TV9 Conclave 2024: ముందున్నది మొసళ్ల పండగ.. విజయోత్సవాలు ఎందుకు చేస్తున్నారో అర్ధం కావడం లేదు: కిషన్ రెడ్డి

బీఆర్ఎస్‌ అవినీతిని బయట పెట్టింది తామేనంటూ కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అందరికీ బెయిల్ వచ్చినట్టే కవితకి బెయిల్ వచ్చిందన్నారు.. కోర్టులను కూడా బీజేపీ నడిపిస్తుందా... అంటూ ప్రశ్నించారు.. బడుగు బలహీన వర్గాలను సంఘటితం చేసి పోరాడతామన్నారు

TV9 Conclave 2024: ముందున్నది మొసళ్ల పండగ.. విజయోత్సవాలు ఎందుకు చేస్తున్నారో అర్ధం కావడం లేదు: కిషన్ రెడ్డి
Kishan Reddy
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 08, 2024 | 11:07 PM

విజయోత్సవాలు ఎందుకు చేస్తున్నారో ప్రజలకు అర్ధం కావడం లేదు.. రేవంత్ పాలనకి పాస్ మార్కులు కూడా ఇచ్చే పరిస్థితి లేదంటూ కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి పేర్కొన్నారు.. ప్రజలకు ఏమీ చేయకుండా ఉత్సవాలు చేస్తున్నారంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది విజయోత్సవంపై టీవీ9 వేదికగా జరిగిన వాట్ తెలంగాణ థింక్స్ టుడే కాంక్లేవ్‌లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు.. ఒక్కరికి ఇల్లు ఇవ్వలేదు.. ఎందుకు విజయోత్సవాలు చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు.. దీనిపై కాంగ్రెస్‌ కార్యకర్తలకు కూడా ఏం తెలియడం లేదన్నారు.. రేవంత్ రెడ్డి పేదల ఇళ్లు కూల్చి పేరు తెచ్చుకోవాలనుకుంటున్నారని.. 12 నెలల్లో ప్రభుత్వం 12 ఏళ్ల వ్యతిరేకత ఎదుర్కొంటోందన్నారు.. పాలనలో బీఆర్ఎస్‌కి కాంగ్రెస్‌కి తేడా లేదన్నారు. తెలంగాణ ప్రజల బతుకు పెనం మీది నుంచి పొయ్యిలో పడినట్లుందన్నారు. మిగులు బడ్జెట్‌తో ఏర్పడిన తెలంగాణ అప్పుల తెలంగాణగా మారిందన్నారు. ప్రతి నెలా ప్రభుత్వ ఆదాయం తగ్గుతోందని పేర్కొన్నారు..

గ్రూప్‌1 నోటిఫికేషన్ ఏమైంది.. అశోక్ నగర్లో నిరుద్యోగులు ఆందోళన చేస్తే లాఠీచార్జ్‌ చేశారంటూ కిషన్ రెడ్డి పేర్కొన్నారు. నిర్బంధ పాలన బెదిరింపులు కొనసాగుతున్నాయని.. బీఆర్ఎస్‌ లాగే కాంగ్రెస్‌ ఫిరాయింపులు ప్రోత్సహిస్తోందన్నారు. రేవంత్ ప్రభుత్వం కూలిపోవాలని బీజేపీ కోరుకోవడం లేదని కిషన్ రెడ్డి స్పష్టంచేశారు.. బీఆర్ఎస్‌తో కలవాల్సిన అవసరం బీజేపీకి లేదని… భవిష్యత్‌లో బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ కలుస్తాయన్నారు..

బీఆర్ఎస్‌ అవినీతిని బయట పెట్టింది తామేనంటూ కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అందరికీ బెయిల్ వచ్చినట్టే కవితకి బెయిల్ వచ్చిందన్నారు.. కోర్టులను కూడా బీజేపీ నడిపిస్తుందా… అంటూ ప్రశ్నించారు.. బడుగు బలహీన వర్గాలను సంఘటితం చేసి పోరాడతామన్నారు. కేసీఆర్ కాంగ్రెస్‌ పార్టీలో పుట్టి ఎదిగారని తెలిపారు. మేము హైడ్రాను వ్యతిరేకించడం లేదని.. ప్రభుత్వమే అనుమతులు ఇచ్చిన ఇళ్లు కూల్చివేయడమేంటి..? రాత్రికి రాత్రి ఇళ్లు కూల్చేస్తే ఎలా..? అంటూ ప్రశ్నించారు.. ప్రభుత్వం హైడ్రా పేరుతో రియల్టర్ల నుంచి ఆర్‌ ఆర్‌ ట్యాక్స్‌ వసూలు చేస్తుందని.. మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టుకు లక్షన్నర కోట్లు కావాలని రేవంత్ అన్నారని.. గుర్తుచేశారు..

