Bumper Offer: బైక్‌లు, స్కూటర్లపై రూ. 28,000 తగ్గింపు.. కొత్త రేట్లు వివరాలు ఇలా ఉన్నాయి..

Mumbai: హద్దు అదుపు లేకుండా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు ఓవైపు.. పెరుగుతున్న కాలుష్యం మరోవైపు.. వెరసి దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు..

Bumper Offer: బైక్‌లు, స్కూటర్లపై రూ. 28,000 తగ్గింపు.. కొత్త రేట్లు వివరాలు ఇలా ఉన్నాయి..
Electric Scooters
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 29, 2021 | 5:31 AM

Mumbai: హద్దు అదుపు లేకుండా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు ఓవైపు.. పెరుగుతున్న కాలుష్యం మరోవైపు.. వెరసి దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు విపరీతమైన డిమాండ్, క్రేజ్ ఏర్పడుతుంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వం కూడా ఆ దిశగా ప్రోత్సాహకాలు అందిస్తోంది. ఎలక్ట్రిక్ బైక్‌ల కొనుగోళ్లను పెంచడానికి ప్రభుత్వం ఫేమ్ 2 సబ్సిడీని కూడా మార్చింది. దాంతో ఈ ఎలక్ట్రిక్ వాహనాల ధర భారీగా తగ్గింది. ప్రభుత్వ నిర్ణయం కారణంగా ముఖ్యంగా ఎలక్ట్రిక్ టూ వీలర్ల ధర భారీగా తగ్గింది. ఏకంగా రూ.28 వేల తగ్గుదలతో ఎలక్ట్రిక్ బైక్‌లు లభిస్తున్నాయి. ఫేమ్ 2 గ్రాంట్ సవరణ తరువాత అన్ని ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులు తమ బైకులు, స్కూటర్ల ధరలను తగ్గించాయి. హీరో ఎలక్ట్రిక్ తన స్కూటర్ల ధరను 12 నుంచి 33 శాతం తగ్గించింది. తగ్గిన బైక్‌ల వివరాలు ఇక్కడ చూద్దాం..

హీరో ఎలక్ట్రిక్ స్కూటర్లకు కొత్త ధరలు.. 1. హీరో ఎలక్ట్రిక్ ఫోటాన్ హెచ్ఎక్స్ టూ వీలర్ ధర రూ .8,491 మేర తగ్గింది. అంటే కస్టమర్లు ఈ టూ వీలర్‌ని రూ. 71,449 లకు కొనుగోలు చేయవచ్చు. ఫేమ్ 2 ఆఫర్ ప్రకటించక ముందు దీని ధర రూ. 79,940. 2. ఆప్టిమా హెచ్‌ఎక్స్ సింగిల్ బ్యాటరీ స్కూటర్ ధర రూ .61,640, ఇప్పుడు రూ .53,600. 2. ఆప్టిమా ఇఆర్ డబుల్ బ్యాటరీ ఎలక్ట్రిక్ స్కూటర్‌ రూ .58,980 లకు లభిస్తుంది. ఇంతకుముందు దీని ధర రూ. 78,640 కాగా, కంపెనీ ఈ స్కూటర్ ధరను రూ.19,660 తగ్గించింది. 3. నైక్స్ ఇ5 సింగిల్ బ్యాటరీ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రూ .61,000 లకు అందుబాటులో ఉంది. ఇంతకుముందు దీని ధర 68,640 రూపాయలు. 4. నైక్స్ ఇఆర్ డబుల్ బ్యాటరీ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రూ. 62,954 లకు అందుబాటులో ఉంది. దీని పాత ధర రూ.83,940. 6. హీరో నైక్స్ హెచ్ఎక్స్ ట్రిపుల్ బ్యాటరీ ఎలక్ట్రిక్ స్కూటర్‌ రూ .85,136 లకు విక్రయిస్తున్నారు. ఈ స్కూటర్ ధర అంతకుముందు రూ .1,13,115 గా ఉంది. దానిలో రూ. 27,979 రూపాయలు తగ్గించారు. 7. హీరో ఎలక్ట్రిక్‌తో పాటు ఇతర కంపెనీలు కూడా తమ ఎలక్ట్రిక్ వాహనాలపై ఆథర్, రివాల్ట్ మోటార్స్ మొదలైనవి అందిస్తున్నాయి.

Also read:

Kerala Woman: సక్సెస్‌కి కేరాఫ్ ఈ మహిళ.. 18 ఏళ్ల వయస్సులో చంటిబిడ్డతో రోడ్డున పడింది.. ఇప్పుడు ఎస్ఐ‌గా నిలిచింది..

Top Movies: జాతీయ స్థాయిలో నెంబర్ 1 లో బన్నీ… నెంబర్ 4 లో ప్రభాస్… ( వీడియో )

Surya: యదార్ధసంఘటన ఆధారంగా రానున్న సూర్య కొత్త చిత్రం… ఫస్ట్ లుక్ ఎప్పుడంటే…?? ( వీడియో )