Kamal Haasan: సినిమాటోగ్రఫీ చట్ట సవరణ ప్రతిపాదనపై మండిపడిన కమల్ హాసన్..ఏమన్నారంటే ..?
సినిమాటోగ్రఫీ చట్ట (2021) సవరణ ప్రతిపాదనపై నటుడు, పొలిటీషియన్ కమల్ హాసన్ మండిపడ్డారు.
సినిమాటోగ్రఫీ చట్ట (2021) సవరణ ప్రతిపాదనపై నటుడు, పొలిటీషియన్ కమల్ హాసన్ మండిపడ్డారు. సినిమాల విడుదలకు అనుమతిస్తూ సెన్సార్ బోర్డు జారీ చేసిన సర్టిఫికెట్ ను కూడా పక్కన బెట్టి రివ్యూ చేసే అధికారాలను కేంద్రానికి కట్టబెట్టే ఈ ప్రతిపాదన తమకు సమ్మతం కాదని ఆయన అన్నారు. చెన్నైలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన…’చెడు వినకు’, చెడు మాట్లాడకు’, అన్న టైపు కోతుల్లా చూస్తూ తాము ఊరుకోలేమన్నారు. సినిమా, మీడియా మొదలైనవి ఈ విధంగా ఉండజాలవని..ఈ ప్రపోజల్ పై సినిమా రంగం స్పందించాలని కోరారు. స్వేచ్ఛ కోసం గళమెత్తాలని అన్నారు. 1952 నాటి సినిమాటోగ్రఫీ చట్టానికి సవరణలు చేస్తున్నామని…దీనికి జులై 2 లోగా సినీ రంగం తమ స్పందనను తెలియజేయాలని కేంద్రం గత వారం జారీ చేసిన ఓ నోటిఫికేషన్ లో పేర్కొంది. ఈ డ్రాఫ్ట్ బిల్లుపై కామెంట్స్ ను కోరగా..దీనికి చిత్ర నిర్మాతలు తమ రెస్పాన్స్ ని కూడా తెలిపారు. ఈ చట్టానికి సవరణలు చేసిన పక్షంలో..సెన్సార్ బోర్డు ఇదివరకే క్లియర్ చేసిన మూవీలను తిరిగి సమీక్షించడానికి కేంద్రానికి అధికారాలు లభిస్తాయి. పైగా అప్పిలేట్ బోర్డుకు కూడా ఎలాంటి పవర్స్ ఉండబోవు. ఇది తమ భావ ప్రకటనా స్వేచ్చకు భంగం కలిగించడమేనని దర్శక నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సెన్సార్ బోర్డు సినిమాలను క్లియర్ చేసినా….సెక్షన్ బీ (1) ని అతిక్రమించారా అన్న విషయాన్ని ఈ సవరణ మేరకు కేంద్రం పరిశీలించవచ్చు.. ఈ విధమైన సవరణలు మేలు చేసేవి కావని ఫిల్మ్ మేకర్స్ అభిప్రాయపడుతున్నారు. అంటే సెన్సార్ బోర్డు అధికారాలను కుదించినట్టే అని వారు పేర్కొంటున్నారు. దేశవ్యాప్తంగా సినీ రంగం ఈ సవరణ ప్రతిపాదనను వ్యతిరేకించాలని వీరు కోరుతున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Encounter: జమ్మూకాశ్మీర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం.. మృతుల్లో ఎల్‌టీఈ టాప్ కమాండర్