మూసీ పునరుజ్జీవం చేసి నల్గొండ ప్రజలకు సాగు తాగు నీరు ఇవ్వాలని కిషన్ రెడ్డి కోరారు.. మూసీ ప్రాజెక్టుపై ప్రభుత్వానికి ప్రణాళిక లేదని.. బుల్డోజర్లతో తొక్కేస్తామని సీఎం మాట్లాడుతారా..? అంటూ పేర్కొన్నారు.. ప్రభుత్వం పై కాంట్రాక్టర్లకి విశ్వాసం పోయిందని.. తెలంగాణకు నవోదయ కేంద్రీయ విద్యాలయాలు ఇచ్చామని పేర్కొన్నారు.. టెక్స్‌టైల్ పార్క్‌ నేషనల్ హైవేలు ఇచ్చామని… మూసీకి రిటైనింగ్ వాల్ కట్టండి అంటూ సూచించారు.. కేసీఆర్ భాషను సీఎం రేవంత్ అనుకరిస్తున్నారని.. ప్రత్యర్థి పార్టీలను దీటుగా ఎదుర్కొనేందుకు తమ నాయకులు కఠినంగా మాట్లాడుతున్నారన్నారు..

అన్ని అంశాల్లో కేంద్రం రాష్ట్రానికి నిధులు కేటాయిస్తోందని.. కేంద్ర నిధులపై రేవంత్ రెడ్డితో ఎక్కడైనా చర్చకు సిద్ధమన్నారు.. ప్రధాన ప్రతిపక్షంగా పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బీజేపీని గుర్తించారన్నారు.. కాంగ్రెస్‌ బీఆర్ఎస్‌ ఫ్యామిలీ పార్టీలు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలన్నారు.. తెలంగాణలో ప్రజాస్వామ్య పాలన బీజేపీతేనే సాధ్యమని.. హామీలతో మోసపోయిన ప్రజలతో ఉద్యమం నిర్మిస్తామన్నారు. ఆర్ ఆర్ ట్యాక్స్‌తో తెలంగాణ దోపిడీ జరుగుతుందని.. పార్లమెంట్ ఎన్నికలు హర్యానా, మహరాష్ట్ర ఎన్నికలకు.. ఇక్కడ కలెక్షన్‌ చేసి కాంగ్రెస్‌ పంపిందని ఆరోపించారు..మేనిఫెస్టో అమలు కోసం ప్రజా ఉద్యమాలు నిర్మిస్తామన్నారు..

పార్టీలోనాయకుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉండచ్చని.. సమిష్టిగా నిర్ణయాలు తీసుకుని పార్టీని నడిపిస్తున్నామన్నారు.. నెలలోగా పార్టీకి కొత్త అధ్యక్షుడు వస్తారని.. ఎవరు అధ్యక్షుడైనా అందరం కలిసి పార్టీని బలోపేతం చేస్తామని టీవీ9 కాన్‌క్లేవ్ లో కిషన్ రెడ్డి చెప్పారు. కేసీఆర్ కుటుంబ అవినీతిపై రేవంత్ చర్యలు తీసుకుంటారనే నమ్మకం లేదని.. కేంద్ర దర్యాప్తు సంస్థలపై సీఎంకి నమ్మకం లేకపోతే.. రాష్ట్ర సంస్థలతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు..

రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ బీఆర్ఎప్‌ భ్రష్టు పట్టించాయని.. హామీలు ఇచ్చే ముందు ఆలోచించుకోవాలని కిషన్ రెడ్డి సూచించారు. అధికారంలోకి వచ్చాక కేంద్రం నిధులు ఇస్తే హామీలు అమలు చేస్తామని మాట మారుస్తున్నారన్నారు. తెలంగాణ ప్రజలు కోరుకున్న మార్పు రాలేదని.. బీఆర్ఎస్‌ కంటే కాంగ్రెస్‌ రెండింతలు ప్రజా వ్యతిరేక పాలన చేస్తోందన్నారు.. ఆరు గ్యారంటీల అమలుకు వనరుల సమీకరణకు ప్లానింగ్ లేదని.. గాలికి ప్రభుత్వాన్ని నడుపుతున్నారంటూ పేర్కొన్నారు.. ముందున్నది ముసళ్ల పండగ.. రేవంత్ రెడ్డి కాచుకో.. తెలంగాణ ప్రజలు నిలదీస్తారంటూ కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..