Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coronavirus: కరోనా గురించి షాకింగ్ విషయం కనుగొన్న శాస్త్రవేత్తలు.. 20 వేల ఏళ్ల క్రితమే ఒకసారి ప్రపంచాన్ని కుదిపేసింది!!

Coronavirus: కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచానికి నిద్రపట్టకుండా చేస్తోన్న పేరు. దాదాపుగా ప్రపంచం అంతా స్తంభించిపోయేలా చేసిన మహమ్మారి.

Coronavirus: కరోనా గురించి షాకింగ్ విషయం కనుగొన్న శాస్త్రవేత్తలు.. 20 వేల ఏళ్ల క్రితమే ఒకసారి ప్రపంచాన్ని కుదిపేసింది!!
Coronavirus
Follow us
KVD Varma

|

Updated on: Jun 28, 2021 | 2:25 PM

Coronavirus: కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచానికి నిద్రపట్టకుండా చేస్తోన్న పేరు. దాదాపుగా ప్రపంచం అంతా స్తంభించిపోయేలా చేసిన మహమ్మారి. ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలను ఛిన్నాభిన్నం చేసేసిన కనిపించని శత్రువు. దీనిపై పోరాటం ప్రపంచం అంతా జరుగుతోంది. వైరస్ లను సమర్ధంగా అడ్డుకోగాలిగేది ఒక్క టీకా మాత్రమె. అందుకే వేగంగా టీకా పరిశోధనలు పూర్తి చేసి వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చాయి ప్రభుత్వాలు. ఇప్పుడు ప్రపంచం అంతా కరోనాకు వ్యతిరేకంగా టీకా యుద్ధం ముమ్మరంగా సాగుతోంది. మరోవైపు కరోనా వైరస్ పై తీవ్ర పరిశోధనలూ వేగంగా జరుగుతున్నాయి. దీని మూలాలు తెలుసుకునే ప్రయత్నాలు చాలా దేశాలు గట్టిగానే చేస్తున్నాయి. ఈ క్రమంలో శాస్త్రవేత్తలు విభ్రాంతి కొలిపే అంశాన్ని కనుగొన్నారు. మనం నిన్నా మొన్నా వచ్చిందని భావిస్తున్న కరోనా వైరస్ వేల ఏళ్ల క్రితమే ప్రపంచాన్ని గడగడ లాదించింది అనేదే ఆ అంశం.

పరిశోధకులు చెబుతున్న దాని ప్రకారం 20 వేల సంవత్సరాల క్రితం కూడా కరోనా వైరస్ వినాశనానికి కారణమైంది. అప్పుడు తూర్పు ఆసియాలో ప్రమాదకరమైన వైరస్ వ్యాప్తి చెందింది. ఇక్కడి పూర్వీకుల డీఎన్‌ఏ విశ్లేషించిన పరిశోధకులు ఈ వివరాలు చెప్పారు. ఈ విశ్లేషణలో DNA ప్రోటీన్లో దీనికి సంబంధించిన ఆధారాలు లభించాయి. కోవిడ్ -19 కారణంగా ఆ యుగపు ప్రజల DNA లో కనిపించే మార్పులు ఇప్పటికీ కనిపిస్తున్నాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అంతర్జాతీయ పరిశోధకులు, క్వీన్స్లాండ్ విశ్వవిద్యాలయం చేసిన సంయుక్త పరిశోధనలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

పరిశోధన కోసం మానవులకు సంబంధించిన 1000 జీనోమ్స్ ప్రాజెక్ట్ నుండి డేటా ఉపయోగించుకున్నారు. కరోనా (SARS-Cov-2) సంక్రమణకు సంబంధించిన ప్రోటీన్ కోడ్ ఏ మానవ జన్యువులలో మారిందో తెలుసుకోవడానికి ఈ సందర్భంగా ప్రయత్నించారు. పరిశోధన రెండవ అంచులో, తూర్పు ఆసియా ప్రజల DNA పరీక్ష నివేదికను ముందుకు తెచ్చారు. 20 వేల సంవత్సరాల క్రితం అంటువ్యాధిని వ్యాప్తి చేసిన వైరస్ కొత్త కరోనావైరస్ మాదిరిగానే ఉందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. పరిశోధకుడు కిరిల్ అలెగ్జాండ్రోవ్ ఈ డీఎన్ఏ విశ్లేషణ ఎలా వుంటుందో వివరించారు. ఒక చెట్టు జీవితకాలం తెలుసుకోవడానికి ఉపయోగించే పధ్ధతి ఎలా ఉంటుందో దాదాపుగా అదేవిధంగా మానవ జన్యువు నుంచి వెయ్యి సంవత్సరాల పూర్వపు రహస్యాలను శోధించవచ్చు. చెట్టు కాండం లో రింగులను బట్టి దాని వయసును నిర్ధారిస్తారు. అలాగే DNA లో మార్పులకు సంబంధించిన గుర్తులు దీనిని నిర్ధారిస్తాయి. ఇక 20 వేల సంవత్సరాల క్రితం ఈ అటువంటి వ్యాధి వ్యాప్తి చెందినప్పుడు, ఔషధం, టీకా కూడా లేదని పరిశోధకుడు కిరిల్ చెప్పారు. కాలక్రమేణా, మానవ శరీరం ఈ వైరస్ ను అంగీకరించింది. ఆ తరువాత క్రమంగా అది తటస్థంగా మారింది అని ఆయన వివరించారు. అప్పుడు కూడా జంతువుల నుండి మానవునికి చేరిన ఈ వైరస్లు నాశనానికి కారణమయ్యాయని భావిస్తున్నారు.

కోవిడ్ -19 కారణంగా గత 18 నెలల్లో 38 లక్షలకు పైగా మరణాలు సంభవించాయి. జంతువుల నుండి మానవులకు సంక్రమించి నాశనానికి కారణమైన మొదటి వైరస్ ఇది ఒక్కటే కాదు. SARS (తీవ్రమైన అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్) వైరస్ చైనా లో 2002 లో వెలుగు చూసింది. దీని సంక్రమణ వల్ల 800 మందికి పైగా మరణించారు. అదేవిధంగా మెర్స్-కోవి మొదటిసారిగా 2012 లో కనబడింది. ఈ వైరస్ సోకి 850 మంది మరణించారు.

Also Read: Delta Plus variant: వణికిస్తున్న డెల్టా వేరియంట్.. తమిళనాడులో తొలి మరణం నమోదు..

Corona Lambda: క‌ల‌వ‌ర‌పెడుతోన్న క‌రోనా కొత్త‌ వేరియంట్ ‘లాంబ్డా’.. హెచ్చ‌రిస్తోన్న ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌..