AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోడ్ల మీద పర్సులు, నైటీలు అమ్మాను.. కట్ చేస్తే జబర్దస్త్ జీవితాన్నే మార్చేసింది

ప్రేక్షకులను ఆకట్టుకున్న టీవీ షోలు చాలా ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకునే షో పేరు జబర్దస్త్. సినిమాలకు మించి ఈ టీవీ షో పాపులర్ అయ్యింది. కామెడీ స్కిట్స్ ప్రేక్షకులను తెగ నవ్వించాయి. ఇక జబర్దస్త్ ద్వారా చాలా మంది కమెడియన్స్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. కొంతమంది హీరోలుగా సినిమాలు చేస్తున్నారు.

రోడ్ల మీద పర్సులు, నైటీలు అమ్మాను.. కట్ చేస్తే జబర్దస్త్ జీవితాన్నే మార్చేసింది
Jabardasth
Rajeev Rayala
|

Updated on: Mar 21, 2026 | 8:16 PM

Share

ఇప్పుడంటే క్రేజ్ తగ్గింది కానీ ఒకప్పుడు కొన్ని నెలకే క్రితం వరకు జబర్దస్త్ కు విపరీతమైన బజ్ ఉండేది. గురువారం, శుక్రవారం వస్తే చాలు జనాలు టీవీలకు అతుక్కుపోయేవారు. టాప్ టీఆర్పీతో జబర్దస్త్ కొన్నేళ్లు రాణించింది. ఎంతో మంది కమెడియన్స్ జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కొంతమంది ఇప్పుడు సినిమాల్లో సెటిల్ అయ్యారు కూడా.. ఇక జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన వారిలో జబర్దస్త్ కొమరక్కగా ఒకరు. కొమరక్కగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటుడు కుమార్. తన కామెడీతో, డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా లేడీ గెటప్ లో కనిపించి నవ్వులు పూయించారు కుమార్. కాగా ఓ ఇంటర్వ్యూలో కుమార్ మాట్లాడుతూ.. కొమరక్క అనే తన స్క్రీన్ పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను ఆయన పంచుకున్నాడు. ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి తల్లి పేరు కొమరమ్మ అని, తన పేరు కుమార్కు దగ్గరగా ఉండటం వల్ల కొమరమ్మను కాస్త కొమరక్కగా మార్చుకున్నానని తెలిపాడు

అలాగే పదవ తరగతి పూర్తయిన తర్వాత ఊర్లో భూమి రేట్లు లేకపోవడంతో హైదరాబాద్ వచ్చి హోటళ్లలో పనిచేయడం ప్రారంభించారు. తాజ్ మహల్, కామత్, నందిని, అమృత, సుదర్శన్, ఉడుపి వంటి అనేక హోటళ్ల బ్రాంచ్‌లలో సుమారు ఎనిమిది సంవత్సరాలు పనిచేశా. ఎనిమిది గంటల డ్యూటీ తర్వాత బేగం బజార్‌లో పర్సులు, ఎఫ్ఎం రేడియోలు, నైటీలు, స్కూల్ బ్యాగులు, వర్షాకాలంలో గొడుగులు వంటివి అమ్మేవాడిని. నేను డబ్బు కోసమే వచ్చాను. నా యంగ్ ఏజ్ వృథా చేసుకోవడానికి రాలేదు అని తన గతాన్ని గుర్తుచేసుకున్నాడు కుమార్.

హోటల్ ఉద్యోగం తర్వాత, కుటుంబంలో విభేదాలు రావడంతో, రోజుకు 600 బస్తాలు మోసే అమాలీగా పనిచేయాల్సి వచ్చిందని, అదీ నెలకు కేవలం 4500 రూపాయల జీతానికి అని తెలిపాడు కుమార్. సినిమాలంటే పిచ్చి ఉన్న కొమరక్కను, తన భార్య ప్రోత్సహించిందని.. నాకు మూడు సంవత్సరాలు గడువిస్తా, ఈలోపు నువ్వు సక్సెస్ అవ్వకపోతే తిరిగి వచ్చేయ్ అని చెప్పి, తాను టైలరింగ్ చేస్తూ, బాబు ఫీజులు కడుతూ, ఐదేళ్ల పాటు ప్రతి నెలా 3000 రూపాయలు తన భర్తకు పంపించి, అతన్ని నమ్మి ప్రోత్సహించిందని తెలిపాడు కుమార్. సమాజం నుండి తీవ్ర విమర్శలు ఎదురైనా, ఆమె కొమరక్కకు అండగా నిలిచారు. జబర్దస్త్ షోలో లేడీ గెటప్‌ల గురించి వచ్చే విమర్శలను కొమరక్క ఖండించారు. కమల్‌హాసన్, ఎన్టీఆర్, రాజేంద్రప్రసాద్ వంటి గొప్ప నటులు కూడా లేడీ గెటప్‌లు వేశారని, దానిని ఒక పాత్రగా చూడాలని ఆయన అన్నారు. కొందరు కంటెస్టెంట్లకు హార్మోన్ల సమస్యలు ఉండొచ్చని, వారిని తప్పు పట్టడం సరికాదని, సమాజానికి తాము ఎవరమో చెప్పి ధైర్యంగా బతికే వారిని గొప్పవారుగా చూడాలని చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

Kumar

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
శ్రీహరి చనిపోయిన తర్వాత క్లోజ్ ఫ్రెండ్సే సగం ఆస్తులు కాజేశారు
శ్రీహరి చనిపోయిన తర్వాత క్లోజ్ ఫ్రెండ్సే సగం ఆస్తులు కాజేశారు
శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. భక్తులకు టీటీడీ కీలక సూచనలు!
శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. భక్తులకు టీటీడీ కీలక సూచనలు!
వరలక్ష్మి వత్రం.. తాంబూలం ఇచ్చేటప్పుడు ఈ తప్పులు చేస్తే అశుభం!
వరలక్ష్మి వత్రం.. తాంబూలం ఇచ్చేటప్పుడు ఈ తప్పులు చేస్తే అశుభం!
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. దగ్గరికెళ్లగా గుండె ఆగినంతపనైం
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. దగ్గరికెళ్లగా గుండె ఆగినంతపనైం
బజాజ్ నుంచి అదిరిపోయే లుక్‌తో కొత్త తరహా బైక్
బజాజ్ నుంచి అదిరిపోయే లుక్‌తో కొత్త తరహా బైక్
'చెత్త నిర్వహణ బాధ్యత ప్రతి ఒక్కరిది.. కఠిన చర్యలు తీసుకోండి'
'చెత్త నిర్వహణ బాధ్యత ప్రతి ఒక్కరిది.. కఠిన చర్యలు తీసుకోండి'
బంగారం ధరలపై బాంబ్ పేల్చే న్యూస్.. ఇవాళ రికార్డ్ స్థాయి పెరుగుదల
బంగారం ధరలపై బాంబ్ పేల్చే న్యూస్.. ఇవాళ రికార్డ్ స్థాయి పెరుగుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరిగిన RRB ఉద్యోగాలు!
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరిగిన RRB ఉద్యోగాలు!
ఇంతకీ హార్దిక్ ముంబై ఇండియన్స్‌ లో ఉన్నట్లా ? లేనట్లా ?
ఇంతకీ హార్దిక్ ముంబై ఇండియన్స్‌ లో ఉన్నట్లా ? లేనట్లా ?
కాంగ్రెస్‌లో సుస్మితా వ్యాఖ్యల దుమారం..
కాంగ్రెస్‌లో సుస్మితా వ్యాఖ్యల దుమారం..
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర