Cyber Crime: హైదరాబాద్‌లో మరో సైబర్ మోసం.. KYC అప్‌డేట్ పేరుతో 9 లక్షలు మాయం..

Hyderabad Cyber Crime: హైదరాబాద్ టోలిచౌకి ప్రాంతానికి చెందిన ఓ మహిళకు ఇలాంటి ఫోన్ కాల్ ఒకటి వచ్చింది.బ్యాంకు అధికారిని మీ డెబిట్ కార్డు కేవైసీ అప్డేట్ చేసుకున్నారా అని...

Cyber Crime: హైదరాబాద్‌లో మరో సైబర్ మోసం.. KYC అప్‌డేట్ పేరుతో 9 లక్షలు మాయం..
Cyber Crime
Follow us
Sanjay Kasula

| Edited By: Anil kumar poka

Updated on: Jun 29, 2021 | 10:40 AM

కేవైసీ (నో యువర్‌ కస్టమర్‌) వివరాలు అప్‌డేట్ చేయాలంటూ మీకు ఫోన్లు వస్తున్నాయా.. అవి పచ్చి మోసమని గ్రహించండి. సైబర్‌ నేరస్థులు నెట్‌బ్యాంకింగ్‌ ఖాతాలున్న వారిని లక్ష్యంగా చేసుకుని ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి కాల్ మీకు వచ్చిందంటే .. నెక్స్ట్ మీరు వారి టార్గెట్‌గా మారారు అని అర్థం. మీ డెబిట్ కార్డు కేవైసీ అప్‌డేట్ చేసుకున్నారా… అని అడగడంతోపాటు మీకు చేసుకోకపోతే కార్డు బ్లాక్ చేస్తామని హెచ్చరిక కూడా చేస్తారు. నిజమే అనుకొని కార్డు డీటెయిల్స్ మీ నుంచి తీసుకుంటారు. ఆ తర్వాత మీ అకౌంట్‌లోని బ్యాలెన్స్‌ను నిల్ చేస్తారు. డబ్బులు దోచుకు పోతారు..ఇలాంటి సైబర్ మోసాలు ఈ మధ్య కాలంలో చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు తాజాగా హైదరాబాద్‌లో ఇలాంటి ఘటనే మరొకటి జరిగింది.

హైదరాబాద్ టోలిచౌకి ప్రాంతానికి చెందిన ఓ మహిళకు ఇలాంటి ఫోన్ కాల్ ఒకటి వచ్చింది.బ్యాంకు అధికారిని మీ డెబిట్ కార్డు కేవైసీ అప్డేట్ చేసుకున్నారా అని ప్రశ్నించారు. అంతటితో ఆగకుండా చేసుకోకపోతే కార్డు బ్లాక్ చేస్తామని చెప్పిన సైబర్ నేరగాళ్లు ఆమెను ఆందోళనకు గురి చేశారు. నిజమే అనుకొని కార్డు డీటెయిల్స్ చెప్పింది ఆ మహిళ. చెప్పిన కొన్ని క్షణాల్లో ఆమె ఫోన్‌కు మరో మెసేజ్ వచ్చింది. తన అకౌంట్‌లో బ్యాలెన్స్ డిబిట్ అయినట్లుగా దాని సారంశం. ఇంకేముంది ఆ మహిళ అకౌంట్ నుంచి 9 లక్షలు మాయం. దీంతో లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించింది.

మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ సిసిఎస్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు సైబర్ పోలీసులు.

వెంటనే ఈ నెంబర్‌కు కాల్ చేయండి..

కేవైసీ పేరుతో నగదు పోగుట్టుకున్న వారు వేగంగా స్పందించాలి. సైబర్‌ నేరస్థులను పట్టుకునేందుకు 94906 16555కు వాట్సప్‌ ద్వారా సమాచారం ఇవ్వండి. బాధితుల సొమ్ము నేరస్థుల ఖాతాల్లోకి వెళ్లినా వెంటనే పోలీసులను సంప్రదిస్తే నేరస్థులు తీసుకోకుండా అడ్డుకోవచ్చు.

ఇవి కూడా చదవండి: Telangana online classes: ఓన్లీ ఆన్‌లైన్ క్లాసులు.. రిస్క్ చెయ్య‌లేం.. ఎవ‌రెవ‌రికీ ఎప్ప‌ట్నుంచి అంటే

MMTS Services: హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. మ‌రిన్ని ఎంఎంటీఎస్ సర్వీసులు అందుబాటులోకి

ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?