Telangana Congress: అసమ్మతి రాగం.. అసంతృప్తి తాళం.. ఇవే పీసీసీ కొత్త బాస్‌ ముందున్న సవాళ్లు..

గాంధీ భవన్‌‌లో నడుస్తున్న రాజకీయంలో తర్వాత ట్విస్ట్ ఏంటి..? కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిపై హైకమాండ్ వేటు వేస్తుందా..? లేక ఆయనే గతంలో మాదిరి కాంప్రమైజ్ అవుతారా..? కాంగ్రెస్‌లో కనిపిస్తున్న నిశబ్ధ తుఫానుకు ముందు ప్రశాంతత లాంటిదా..?

Telangana Congress: అసమ్మతి రాగం.. అసంతృప్తి తాళం.. ఇవే పీసీసీ కొత్త బాస్‌ ముందున్న సవాళ్లు..
Internal Challenges To The
Follow us
Sanjay Kasula

|

Updated on: Jun 29, 2021 | 9:38 AM

కాంగ్రెస్ ఏమాత్రం మారలేదు. అప్పుడెలా ఉందో.. ఇప్పుడూ అలానే ఉంది. అదే అసమ్మతి రాగాలు… అవే హెచ్చరికలు.. అవే బుజ్జగింపులు.. అంతా సేమ్ టూ సేమ్. అంతా అర్థమైనట్లే ఉంటుంది… కానీ ఏం అర్థం కాదు.. కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్‌లో లేటెస్ట్ సెన్సేషన్. తెలంగాణ పీసీసీకి కొత్త కార్యవర్గాన్ని ప్రకటించిన తర్వాత పార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి. ఇలా పీసీసీ ప్రకటన వచ్చిందో లేదో.. అలా మాజీ ఎమ్మెల్యే.. మేడ్చల్ నియోజకవర్గం ఇంచార్జ్ కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి (కేఎల్ఆర్) రాజీనామా చేశారు. పీసీసీ కార్యవర్గంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దానికి కంట్యూనేషన్‌గా కోమటి రెడ్డి వ్యాఖ్యలతో కాంగ్రెస్ రాజకీయం భగ్గుమంది.

టీపీసీసీ అధ్యక్ష పదవిని నోట్లిచ్చి ఓట్లు కొనుక్కున్నట్టు అనుకున్నారంటే వెంకట్ రెడ్డి చేసిన కామెంట్ కాంగ్రెస్‌లో భూకంపం పుట్టించింది. ఆయన నేరుగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిని టార్గెట్ చేసి ఆరోపణలు చేయడం… ఆధారాలతోపాటు నిరూపిస్తానిని అనడంతో పార్టీ శ్రేణుల్లో కలవరం రేపింది. టీపీసీసీ, టీడీపీసీసీగా మారిందని హుజురాబాద్‌లో డిపాజిట్లైనా తెచ్చుకోవాలంటూ హార్డ్ కోర్ సెటైర్లు వేశారు.

కోమిటిరెడ్డి వ్యాఖ్యలతో కొత్తగా ఎంపికైన కార్యవర్గంలోని నేతలు కూడా అదే రేంజ్‌లో సీరియస్ అయ్యారు. హైకమాండ్‌కు కంప్లెయింట్ చేశారు. దీంతో పార్టీ అధినాయకత్వం కోమటి రెడ్డిపైన సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. ఏఐసీసీ నిర్ణయాన్ని దిక్కరిస్తే చర్యలు తప్పవంటూ హెచ్చరించినట్లుగా సమాచారం. దీంతో కోమిటిరెడ్డి మెత్తబడినట్లుగా పార్టీలో చర్చించుకుంటున్నారు.

హైకమాండ్ రంగంలోకి దిగడంతో రేవంత్ కూడా పని మొదలు పెట్టారు. పీసీసీ అధ్యక్షుడిగా ప్రకటించగానే.. పెద్దలు జానారెడ్డిని కలిసిన రేవంత్.. ఆ తర్వాత ఒక్కొక్కరు సీనియర్ నేత ఇళ్లకు వెళ్లి కలిసి వారి ఆశీస్సులు తీసుకుంటున్నారు. తాజాగా పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల నివాసంకు వెళ్లి ఆయనను కలిశారు.  అక్కడి నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వీహెచ్‌ను కలిసి పరామర్శించారు.

రేవంత్‌ను పీసీసీ బాస్‌గా ప్రకటించి 48 గంటలు దాటుతున్నా.. ఇంతవరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ.. సీఎల్పీ నేత భట్టీ విక్రమార్క, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, జీవన్ రెడ్డి ఇప్పటి వరకు కలవలేదు. వీరిలో కొందరు హైదరాబాద్‌లోనే ఉన్నా… రేవంత్‌ను సంప్రదించలేదని తెలుస్తోంది. రేవంత్‌ వాళ్లను కలిసేందుకు ప్రయత్నిస్తున్నా… కావాలనే దూరం జరుగుతున్నరని పార్టీలోని కొందరు అనుకుంటున్నారు.

అందరినీ కలుపుకుపోతానని చెబుతున్నా రేవంత్ రెడ్డికి… అదంత తేలికగా కనిపించడం లేదు. కాంగ్రెస్‌లో ప్రజాస్వామ్యం ఎక్కువ. ఎప్పుడు.. ఎవరు ఎలా స్పందిస్తారో ఊహించడం చాలా కష్టం. అసమ్మతి రాగం. అసంతృప్తి తాళం.. బుజ్జగిపుల మేళం.. కాంగ్రెస్‌లో అంతా కామన్.. అలజడి సద్దుమనిగాకా కాంగ్రెస్‌లో కామన్ అని సరిపెట్టుకోవల్సిందే తప్పా.. పార్టీ క్రమశిక్షణ, బాధ్యతాయుత ప్రవర్తన వంటి వాటిని ఆశించడం అత్యాశే..

ఇవి కూడా చదవండి : Cyber Crime: హైదరాబాద్‌లో మరో సైబర్ మోసం.. KYC అప్‌డేట్ పేరుతో 9 లక్షలు మాయం..

Andhra Pradesh Govt: పాఠశాలకు సమీపంలో గుట్కా, పాన్ షాపులకు అనుమతి లేదు..

Bank Holidays in July 2021: జూలై నెలలో తెలుగు రాష్ట్రాల్లోని బ్యాంకులకు ఎన్ని సెలవులు వచ్చాయంటే..

తెలుగోడి దెబ్బ.. సౌతాఫ్రికా అబ్బా..బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు..
తెలుగోడి దెబ్బ.. సౌతాఫ్రికా అబ్బా..బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు..
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా