- Telugu News Photo Gallery Business photos Realme buds 2 neo india launch date set for july 1 price specifications
Realme Buds 2 Neo: భారత్‌లో విడుదల కానున్న రియల్‌మి బడ్స్ 2 నియో.. తక్కువ ధరకే లభ్యం
Realme Buds 2 Neo: మార్కెట్లో రోజురోజుకు కొత్త కొత్త మోడళ్ల మొబైళ్లు విడుదలవుతున్నట్లుగానే ఇయర్‌ఫోన్స్ కూడా విడుదలవుతున్నాయి. మంచి సౌండ్ వచ్చేలా రకరకాల ఇయర్స్‌ఫోన్స్ ..
Updated on: Jun 29, 2021 | 5:45 AM

Realme Buds 2 Neo: మార్కెట్లో రోజురోజుకు కొత్త కొత్త మోడళ్ల మొబైళ్లు విడుదలవుతున్నట్లుగానే ఇయర్‌ఫోన్స్ కూడా విడుదలవుతున్నాయి. మంచి సౌండ్ వచ్చేలా రకరకాల ఇయర్స్‌ఫోన్స్ అందుబాటులోకి వస్తున్నాయి.

తాజాగా రియల్‌మి నుంచి మరో ఇయర్స్ ఫోన్ మార్కె్ట్లోకి విడుదల కానున్నాయి. రియల్‌మి బడ్స్ 2 నియో వైర్‌డ్ ఇయర్‌ఫోన్స్ జులై 1న ఇండియాలో విడుదల కానుంది.

ఆగస్టు 2019లో విడుదల చేసిన ‘రియల్2మి బడ్స్ 2’కు వీటిని సక్సెసర్‌గా తీసుకొచ్చారు. తాజా ఇయర్‌ఫోన్స్ కూడా చూడడానికి అలానే ఉన్నాయి. రియల్‌మి బ్రెడ్ ట్రిమ్మర్, రియల్‌మి హెయిర్ డ్రయెర్‌తో కలిపి వీటిని మార్కెట్లోకి విడుదల చేస్తోంది.

రియల్‌మి బడ్స్ 2 నియో ధర 499 రూపాయలు ఉండనుంది. జులై 1న మధ్యాహ్నం 12.30 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటాయి. నలుపు, నీలం రంగుల్లో ఆకట్టుకునేలా ఉన్నాయి.





























