Jagga Reddy: కాంగ్రెస్‌కు ప్రజలు ఓటేసింది అందుకే.. : జగ్గారెడ్డి

Jagga Reddy: కాంగ్రెస్‌కు ప్రజలు ఓటేసింది అందుకే.. : జగ్గారెడ్డి

Subhash Goud

|

Updated on: Dec 08, 2024 | 1:42 PM

Jagga Reddy: పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో జరిగిన విధ్వంసాన్ని సరిదిద్దతున్నామని ఆయన చెప్పారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీ కడుతూనే సంక్షేమం కొనసాగిస్తున్నట్లు చెప్పారు..

కాంగ్రెస్‌ పాలనలో జనం సంతోషంగా ఉన్నారన్నారని కాంగ్రెస్‌ నేత జగ్గారెడ్డి అన్నారు. కేసీఆర్‌ను తప్పించాలని జనమే నిర్ణయించారని, పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో జరిగిన విధ్వంసాన్ని సరిదిద్దతున్నామని ఆయన చెప్పారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీ కడుతూనే సంక్షేమం కొనసాగిస్తున్నట్లు చెప్పారు.

హామీల అమలుకు వంద రోజులనుకున్నాం.. పదినెలలైందన్నారు జగ్గారెడ్డి. ఏడాదిలో తాము చేసిన అప్పు అభివృద్ధి, సంక్షేమం కోసమేనన్నారు. బీజేపీ చేసిన 140 లక్షల కోట్ల అప్పు సంగతేంటి అని ప్రశ్నించారు జగ్గారెడ్డి. ప్రధాని మోదీ వెనక్కి తెస్తానన్న నల్లధనం ఏమైందన్నారు జగ్గారెడ్డి. పేదల అకౌంట్లలో 15 లక్షల రూపాయిలు ఎప్పుడు వేస్తారన్నారు.

Published on: Dec 08, 2024 01:31 PM