TV9 Conclave 2024: నన్ను అంటే పడతా..కానీ కేసీఆర్‌ను తిడితే సహించం: కేటీఆర్
సీఎం రేవంత్ రెడ్డికి ఆయన నోరే శాపం అని మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ స్థాయికి కాంగ్రెస్ నేతలెవరూ సరిపోరని చెప్పారు. టీవీ9 కాంక్లేవ్‌లో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
టీవీ9 కాంక్లేవ్‌లో మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ దూషణలతో మేం ప్రతిస్పందించాల్సి వచ్చిందన్నారు. తనను అంటే పడతానని.. కేసీఆర్‌ను తిడితే సహించనని క్లారిటీ ఇచ్చారు. రేవంత్‌కు అర్థమయ్యే భాషలోనే సమాధానం ఇస్తున్నట్లు చెప్పారు. అసెంబ్లీకి రమ్మంటారు కానీ.. మైక్‌లు ఇవ్వరని ధ్వజమెత్తారు. మైక్‌లు కట్ చేసినా అసెంబ్లీకి వెళ్లి పోరాడతామని వ్యాఖ్యానించారు. కేసీఆర్ స్థాయికి కాంగ్రెస్ నేతలెవరూ సరిపోరని చెప్పారు. రేవంత్ నీచమైన భాషవినడానికి కేసీఆర్ రావాలా అని మండిపడ్డారు. ప్రజా వ్యతిరేకత లేదని కాంగ్రెస్ నేతలు చెప్పగలరా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌లో చేరిన తమ MLAలతో రాజీనామాలు చేయించాలని లేదా కొడంగల్‌లో రేవంత్ రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. సిరిసిల్లలో తాను రాజీనామా చేసి వస్తానని పేర్కొన్నారు. ప్రజావ్యతిరేకత ఉందో లేదో ఎన్నికల్లో తేల్చుకుందామని కాంగ్రెస్‌కు కేటీఆర్ సవాల్ విసిరారు. ఫార్ములా-E రేస్ కేసులో ఏముందని, ఫార్ములా-E రేస్ భారత్‌కు మొదటిసారి తెచ్చింది తనే తెలిపారు. హైదరాబాద్ బ్రాండ్ పెంచడానికే డబ్బులు కట్టమని చెప్పినట్లు తెలిపారు. రేవంత్ నోరే ఆయనకు శాపమని విమర్శించారు. పొంగులేటిపై ఈడీ రైడ్స్ లెక్కలు ఎందుకు బయటకురాలేదని ప్రశ్నించారు. కొన్నాళ్లు ఫోన్ ట్యాపింగ్, కొన్నాళ్లు ధరణి స్కామ్ కాంగ్రెస్ వాళ్లు టైంపాస్ చేస్తున్నారని సెటైర్ వేశారు. కాంగ్రెస్‌కు గవర్నెన్స్ తక్కువ.. గాసిప్స్ ఎక్కువ అని విమర్శలు గుప్పించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి