TV9 Conclave 2024: నా నెంబర్ 2 కాదు.. 3 కాదు.. టీవీ9 కాంక్లేవ్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
సునీల్ కనుగోలును కలవడానికి వెళ్లానని.. లిఫ్ట్ దగ్గర అదానీని కలిసిన మాట వాస్తవమంటూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. అదానీ విషయంలో రాహుల్ మాటే మా మాట అంటూ పొంగులేటి పేర్కొన్నారు. అన్ని విషయాల్లో.. ప్రధాన ప్రతిపక్షం కన్ఫ్యూజన్‌లో ఉందని పొంగులేటి పేర్కొన్నారు.
రేవంత్ రెడ్డి కేబినెట్‌లో నేను నెంబర్ 2 కాదు.. 3 కాదు.. నా నెంబర్ 11 అంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.. గతంలో మంచిశాఖ దక్కిందని మాత్రమే చెప్పానంటూ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది విజయోత్సవంపై టీవీ9 వేదికగా జరిగిన వాట్ తెలంగాణ థింక్స్ టుడే కాంక్లేవ్‌లో పాల్గొన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను డీకే శివకుమార్ అంత సీనియర్ కాదంటూ పొంగులేటి పేర్కొన్నారు.. శక్తివంచన లేకుండా ప్రజలకు అండగా ఉంటానంటూ వివరించారు.. ఏడాది పాలనపై మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్షలు తీర్చడంలో సఫలమయ్యామని పొంగులేటి పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులతోనే కొన్ని హామీలు అమలు చేయలేదన్నారు.. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత అస్సలు లేదని పేర్కొన్నారు.. కావాలనే.. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని.. టీవీ9 కాంక్లేవ్‌లో మంత్రి పొంగులేటి చెప్పుకొచ్చారు.
సునీల్ కనుగోలును కలవడానికి వెళ్లానని.. లిఫ్ట్ దగ్గర అదానీని కలిసిన మాట వాస్తవమంటూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. అదానీ విషయంలో రాహుల్ మాటే మా మాట అంటూ పొంగులేటి పేర్కొన్నారు. అన్ని విషయాల్లో.. ప్రధాన ప్రతిపక్షం కన్ఫ్యూజన్‌లో ఉందని పొంగులేటి పేర్కొన్నారు. ఏడాదిగా ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం.. అప్పులపై శ్వేతపత్రం విడుదలకు సిద్ధంగా ఉన్నామన్నారు.. ధరణి విషయంలో గత ప్రభుత్వ తప్పిదాలు రిపీట్ చేయబోమన్నారు.. ధరణి స్థానంలో త్వరలోనే కొత్త చట్టం తీసుకువస్తామని పేర్కొన్నారు.. సిద్దిపేట జిల్లాలో 383ఎకరాల ప్రభుత్వ భూమి కాజేశారని.. ప్రైవేట్ ప్రాపర్టీలను కన్వర్ట్ చేశారని పొంగులేటి పేర్కొననారు. తాము కక్షపూరితంగా ఎవ్వరినీ టార్గెట్ చేయడం లేదని.. నిజనిర్ధారణ తర్వాతే ఎవరిమీదైనా చర్యలు ఉంటాయన్నారు.. ఎవరినైనా జైలులో వేయడం క్షణాల్లో పని అని.. తన దగ్గర సమాచారం లేకుండా మాట్లాడతానా అంటూ పేర్కొన్నారు. తన నా ఇంటిపై ఈడీ దాడులు జరగలేదని పొంగులేటి పేర్కొన్నారు.. ఈడీ రైడ్స్‌లో నోట్లకట్టలు సీజ్ చేశారనేది అవాస్తవమన్నారు. తన కుటుంబం వ్యాపారం చేసి ఆస్తులు సంపాదించిందని.. తనపై ఆరోపణలు చేస్తున్నవారికి లక్షల కోట్లు ఎక్కడివి అని ప్రశ్నించారు.. సృజన్‌రెడ్డి బీఆర్ఎస్ నేత ఉపేందర్‌రెడ్డి అల్లుడు.. అంటూ పేర్కొన్నారు..
వీడియో చూడండి..
రాబోయే నాలుగేళ్లు సీఎంగా రేవంతే ఉంటారని.. ఏఐసీసీకి క్లారిటీ ఉందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి మార్పు ప్రసక్తే లేదన్నారు.. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత లేదని.. ప్రతిపక్షాలు చూపే అపోహ మాత్రమేన్నారు.. నాలుగేళ్ల తర్వాత ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌దే విజయం సాధిస్తుందని టీవీ9 కాంక్లేవ్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..