వాట్ తెలంగాణ థింక్స్ టుడే
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది కావొస్తోంది. డిసెంబర్ 9వ తేదీ నాటికి రేవంత్ రెడ్డి సర్కారుకి ఏడాది పూర్తవుతుంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన విజయోత్సాహలు నిర్వహిస్తోంది. నవంబర్ 14 నుంచి మొదలైన ఈ సెలబ్రేషన్స్.. డిసెంబర్ 9వ తేదీతో పూర్తవుతాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఏడాది పాలనకు మంత్రులు, సొంత పార్టీ నేతలు, ప్రతిపక్ష నేతలు వేసే మార్కులు ఎన్ని? కాంగ్రెస్ సర్కారు ఏడాదిలో సాధించిన విజయాలు.. వైఫల్యాలు ఏంటి?.. ఈ అంశాలపై ఆదివారం (డిసెంబర్ 8, 2024) ఉదయం 10 గంటల నుంచి ‘What Telangana Thinks Today’ టీవీ9 కాంక్లావ్ 2024 నిర్వహిస్తుంది.