోరు..
వైసీపీని వీడిన మరో సీనియర్ నేత.. అసలు కారణం ఇదేనట..
వైసీపీని వీడిన మరో సీనియర్ నేత.. అసలు కారణం ఇదేనట..
సంతోషం మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉన్నాడో చూడండి...
సంతోషం మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉన్నాడో చూడండి...
'RIP' అసలు అర్థం ఇదేనని మీకు తెలుసా?
'RIP' అసలు అర్థం ఇదేనని మీకు తెలుసా?