Traffic Challan: మొత్తం 131 చ‌లాన్లు.. ఫైన్ విలువ రూ. 36వేలు.. ఈ ఉల్లంఘ‌ల‌న్నీ ఒకే బైక్‌వీ..

Traffic Challan: సాధార‌ణంగా ట్రాఫిక్ నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘిస్తే ఒక‌టి.. రెండు ఫైన్‌లు ఉంటేనే మ‌నం గాబ‌ర‌ప‌డిపోతుంటాం. ఫైన్ చెల్లించి జాగ్ర‌త్త ప‌డితే మేల‌ని భావిస్తుంటాం. కానీ హైద‌రాబాద్‌కు చెందిన ఓ టూవీల‌ర్ మాత్రం ట్రాఫిక్...

Traffic Challan: మొత్తం 131 చ‌లాన్లు.. ఫైన్ విలువ రూ. 36వేలు.. ఈ ఉల్లంఘ‌ల‌న్నీ ఒకే బైక్‌వీ..
Traffic Challan
Follow us
Narender Vaitla

|

Updated on: Jun 29, 2021 | 9:24 AM

Traffic Challan: సాధార‌ణంగా ట్రాఫిక్ నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘిస్తే ఒక‌టి.. రెండు ఫైన్‌లు ఉంటేనే మ‌నం గాబ‌ర‌ప‌డిపోతుంటాం. ఫైన్ చెల్లించి జాగ్ర‌త్త ప‌డితే మేల‌ని భావిస్తుంటాం. కానీ హైద‌రాబాద్‌కు చెందిన ఓ టూవీల‌ర్ మాత్రం ట్రాఫిక్ ఉల్లంఘ‌న‌ల‌తో ఏకంగా సెంచ‌రీ దాటేశాడు. రెండున్న‌ర ఏళ్ల‌లో ఏకంగా 131 చ‌లాన్లు న‌మోద‌య్యాయి.

వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వ‌ద్ద ట్రాఫిక్ పోలీసులు త‌నిఖీలు నిర్వ‌హిస్తున్నారు. ఈ స‌మ‌యంలోనే వెంక‌ట‌గిరి వైపు నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నెంబ‌ర్ 2 వైపు వెళుతోన్న హోండా కంపెనీకి చెందిన స్కూటీని పోలీసులు ఆపారు. దీంతో స‌ద‌రు వాహ‌నంపై ఎన్ని చ‌లాన్లు ఉన్నాయో చూడ‌గానే పోలీసు అధికారి ఒక్క‌సారి షాక్‌కి గుర‌య్యాడు. టీఎస్‌10 ఈఆర్‌ 7069 నెంబరున్న ఈ వాహనంపై ఏకంగా 131 చ‌లాన్లు ఉన్నాయి. వీటి విలువ రూ. 35,950 కావ‌డం గ‌మ‌నార్హం. 2018 న‌వంబ‌ర్ 08 నుంచి 27 జూన్ వ‌ర‌కు ఏకంగా 131 చ‌లాన్లు నమోద‌య్యాయి. ట్రాఫిక్ ఎస్ఐ ప్ర‌భాకర్ రెడ్డి తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. స‌ద‌రు బైక్ య‌జ‌మాని మాదాపుర్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ సంస్థ‌లో ఉద్యోగం చేస్తున్న‌ట్లు తెలిపారు. చ‌లాన్ల మొత్తాన్ని చెల్లించాల‌ని కోర‌గా వాహ‌న‌దారుడు నిరాక‌రించాడు. దీంతో పోలీసులు వాహ‌నాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Also Read: REPCO Bank Recruitment: రెప్కో బ్యాంక్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. షార్ట్ లిస్టింగ్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక‌..

Lightning Strike: పిడుగుపాటుకు ఐదుగురు బలి.. మృతుల్లో నలుగురు చిన్నారులు..

Viral Video: చిన్నారిని నవ్వించేందుకు కుక్క కుప్పిగంతలు.. ఈ వీడియో చూస్తే.. అస్సలు నవ్వాపుకోలేరు..