AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Darbhanga Blast: దర్బంగా పేలుళ్ల వెనుక హైదరాబాదీలు.. ఆ ఇద్దరిని అరెస్ట్ చేసి NIA

ఈ నెల 15న కారులో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వచ్చిన ఇద్దరు సోదరులు రైల్వే కౌంటర్ వద్ద వస్త్రాల పార్శిల్‌ను అందజేసినట్లు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించారు. వారిద్దరిని సోమవారం అరెస్టు చేశారు.

Darbhanga Blast: దర్బంగా పేలుళ్ల వెనుక హైదరాబాదీలు.. ఆ ఇద్దరిని అరెస్ట్ చేసి NIA
Nia Arrest
Sanjay Kasula
|

Updated on: Jun 29, 2021 | 10:31 AM

Share

దేశంలో ఎక్కడ ఉగ్రదాడులు జరిగినా మూలలు మాత్రం హైదరాబాద్‌లో కనిపిస్తుంటాయి. చాలాకాలంగా భాగ్యనరంపై ఇలాంటి అపవాదు ఉంది. ఇది నిజమే అని మరో సారి తేలింది. బీహార్‌లోని దర్బంగా రైల్వే స్టేషన్‌లో చోటు చేసుకున్న పేలుడుకు సెంటర్ పాయింట్ హైదరాబాద్ పాతబస్తీలో తేలింది. ఈ నెల 17న దర్బంగా రైల్వే స్టేషన్‌లోని ఒకటో నెంబర్ ప్లాట్ ఫామ్ వద్ద సికింద్రాబాద్‌ నుంచి వచ్చిన రైలు నుంచి ఓ వస్త్రాల వ్యాపారి పార్సిల్ దింపుతుండగా ఒక్కసారిగా పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు.

సీసీటీవీ ఫుటేజ్ ద్వారా..

ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఇమ్రాన్, నాసిర్ హైదరాబాద్ ఆసిఫ్ నగర్ లో మకాం వేశారు. అసిఫ్‌నగర్‌‌లో బట్టల దుకాణం నడుపుతున్నారు. ఈ నెల 15న కారులో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వచ్చిన ఇద్దరు సోదరులు రైల్వే కౌంటర్ వద్ద వస్త్రాల పార్శిల్‌ను అందజేసినట్లు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించారు. వారిద్దరిని సోమవారం అరెస్టు చేశారు. ఆసిఫ్‌నగర్‌లో ఉంటున్న ఇమ్రాన్‌, నాసిర్‌ స్వస్థలం యూపీలోని కురిసి అని అధికారులు తెలిపారు.

ఆర్డర్లపై పలు ప్రాంతాలకు గార్మెంట్స్‌ను తరలిస్తుంటారు. ఈ క్రమంలోనే ఈ పార్సీలు పంపారు. వస్త్రాల మధ్య ఉన్న ఓ సీసాలో ఉన్న ద్రవపదార్థం కారణంగా పేలుడు సంభవించింది. యూపీలో అరెస్ట్ అయిన తండ్రి కొడుకులు కూడా వీరి పేర్లు చెప్పారు . CCTV ఫుటేజ్ లో కూడా ఈ ఘటన వెనక వీరి పాత్ర విస్పష్టమైంది.

ఉగ్ర కుట్ర…

దర్భంగా పేలుడు వెనుక ఉగ్ర కు‌ట్ర దాగి ఉందని, రసాయనం ద్వారా రైలులో అగ్నిప్రమాదంతో భారీ విధ్వంసం సృష్టించాలన్న లక్ష్యంతోనే నిందితులు దీనికి పాల్పడ్డారని అధికారులు నిర్ధారణకు వస్తున్నారు. ఈ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ఇప్పటివరకు నలుగురిని అదుపులోకి తీసుకుంది.

బ్యాంక్ ఖాతాలో…

ఐసిస్‌ ప్రోద్బలంతోనే ఈ విధ్వంసానికి కుట్ర పన్నినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. అంతేకాదు నిందితుల బ్యాంకు ఖాతాల్లో భారీగా నగదు జమ కావడమే నిదర్శనమని చెబుతున్నారు. వీటిని ఎవరు పంపారన్న కోణంలో దర్యాప్తు మొదలు పెట్టారు. అసలు ఇందులో ఉపయోగించిన కెమికల్ ఏమిటన్నది తెలుసుకునేందుకు పరీక్షల కోసం కోలకతా సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ ప్రయోగశాల(CFSL)కు పంపారు. అసలు ఈ రసాయనం ఎలా సంపాదించారన్న కోణంలో నిందితులను విచారిస్తున్నారు.

ఇవి కూడా చదవండి: Telangana Congress: అసమ్మతి రాగం.. అసంతృప్తి తాళం.. ఇవే పీసీసీ కొత్త బాస్‌ ముందున్న సవాళ్లు..

Cyber Crime: హైదరాబాద్‌లో మరో సైబర్ మోసం.. KYC అప్‌డేట్ పేరుతో 9 లక్షలు మాయం..

Andhra Pradesh Govt: పాఠశాలకు సమీపంలో గుట్కా, పాన్ షాపులకు అనుమతి లేదు..