WTTT TV9 Conclave 2024: మంత్రి సురేఖకు ఫోన్‌చేసి మందలించా.. అదంతా తప్పుడు ప్రచారమే: టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్
పార్టీలో కొంత అసంతృప్తి నిజమేనని.. టీవీ9 కాంక్లేవ్‌లో టి.పీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్ పేర్కొన్నారు.. పదవుల విషయంలో కొందరిలో బాధ ఉందన్నారు. ప్రభుత్వంలో తప్పులుజరిగితే ఎత్తిచూపుతామని.. రేవంత్ కాంగ్రెస్ అనే మాటకు తావులేదన్నారు.
ప్రజా వ్యతిరేకత అనేది ప్రత్యర్థుల తప్పుడు ప్రచారమే అంటూ తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ పేర్కొన్నారు. గత పదేళ్లతో పోలిస్తే తమ పాలన భేష్ అని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏడాదికి 5 వేల ఉద్యోగాలు ఇచ్చిందని.. తాము నెలకు 5 వేల చొప్పున ఉద్యోగాలిచ్చామని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ పేర్కొన్నారు. టీవీ9 వేదికగా జరిగిన వాట్ తెలంగాణ థింక్స్ టుడే కాంక్లేవ్‌లో పాల్గొన్న టి.పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ పలు విషయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైడ్రా విషయంలోనూ విపక్షాలది విషప్రచారమే అని కొట్టిపారేశారు మహేష్ గౌడ్. ప్రజలు మెల్లగా నిజం తెలుసుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్‌లో ఎవరూ ఎవరికీ రిమోట్ కంట్రోల్ కాదన్నారు. తనకు, రేవంత్‌రెడ్డి మధ్య మంచి సయోధ్య ఉందని చెప్పారు. తమ పార్టీలో ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ ఎక్కువ అని వెల్లడించారు.
సురేఖకు ఫోన్‌చేసి మందలించా..
పార్టీలో కొంత అసంతృప్తి నిజమేనని.. టీవీ9 కాంక్లేవ్‌లో టి.పీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్ పేర్కొన్నారు.. పదవుల విషయంలో కొందరిలో బాధ ఉందన్నారు. ప్రభుత్వంలో తప్పులుజరిగితే ఎత్తిచూపుతామని.. రేవంత్ కాంగ్రెస్ అనే మాటకు తావులేదన్నారు. కార్యకర్తల విషయంలో రేవంత్‌నైనా ప్రశ్నిస్తానంటూ పేర్కొన్నారు. నాగార్జునపై మంత్రి సురేఖ వ్యాఖ్యలు సరికాదని.. ఈ వ్యాఖ్యలపై సురేఖకు ఫోన్‌చేసి మందలించానంటూ మహేష్‌గౌడ్ పేర్కొన్నారు..
క్రమశిక్షణ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని.. ఎవరైనా సరే గీత దాటితే వేటుతప్పదంటూ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. నాటి ఫిరాయింపులు, నేటి చేరికలకు తేడా ఉందన్నారు. ప్రభుత్వాన్ని కూలుస్తామంటే ఊరుకోవాలా..? రాజకీయాల్లో కొన్నిసార్లు నిర్ణయాలు మారుతుంటాయని తెలిపారు..
కేసీఆర్ మళ్లీ గెలిచి ఉంటే తెలంగాణను అమ్మేసేవారని.. కేటీఆర్, హరీష్‌రావు ఆరోపణలు అర్థరహితం అంటూ మహేష్‌గౌడ్ పేర్కొన్నారు. BRSకు భవిష్యత్ లేదని ఎమ్మెల్యేలు భావిస్తున్నారన్నారు. చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారన్నారు. తండ్రి, కొడుకు తప్ప బీఆర్ఎస్‌లో ఎవరూ మిగలరన్నారు.. మహారాష్ట్రలో పార్టీ ఓటమికి వేరే కారణాలున్నాయని.. స్థానిక సంస్థల ఎన్నికల్లో..మెజార్టీ స్థానాలు తామే గెలుస్తామంటూ మహేష్‌కుమార్‌గౌడ్ పేర్కొన్నారు.. కేసీఆర్‌లా తాము బూటకపు సర్వే చేయించలేదని.. హైడ్రా, మూసీ అంశాలు భవిష్యత్ తరాల కోసమే అంటూ టీవీ9 కాంక్లేవ్‌లో టి.పీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్ పేర్కొన్నారు.
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..