Miracle Hen: ఒకే రోజులో ఏకంగా 11 గుడ్లు పెట్టి వార్తల్లో నిలిచిన బంగారు కోడి పెట్ట.. ఎక్కడంటే..

Miracle Hen: కోడి ఎక్కడైనా రోజుకి ఎన్ని గుడ్లు పెడుతుంది.. అంటే.. టక్కున ఒకటి అని చెప్పేస్తాం.. కానీ ఇప్పుడు ఒకటి అని చెప్పడానికి ఆలోచించాలి. ఎందుకంటే ఓ కోడి .. రోజులో ఒకటి కాదు. రెండు కాదు ఏకంగా..

Miracle Hen: ఒకే రోజులో ఏకంగా 11 గుడ్లు పెట్టి వార్తల్లో నిలిచిన బంగారు కోడి పెట్ట.. ఎక్కడంటే..
Kerala
Follow us
Surya Kala

|

Updated on: Jun 29, 2021 | 7:45 AM

Miracle Hen: కోడి ఎక్కడైనా రోజుకి ఎన్ని గుడ్లు పెడుతుంది.. అంటే.. టక్కున ఒకటి అని చెప్పేస్తాం.. కానీ ఇప్పుడు ఒకటి అని చెప్పడానికి ఆలోచించాలి. ఎందుకంటే ఓ కోడి .. రోజులో ఒకటి కాదు. రెండు కాదు ఏకంగా 11 గుడ్లు పెట్టి అందరికీ షాక్ ఇచ్చింది. ఇది నిజమేనా అంటూ స్థానికులు ఆశ్చర్య పోయారు. ప్రస్తుతం ఈ కోడి వార్తల్లో నిలిచింది. ఈ వింత సంఘటన కేరళలో చోటు చేసుకుంది.

కేరళలో కోజికోడ్ జిల్లా బాలుస్సెరీ సమీపంలో ఉన్న కొలతూరులో ఈ విచిత్ర ఘటన జరిగింది. కొలతూరుకి చెందిన మనోజ్ కొని రోజుల క్రితం నుంచి కోడిని పెంచుకుంటున్నాడు. అయితే ఈ కోడి.. మంగళవారం వరకూ రోజుకు ఒక గుడ్డు పెట్టింది. బుధవారం రెండు గుడ్లు పెట్టిందట. అయితే గురువారం (25వ తేదీన) ఆ కోడి ఉదయం 7 గంటలకు గుడ్లు పెట్టడం మొదలు పెట్టింది. అలా మధ్యాహ్నం ఒంటి గంట వరకూ కొంచెం గ్యాప్ ఇచ్చి ఒకొక్క గుడ్డు పెడుతూ వచ్చిందని మనోజ్ చెప్పారు. అలా ఈ నాలుగు గంటల సమయంలో మొత్తం 11 గుడ్లు పెట్టింది. ఆ గుడ్లలో 10 మాములు గుడ్ల సైజులో ఉండగా.. అందులో ఒక గుడ్డు మాత్రం కాస్త పెద్ద సైజులో ఉంది. ఈ కోడి గురించి తెలిసిన స్థానికులు ప్రజలు దాన్ని చూసేందుకు వస్తున్నారు.

అయితే ఈ బంగారు కోడి పెట్టను తాను 4 నెలల క్రితం బంధువుల ఇంటి నుంచి ఆ కోడిపెట్టను తీసుకొచ్చినట్లు మనోజ్ తెలిపారు. హార్మోన్ల ప్రభావం వల్లే సాధారణం కంటే ఎక్కువ గుడ్లను పెట్టి ఉంటుందని పౌల్ట్రీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Also Read:    జూలై నెలలో తెలుగు రాష్ట్రాల్లోని బ్యాంకులకు ఎన్ని సెలవులు వచ్చాయంటే..

ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్