Petrol And Diesel Price: వంద మార్కును దాటేసిన పెట్రోల్.. తెలుగు రాష్ట్రాల్లో అన్ని చోట్ల సెంచరీ కొట్టిన లీటర్ పెట్రోల్..
Petrol And Diesel Price: అనుకున్నట్లే జరిగింది. లీటర్ పెట్రోల్ ధర సెంచరీ కొట్టేసింది. కొన్ని రోజుల క్రితం వరకు రూ. 98-99 వద్ద ఊగిసలాడిన పెట్రోల్ ధర ఇప్పుడు ఏకంగా కొన్ని ప్రాంతాల్లో రూ. 104కి చేరింది. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో...
Petrol And Diesel Price: అనుకున్నట్లే జరిగింది. లీటర్ పెట్రోల్ ధర సెంచరీ కొట్టేసింది. కొన్ని రోజుల క్రితం వరకు రూ. 98-99 వద్ద ఊగిసలాడిన పెట్రోల్ ధర ఇప్పుడు ఏకంగా కొన్ని ప్రాంతాల్లో రూ. 104కి చేరింది. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు అన్ని పట్టణాల్లో ఈ మార్కును దాటేసింది. అయితే మంగళవారం పెద్దగా పెట్రోల్ ధరల్లో మార్పులు లేకపోయినప్పటికీ రూ. వంద దాటిన లీటర్ పెట్రోల్‌ను చూస్తుంటే భయపడే పరిస్థితి వచ్చింది. దేశ వ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో మంగళవారం పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
* దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 98.46 గా ఉండగా, డీజిల్ ధర రూ. 88.90 వద్ద కొనసాగుతోంది. * దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ. 104.56 వద్ద ఉండగా, డీజిల్ ధర రూ. 96.42 గా నమోదైంది. * తమిళనాడు రాజధాని చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 99.49 గా ఉండగా, డీజిల్ ధర రూ. 93.46 వద్ద కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే..
తెలుగు రాష్ట్రాల పెట్రోల్ ధరలు భగ్గుమంటున్నాయి. అన్ని చోట్ల వంద మార్కును దాటేసింది. ఇక మంగళవారం రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఇంధన ధరలు ఇలా ఉన్నాయి. * హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 102.32 గా ఉండగా, డీజిల్ ధర రూ. 96.90 వద్ద కొనసాగుతోంది. * వరంగల్ లో పెట్రోల్ రూ. 102.20 కాగా, డీజిల్ ధర రూ. 96.77 గా ఉంది. * ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ. 104.61 గా ఉండగా, డీజిల్ ధర రూ. 98.58 గా ఉంది. * విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 103.41 వద్ద కొనసాగుతుండగా, డీజిల్ ధర రూ. 97.41 గా నమోదైంది. * ఇక అనంతపురం, చిత్తూరు, గుంటూరు, కృష్ణా, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం… ఇలా చెప్పుకుంటే దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ. 104 దాటేసింది.
Also Read: Accident: పెళ్లికి వెళ్లి వస్తుండగా ఘోర ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం.. నలుగురి పరిస్థితి విషమం
Gold and Silver Price Today: దేశీయంగా నిలకడగా ఉన్న బంగారం ధరలు.. అక్కడ మాత్రం స్వల్పంగా తగ్గింది