TV9 Conclave 2024: ఆర్థిక వ్యవస్థను సరిచేసే పనిలో ఉన్నాం.. ప్రజలకు ఇచ్చిన వాగ్ధాలను నేరవేస్తాంః శ్రీధర్ బాబు
తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అభివృద్ది కోసం మంచి చేస్తున్న ప్రభుత్వంలో ఇతర పార్టీలవాళ్లు ఎవరొచ్చినా కలుపుకొని పోతామన్నారు.
ఎలక్షన్ ముందైనా.. ఎలక్షన్ తర్వాతైనా… ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజలు ఏం కోరుకుంటున్నారు? సమాజం మనోగతానికి అద్దం పట్టడంలో.. ఆ ప్రతిబింబాన్ని మీ ముందు ఉంచడంలో టీవీ9 ఎప్పుడూ ముందుంటుంది. తాజాగా అలాంటి మరో, భారీ కార్యక్రమంతోనే మీముందుకు వచ్చింది..
తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాదైంది. పదేళ్లు అధికారంలో ఉన్న గులాబీ పార్టీని ఓడించి.. మార్పు అనే నినాదంతో అధికారాన్ని చేపట్టింది కాంగ్రెస్ పార్టీ. ఈ ఏడాది పాలనపై ఇప్పుడు అధికార, విపక్షాల మధ్య ఓ రేంజ్‌లో మాటల యుద్ధం నడుస్తోంది. ఏడాదిలోనే ఎంతో చేశామని కాంగ్రెస్ బలంగా చెప్తుంటే.. అంతన్నారు.. ఇంతన్నారు.. కానీ చేసిందేం లేదని విపక్షాలు అంటున్నాయి. ఏం సాధించారని ఉత్సవాలు అనే ప్రశ్నలూ తెరపైకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. ఇవాళ కాంగ్రెస్ ఏడాది పాలనపై టీవీ9 మెగా కాంక్లేవ్ చేపట్టింది..
ఇందులో భాగంగా తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖమంత్రి శ్రీధర్‌బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక కామెంట్స్ చేశారు. మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా పనిచేసిన ఆయన.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు చిత్తశుద్ధితో పని చేస్తున్నామన్నారు తెలంగాణ ఆర్థికాభివృద్ధికి, ఉద్యోగ ఉపాధి కల్పనకు పెట్టుబడులు, వ్యూహత్మక భాగస్వామ్యాలతో ముందుకు వెళ్తున్నామన్నారు. విద్యా వైద్యం తమ ప్రధానం లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందన్నారు మంత్రి. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఉందన్నారు మంత్రి శ్రీధర్‌బాబు. ఎవరో కూలగొడితే కూలిపోయేది కాదు కాంగ్రెస్ పార్టీ అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తోందన్న మంత్రి…ఇతర పార్టీల వాళ్లు కలిసొస్తే..కలుపుకుంటామన్నారు
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..