WTTT TV9 Conclave 2024: కేసీఆర్ కన్నా రేవంత్‌కే ఎక్కువ వ్యతిరేకత: ఎంపీ రఘునందన్‌రావు

టీవీ9 కాంక్లేవ్‌లో బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కన్నా రేవంత్‌కు ఎక్కువ వ్యతిరేకత వచ్చిందని ఆమన విమర్శించారు

WTTT TV9 Conclave 2024: కేసీఆర్ కన్నా రేవంత్‌కే ఎక్కువ వ్యతిరేకత: ఎంపీ రఘునందన్‌రావు
Bjp Mp Raghunandan Rao And Brs Mlc Karne Prabhakar Sensational Comments On Revanth Reddy's Rule And Congress Government At Wttt Tv9 Conclave 2024
Follow us
Velpula Bharath Rao

|

Updated on: Dec 08, 2024 | 9:52 PM

టీవీ9 కాంక్లేవ్‌లో బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఇరువురు కాంగ్రెస్ పభుత్వంపై, కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనపై ఆసక్తి వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్‌ రావు మాట్లాడుతూ.. బీఆర్ఎస్‌, బీజేపీ మిత్రులనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గతంలో కాంగ్రెస్‌తో కలిసి పనిచేసింది బీఆర్ఎస్ పార్టీయేనని విమర్శించారు. కేసీఆర్‌ బాటలోనే రేవంత్‌రెడ్డి నడుస్తున్నారన్నారు. కేసీఆర్‌కు అపకీర్తి వచ్చేందుకు పదేళ్లు పట్టిందని, ఏడాదిలోనే కాంగ్రెస్‌పై అంతకు మించి వ్యతిరేకత వచ్చిందని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కేసీఆర్‌ మించి రేవంత్‌కు వ్యతిరేకత వచ్చిందన్నారు. ఫిరాయింపులపై కేసీఆర్‌ చేసిందే కాంగ్రెస్ చేస్తోందని వ్యాఖ్యనించారు. మల్లన్నసాగర్‌లో ఏంజరిగిందో లగచర్లలోనూ అదే జరిగిందని చెప్పారు. ఆరోజు నిర్వాసితుల కన్నీరు బీఆర్ఎస్‌కు కనపడలేదా అని ఆయన బీఆర్‌ఎస్‌ను ప్రశ్నించారు.

ఇదే చర్చలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్నపొరపాటు చేసి తెలంగాణ ఇప్పుడు బాధపడుతోందన్నారు. ప్రజాస్వామ్యపాలన అంటూ విధ్వంసం చేస్తున్నారని విమర్శించారు. ఏడాదికాలంగా తెలంగాణ ప్రజలు ఏడుస్తున్నారని,  కాంగ్రెస్ పాలనలో అణచివేతలు, కూల్చివేతలే జరిగాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది కావోస్తుంది. డిసెంబర్ 9వ తేదీ నాటికి రేవంత్ రెడ్డి సర్కారుకి ఏడాది పూర్తవుతుంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన విజయోత్సాహలు నిర్వహిస్తోంది. నవంబర్ 14 నుంచి మొదలైన ఈ సెలబ్రేషన్స్.. డిసెంబర్ 9వ తేదీతో పూర్తవుతాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఏడాది పాలనకు మంత్రులు, సొంత పార్టీ నేతలు, ప్రతిపక్ష నేతలు వేసే మార్కులు ఎన్ని? కాంగ్రెస్ సర్కారు ఏడాదిలో సాధించిన విజయాలు.. వైఫల్యాలు ఏంటి?.. ఈ అంశాలపై ఈరోజు ‘What Telangana Thinks Today’ టీవీ9 కాంక్లావ్ 2024 నిర్వహించింది.

ఈ కార్యక్రమంలో తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి