AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kerala Woman: సక్సెస్‌కి కేరాఫ్ ఈ మహిళ.. 18 ఏళ్ల వయస్సులో చంటిబిడ్డతో రోడ్డున పడింది.. ఇప్పుడు ఎస్ఐ‌గా నిలిచింది..

Kerala Woman: ‘కృషి ఉంటే మనుషులు రుషులవుతారు.. మహాపురుషులు అవుతారు’ అని అంటుంటారు. కానీ, ఇక్కడ మహా ‘స్త్రీ’ అని మెన్షన్ చేయాలేమో.

Kerala Woman: సక్సెస్‌కి కేరాఫ్ ఈ మహిళ.. 18 ఏళ్ల వయస్సులో చంటిబిడ్డతో రోడ్డున పడింది.. ఇప్పుడు ఎస్ఐ‌గా నిలిచింది..
Sub Insprector
Shiva Prajapati
|

Updated on: Jun 29, 2021 | 5:24 AM

Share

Kerala Woman: ‘కృషి ఉంటే మనుషులు రుషులవుతారు.. మహాపురుషులు అవుతారు’ అని అంటుంటారు. కానీ, ఇక్కడ మహా ‘స్త్రీ’ అని మెన్షన్ చేయాలేమో. ఎందుకంటే.. అందరిచే చులకనడగా చూడబడిన ఆమె.. నేడు అదే జనాలతో సెల్యూట్ కొట్టించుకుంటోంది. అంతటి అకుంఠిత శ్రమ, కార్యదీక్షే ఆమె నేడు ఈ స్థాయిలో ఉండటానికి కారణం. ఆమే కేరళకు చెందిన సబ్ ఎన్‌స్పెక్టర్ ఆని శివ. ఈమె విజయ ప్రస్థానం తెలిస్తే.. జీవితంలో ఎన్ని సమస్యలు ఎదురైనా పోరాడి గెలవచ్చనే మనోస్థైర్యం కలుగకమానదు.

ఇంతకీ ఆమె జీవన ప్రస్థానం ఏంటో, ఆమె ఎదుర్కొన్న కష్టాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కేరళకు చెందిన ఆని శివ కు చిన్న వయస్సులోనే వివాహం జరిగింది. 18 సంవత్సరాల వయస్సులోనే ఓ చంటి బిడ్డకు తల్లి అయ్యింది. అయితే, కూతురు 6 నెలల వయసు ఉండగా.. ఆమె రోడ్డున పడింది. కట్టుకున్న భర్త ఆమెను కాదని వదిలేశాడు. దాంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయింది ఆని శివ. కానీ, అంతటి కష్టంలోనూ ఆమె వెనకడుగు వేయలేదు. జీవితమే పోరాటంలో ముందుకు సాగాలని నిర్ణయించుకుంది. ఆ క్రమంలో తన చంటిబిడ్డను వెంట వేసుకుని.. ఐస్‌క్రీమ్, నిమ్మరసం వంటివి అమ్మకుంటూ తన కూతురిని పోషించుకుంటూ వచ్చింది. చివరకు తానేంటో ఈ సమాజానికి తెలియజేయాలని నిశ్చయించుకున్న ఆని శివ.. 2014వ సంవత్సరం నుంచి ఎస్ఐ ఉద్యోగానికి సన్నద్ధమవుతోంది. అటు కూతురు ఆలనా, పాలనా చూస్తూ.. ఇటు ఉద్యోగానికి సన్నద్ధమవుతూ వచ్చింది. అష్టకష్టాలోర్చుతూ చివరికి ఆని శివ తన లక్ష్యాన్ని ముద్దాడింది. కేరళలోని వర్కాలా పీఎస్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా విధుల్లో చేరి.. అందరిచే ప్రశంసలు అందుకుంటోంది.

తన ఈ విజయ ప్రస్థానంపై స్పందించిన ఆని శివ.. ‘‘నేను అనేక అవమానాలు, చీత్కారాలు ఎదుర్కొన్నాను. వాటన్నింటినీ ఎదుర్కొని నా లక్ష్యాన్ని నేను చేరుకున్నారు. ఇతర మహిళలు సైతం తమ కాళ్లమీద తాము నిలబడటానికి తన జీవితం ఒక ప్రేరణగా నిలబడటం నేను సంతోషంగా భావిస్తాను’’ అని సబ్ ఇన్‌స్పెక్టర్ ఆని శివ పేర్కొన్నారు.

Also read:

Surya: యదార్ధసంఘటన ఆధారంగా రానున్న సూర్య కొత్త చిత్రం… ఫస్ట్ లుక్ ఎప్పుడంటే…?? ( వీడియో )

Top Movies: జాతీయ స్థాయిలో నెంబర్ 1 లో బన్నీ… నెంబర్ 4 లో ప్రభాస్… ( వీడియో )

Anchor Ravi: భార్యను రెడీ చేస్తున్న యాంకర్‌ రవి… వైరల్ అయిన ఇన్‌స్టాగ్రామ్ వీడియో…