AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: దుస్తులు తెచ్చుకునేందుకు ఏనుగుల డెన్‌‌లోకి వెళ్లిన మావటి..! ఇంతలోనే ఘోరం.. స్పందించేలోపే..

హైదరాబాద్‌ నగరంలో వందలాది ఎకరాల్లో విస్తరించి ఉన్న నెహ్రూ జూపార్క్‌లో షెహబాజ్‌ అనే యానిమల్‌ కీపర్‌ మృతి విషాదంగా మారింది. డ్యూటీ ముగించుకొని వెళ్లే టైమ్‌లో ఏనుగు దాడిలో ప్రాణాలు కోల్పాడు 23 ఏళ్ల షెహబాజ్‌. సాధారణంగా ఏనుగుల సంరక్షణ కోసం ఐదారుగురు మావిటీలు విధుల్లో వుంటారు. కానీ దాడి జరిగిన టైమ్‌లో షెహబాజ్‌ ఒక్కడే డ్యూటీలో ఉన్నాడు.

Hyderabad: దుస్తులు తెచ్చుకునేందుకు ఏనుగుల డెన్‌‌లోకి వెళ్లిన మావటి..! ఇంతలోనే ఘోరం.. స్పందించేలోపే..
Hyderabad News
Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: Oct 08, 2023 | 9:34 AM

Share

హైదరాబాద్‌ నగరంలో వందలాది ఎకరాల్లో విస్తరించి ఉన్న నెహ్రూ జూపార్క్‌లో షెహబాజ్‌ అనే యానిమల్‌ కీపర్‌ మృతి విషాదంగా మారింది. డ్యూటీ ముగించుకొని వెళ్లే టైమ్‌లో ఏనుగు దాడిలో ప్రాణాలు కోల్పాడు 23 ఏళ్ల షెహబాజ్‌. సాధారణంగా ఏనుగుల సంరక్షణ కోసం ఐదారుగురు మావిటీలు విధుల్లో వుంటారు. కానీ దాడి జరిగిన టైమ్‌లో షెహబాజ్‌ ఒక్కడే డ్యూటీలో ఉన్నాడు. రిలీవర్‌ రాగానే బయలుదేరేందుకు సిద్దమయ్యాడు. అంతలోనే ఈ దారుణం జరిగింది. సహచర సిబ్బంది స్పందించేలోపే హెషబాజ్‌ అచేతన స్థితిలో వెళ్లాడు. ఎలిఫెంట్‌ డెన్‌ నుంచి అతన్ని బయటకు తీసుకు వచ్చి హుటాహుటాని హాస్పిటల్‌కు తరలించారు. కానీ అప్పటకే షెహబాజ్‌ ప్రాణాలు కోల్పాయడు. ఏనుగు దాడి ఘటనతో సందర్భకులు భయంతో పరుగులు తీశారు. జూలో ఇలాంటి సంఘటన గతంలో ఎప్పుడూ జరగలేదు. నిర్వాహకుల నిర్లక్ష్యమే షెహబాజ్‌ ప్రాణాలను బలితీసుకుందని ఆరోపించారు అతని బంధువులు. తమ కుటుంబానికి న్యాయం చేయాలంటూ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

హైదరాబాద్ జూ చరిత్రను చూసుకుంటే గతంలో అనేక సందర్భాల్లో పోకిరిలు జంతువుల్ని హతమార్చి పలు సందర్భాల్లో మాంసం మాయం చేసిన సందర్భాలు కూడా ఉఉన్నాయి. ఈ మధ్యకాలంలో అయితే ఏకంగా గంధపు చెట్లను కూడా నరుక్కుని తీసుకెళ్లిపోయారు. పలుమార్లు ఎర్రచందనం చెట్లను కూడా కోసేసిన పరిస్థితి కూడా తెరపైకి వచ్చింది. ఇదిలా ఉండగా జూ చరిత్రలో ఏనుగు దాడిలో జూ పార్క్ సిబ్బంది చనిపోవడం ఇదే మొట్టమొదటిసారి అని అధికారులు చెప్తున్నారు. పాతబస్తీ కిషన్​బాగ్​ఏరియాకు చెందిన మహమ్మద్ షాబాజ్​ సుమారు మూడేళ్లుగా జూ పార్కులో ఏనుగులతోపాటు ఇతర జంతువులకు సంరక్షునిగా పనిచేస్తున్నాడు. ప్రతిరోజు లాగే హైదరాబాద్ జూపార్కులోని ఏనుగుల గుంపు ఉన్న ఎన్​క్లోజర్లోకి షాబాజ్​ వెళ్లాడు. అక్కడ ఉన్న ఏనుగుల్లో ఒక మగ ఏనుగు నానా హంగామా సృష్టించింది. అతను తన దుస్తుల కోసం అక్కడికి వెళ్లిన సమయంలో దాడి చేసినట్లు తెలుస్తుంది. కొన ఊపిరితో ఉన్న జంతువుల షహబాజ్‌ను అధికారులు సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

అయితే, అన్ని ఏనుగులు ఆరోగ్యకరంగానే ఉన్నాయని.. ఆహారంతో పాటు ఎప్పటికప్పుడు వైద్యం కూడా అందిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ఇంతకీ ఆ ఏనుగు దాడి చేయడానికి కారణాలు ఏమై ఉండొచ్చు ? అనేదానిపై సమాచారం పూర్తిగా తెలియాల్సి ఉంది. ప్రమాదం జరిగిన తర్వాత వందల కొద్ది సందర్శకులు భయప్రాంతలకు గురై పరుగులు పెట్టారు,. మరోవైపు సెక్యూరిటీ సిబ్బంది టూరిస్టులను పార్క్ నుంచి బయటికి పంపి గేట్లు క్లోజ్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామంటూ ఫలక్ నుమా ఎసిపి సుధాకర్ వెల్లడించారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..