Sero Survey: 51 శాతం పిల్లల్లో కరోనాను ఎదుర్కొనే యాంటీబాడీలు.. తాజాగా జరిపిన సర్వేలో వెల్లడి

Sero Survey: గత ఏడాదికిపైగా కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను సైతం కుదిపేసింది. ప్రస్తుతం సెకండ్‌ వేవ్‌ కొనసాగుతుండగా, ఇప్పుడు థర్డ్‌వేవ్‌ రానుంది. ఇక ఈ థర్డ్‌వేవ్‌..

Sero Survey: 51 శాతం పిల్లల్లో కరోనాను ఎదుర్కొనే యాంటీబాడీలు.. తాజాగా జరిపిన సర్వేలో వెల్లడి
India Covid Cases
Follow us
Subhash Goud

|

Updated on: Jun 29, 2021 | 6:48 AM

Sero Survey: గత ఏడాదికిపైగా కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను సైతం కుదిపేసింది. ప్రస్తుతం సెకండ్‌ వేవ్‌ కొనసాగుతుండగా, ఇప్పుడు థర్డ్‌వేవ్‌ రానుంది. ఇక ఈ థర్డ్‌వేవ్‌ వస్తే పిల్లలపై అధిక ప్రభావం చూపనుందని ఇప్పటికే పరిశోధకులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ముంబాయిలో దాదాపు 51 శాతం పిల్లల్లో కరోనాను ఎదుర్కొనే యాంటీబాడీలు ఉన్నట్లు తాజాగా జరిపిన సీరో సర్వేలో తేలింది. ఇప్పటికే అక్కడ సగానికిపైగా పిల్లలు వైరస్‌ ప్రభావానికి గురైనట్లు ముంబై మున్సిపల్‌ అధికారులు చేపట్టిన ఈ సర్వేలో వెల్లడైంది.

దేశంలో కరోనా థర్డ్‌వేవ్‌ అనివార్యమని కేంద్ర సర్కార్‌ ఇప్పటికే స్పష్టం చేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు అప్రమత్తమై చర్యలు తీసుకుంటున్నాయి. అయితే సెకండ్‌వేవ్‌ కొనసాగుతున్న సమయంలో 1 నుంచి 18 ఏళ్ల పిల్లలపై వైరస్‌ ప్రభావం ఏ విధంగా ఉందని తెలుసుకునేందుకు బృహన్‌ముంబాయి మునిసిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు ఏప్రిల్‌ -జూన్‌ 15 మధ్యకాలంలో సీరో సర్వే చేపట్టారు. ఇందులో భాగంగా 2176 మంది చిన్నారుల నుంచి రక్తం నమూనాలను సేకరించారు. వీటిని ల్యాబ్‌లలో పరీక్షించారు. వాటిలో దాదాపు 51.1శాతం నమూనాల్లో కరోనా యాంటీబాడీలు ఉన్నట్లు గుర్తించారు. 18 ఏళ్లలోపు ఉన్న పిల్లలపై ఈ సర్వే నిర్వహించగా, వీరిలో 10-14 ఏళ్ల పిల్లల్లోనే సీరో పాజిటివిటీ అధికంగా ఉన్నట్లు తేలింది. అలాగే 1-4 ఏళ్ల పిల్లల్లో 51 శాతం, 5-9 ఏళ్ల మధ్య ఉన్న చిన్నారుల్లో 47 శాతం, 10-14 ఏళ్ల వయసు వారిలో 53 శాతం సీరో పాజిటివిటీ ఉందని వెల్లడైంది. ఇలా 1 నుంచి 18 ఏళ్ల వయసు గల చిన్నారుల్లో సీరో పాజిటివిటీ రేటు 51.18 శాతంగా ఉన్నట్లు ఈ సర్వే ద్వారా తేలింది.

అయితే ముంబాయి నగరంలో కోవిడ్‌ ప్రభావం ఏ మేరకు ఉందో అంచనా వేసేందుకు బృహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు ఎప్పటికప్పుడు సీరో సర్వే చేపడుతున్నారు. ఇప్పటి వరకు మూడు సీరో సర్వేలను నిర్వహించారు. తాజాగా నిర్వహించిన సర్వేలో పిల్లల్లో యాంటీబాడీలులు ఉన్నట్లు గుర్తించారు అధికారులు. కాగా, దేశంలో మహారాష్ట్రలో అధికంగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. అందులో ముంబై నగరంలో కూడా భారీగానే పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. కరోనాను కట్టడి చేసేందుకు ముంబై అధికారులు కఠిన చర్యలు చేపడుతున్నారు. మాస్కు లేకుండా బయటకువచ్చే వారికి భారీగానే జరిమానా విధించారు. ఇలా కఠిన చర్యలు తీసుకోవడం వల్లే పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నాయి.

Coronavirus: కరోనా గురించి షాకింగ్ విషయం కనుగొన్న శాస్త్రవేత్తలు.. 20 వేల ఏళ్ల క్రితమే ఒకసారి ప్రపంచాన్ని కుదిపేసింది!!

Global Vaccination: కోవిడ్ వ్యాక్సినేషన్‌లో సరికొత్త రికార్డు.. బ్రిటన్, అమెరికాలను దాటేసిన భారత్