Air Show: అమేజింగ్.. అదరహో అనేలా ట్యాంక్‌ బండ్‌పై ఎయిర్‌ షో.. వీడియో చూశారా..

ట్యాంక్ బండ్ వద్ద ప్రజా పాలన – ప్రజా విజయోత్సవ వేడుకలలో భాగంగా అట్టహాసంగా ఎయిర్ షోను నిర్వహించారు.. ఈ ఎయిర్ షోను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, అధికారులు, ప్రజలు తిలకించారు.

Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 08, 2024 | 5:55 PM

ట్యాంక్ బండ్ వద్ద ప్రజా పాలన – ప్రజా విజయోత్సవ వేడుకలలో భాగంగా అట్టహాసంగా ఎయిర్ షోను నిర్వహించారు.. ఈ ఎయిర్ షోను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, అధికారులు, ప్రజలు తిలకించారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా నెక్లెస్‌ రోడ్‌లో ఈ ఎయిర్‌ షో నిర్వహించారు.. 9 సూర్య కిరణ్‌ విమానాలతో ఎయిర్‌ షో అద్భుతంగా జరిగింది.. ఎయిర్ ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ అజయ్ దాశరథి నాయకత్వం వహించారు.. ప్రదర్శనలో 5 అత్యుత్తమ టీమ్‌లో సూర్యకిరణ్‌ టీమ్‌ ఒకటి.. ఎయిర్ షోను చూసేందుకు ప్రజలు భారీగా ట్యాంక్ బండ్ కు వచ్చారు.

లైవ్ వీడియో..

ఎయిర్‌ షో సందర్భంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు

రాజ్ భవన్, పంజాగుట్ట నుంచి ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ వైపు వచ్చే వాహనాలను వీవీ విగ్రహం వద్ద షాదన్, నిరంకారి, పాత సైఫాబాద్ పోలీస్ స్టేషన్ వైపు మళ్లించనున్నారు.

ఖైరతాబాద్ ఫ్లైఓవర్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ వైపు వచ్చే వాహనాలను ఇందిరా గాంధీ విగ్రహం (నెక్లెస్ రోటరీ) వద్ద పీవీఎన్‌ఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్, ప్రసాద్స్ ఐమ్యాక్స్ లేదా మింట్ కాంపౌండ్ లేన్ వైపు మళ్లించనున్నారు.

లిబర్టీ నుంచి అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వచ్చే వాహనాలను పాత తెలుగు తల్లి జంక్షన్ వద్ద ఇక్బాల్ మినార్ వైపు మళ్లించనున్నారు.

ఇక్బాల్ మినార్ నుంచి పాత అంబేద్కర్ జంక్షన్ వైపు వచ్చే వాహనాలను తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి కట్ట మైసమ్మ వైపు మళ్లించారు.

నిరంకారి జంక్షన్, పాత సైఫాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి ఇక్బాల్ మినార్ వైపు వచ్చే వాహనాలను రవీంద్ర భారతి వైపు మళ్లించనున్నారు.

రవీంద్ర భారతి నుంచి ఇక్బాల్ మినార్ వైపు వచ్చే వాహనాలను లక్డీకాపూల్ వైపు మళ్లించారు.

డీబీఆర్ మిల్స్ నుంచి చిల్డ్రన్స్ పార్క్/అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వచ్చే వాహనాలను కవాడిగూడ క్రాస్‌రోడ్‌కు మళ్లించనున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..