Accident: పెళ్లికి వెళ్లి వస్తుండగా ఘోర ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం.. నలుగురి పరిస్థితి విషమం
Chhattisgarh Road Accident: ఛత్తీస్‌ఘడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘోర ప్రమాదంలో.. పెళ్లికి వెళ్లివస్తున్న ఒకే కుటుంబంలోని
Chhattisgarh Road Accident: ఛత్తీస్‌ఘడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘోర ప్రమాదంలో.. పెళ్లికి వెళ్లివస్తున్న ఒకే కుటుంబంలోని ఆరుగురు దుర్మరణం చెందారు. పెళ్లి బృందంలోని చాలా మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన రాష్ట్రంలోని రాయగడ్ జిల్లా సిసరింగ సమీపంలోని ఛామల్ గ్రామం వద్ద జరిగింది. పెళ్లి బృందం వస్తున్న వ్యాన్‌ను ట్రక్కు ఢీకొట్టింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఓకే కుటుంబానికి చెందిన ఆరుగురు మరణించారు. పెళ్లి బృందం ప్రయాణిస్తున్న వ్యానులో 25 మంది ఉన్నారు.ఈ ప్రమాదంలో మరో 20 మంది గాయపడ్డారు. సోమవారం రైనుమా గ్రామంలో జరిగిన వివాహ వేడుకలో పాల్గొని తిరిగి ఇంటికి వస్తున్నారు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న ట్రక్కు ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో మహారాజ్ గంజ్ గ్రామానికి చెందిన ఆరుగురు మరణించారని పోలీసులు తెలిపారు. నలుగురు ప్రమాద స్థలిలోనే అక్కడికక్కడే మరణించారని.. మరో ఇద్దరు ఆసుపత్రిలో మరణించారని పోలీసు అధికారి సంతోష్ సింగ్ తెలిపారు. మరణించిన వారిలో మధుర బాయ్ రథియా, బిలాసో బాయి, దేవ్లాబాయి, బాలమతి, కేసరిబాయి, సోనమ్ రతియా ఉన్నారు. ఈ ప్రమాద ఘటనలో మరో 20 మంది గాయపడ్డారని.. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
కాగా.. మృతుల కుటుంబాలకు రూ.25 వేల చొప్పున ఎక్స్ గ్రేషియాను ఛత్తీస్‌ఘడ్ ప్రభుత్వం ప్రకటించింది. క్షతగాత్రులకు సత్వర చికిత్స అందించాలని సీఎం భూపేష్ బాగేల్ అధికారులను ఆదేశించారు.
Also Read: