Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Greater Noida: కారులో లిఫ్ట్ ఇచ్చారు.. ఆ తరువాత మెడపై కత్తి పెట్టి లక్ష రూపాయలు దోచుకున్నారు..

Greater Noida: గ్రేటర్ నోయిడాలో ఊహించని రీతిలో దొంగతనం జరిగింది. దుండుగులు ఓ వ్యక్తికి కారులో లిఫ్ట్ ఇచ్చి లక్ష రూపాయలు దోచుకున్నారు.

Greater Noida: కారులో లిఫ్ట్ ఇచ్చారు.. ఆ తరువాత మెడపై కత్తి పెట్టి లక్ష రూపాయలు దోచుకున్నారు..
Crime
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 29, 2021 | 5:40 AM

Greater Noida: గ్రేటర్ నోయిడాలో ఊహించని రీతిలో దొంగతనం జరిగింది. దుండుగులు ఓ వ్యక్తికి కారులో లిఫ్ట్ ఇచ్చి లక్ష రూపాయలు దోచుకున్నారు. అనంతరం బాధితుడిని రోడ్డు మధ్యలో దించేసి పారిపోయారు. ఈ ఘటన సోమవారం నాడు చోటు చేసుకుంది. బాధితులు అన్వేష్ కుమార్.. సెక్టార్ బీటా2 పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తాను ఎదుర్కొన్న పరిస్థితిని వివరిస్తూ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు.

బాధితుడు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ‘‘నేను లక్నో వెళ్లడానికి బస్సు కోసం ఉదయం 8:30 గంటలకు పారి చౌక్ వద్ద నిలుచున్నాను. వెంటనే, ఒక కారు నా వద్దకు చేరుకుంది. డ్రైవర్ నాకు లిఫ్ట్ ఇచ్చాడు. అప్పటికే కారు లోపల మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. కొంతదూరం వెళ్లాక కారులోని వ్యక్తులు.. తాము అధికారులమంటూ నిషేధిత వస్తువులు ఏమైనా తీసుకెళ్తున్నావా? అంటూ నా బ్యాగ్‌‌ను తీసుకుని తనిఖీ చేశారు. నన్ను బెదిరించి రూ. 4,500 నగదు, రెండు డెబిట్ కార్డులను తీసుకున్నారు. డెబిట్ కార్డుల పిన్ నెంబర్ కూడా తీసుకున్నారు. అలా పిన్ నెంబర్ చెప్పిన తరువాత నన్ను రోడ్డు మధ్యలోనే దించేసి వారు వెళ్లిపోయారు’’ అని బాధితుడు అన్వేష్ కుమార్ వివరించాడు.

కాగా, బాధిత వ్యక్తిని దించేసిన నిందితులు.. కొంతదూరం వెళ్లిన తరువాత ఆ రెండు డెబిట్ కార్డులను వినియోగించి రూ. 96 వేలు విత్‌డ్రా చేశారు. బాధితుడి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు.. నిందితులపై ఐపీసీ సెక్షన్ 392(దోపిడీ) కింద కేసులు చేసినట్లు ఎస్‌హెచ్ఓ తెలిపారు. నిందితుల కోసం పోలీసుల బృందం గాలిస్తుందని తెలిపారు.

Also read:

Bumper Offer: బైక్‌లు, స్కూటర్లపై రూ. 28,000 తగ్గింపు.. కొత్త రేట్లు వివరాలు ఇలా ఉన్నాయి..

Kerala Woman: సక్సెస్‌కి కేరాఫ్ ఈ మహిళ.. 18 ఏళ్ల వయస్సులో చంటిబిడ్డతో రోడ్డున పడింది.. ఇప్పుడు ఎస్ఐ‌గా నిలిచింది..

Top Movies: జాతీయ స్థాయిలో నెంబర్ 1 లో బన్నీ… నెంబర్ 4 లో ప్రభాస్… ( వీడియో )

కొడుకు ఇక లేడని తెలిసి ఆ తల్లి గుండె ఆగిపోయింది...
కొడుకు ఇక లేడని తెలిసి ఆ తల్లి గుండె ఆగిపోయింది...
నడిరోడ్డుపై.. అన్నకు సవాల్.. దమ్ముంటే తేల్చుకుందాం..
నడిరోడ్డుపై.. అన్నకు సవాల్.. దమ్ముంటే తేల్చుకుందాం..
వెండి పాత్రల్లో ఆహారం తింటే ఏమౌతుందో తెలుసా..?
వెండి పాత్రల్లో ఆహారం తింటే ఏమౌతుందో తెలుసా..?
కోనసీమ స్పెషల్ పనసకాయ బిర్యానీ రెసిపీ మీ కోసం..సింపుల్ అండ్ ఈజీ
కోనసీమ స్పెషల్ పనసకాయ బిర్యానీ రెసిపీ మీ కోసం..సింపుల్ అండ్ ఈజీ
మార్కెట్‌ను షేక్ చేస్తున్న టాప్ ఫోన్స్..కెమెరా విషయంలో తగ్గేదేలే
మార్కెట్‌ను షేక్ చేస్తున్న టాప్ ఫోన్స్..కెమెరా విషయంలో తగ్గేదేలే
మట్టి‌కుండ కొంటున్నారా.. ఈ 6 విషయాలు గుర్తుపెట్టుకోండి..
మట్టి‌కుండ కొంటున్నారా.. ఈ 6 విషయాలు గుర్తుపెట్టుకోండి..
రచ్చ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ ఈ హాట్ బ్యూటీనే..
రచ్చ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ ఈ హాట్ బ్యూటీనే..
ఆ మారుతీ కారుపై బంపర్ ఆఫర్.. ఏకంగా రూ.లక్ష తగ్గింపు
ఆ మారుతీ కారుపై బంపర్ ఆఫర్.. ఏకంగా రూ.లక్ష తగ్గింపు
ట్రంప్‌ న్యూ రూల్..అలాంటి పోస్ట్‌లు పెడితే అమెరికాలోకి నో ఎంట్రీ!
ట్రంప్‌ న్యూ రూల్..అలాంటి పోస్ట్‌లు పెడితే అమెరికాలోకి నో ఎంట్రీ!
భారత రత్న, నిషాన్‌-ఎ-పాకిస్థాన్‌ అందుకున్న ఏకైక వ్యక్తి ఎవరో తెలు
భారత రత్న, నిషాన్‌-ఎ-పాకిస్థాన్‌ అందుకున్న ఏకైక వ్యక్తి ఎవరో తెలు