AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LIC Loan: ఎల్‌ఐసీ పాలసీదారులకు గుడ్‌న్యూస్‌.. సులభంగా రుణాలు పొందే సదుపాయం.. ఏఏ పాలసీలపై అంటే..!

LIC Loan: ప్రస్తుతం రుణాలు తీసుకోవడం అనేది సులభతరమైంది. వివిధ రకాల బ్యాంకులు, బీమా సంస్థల రుణాలు పొందాలంటే సులభతరమైన పద్దతులను అందుబాటులోకి వచ్చాయి..

LIC Loan: ఎల్‌ఐసీ పాలసీదారులకు గుడ్‌న్యూస్‌.. సులభంగా రుణాలు పొందే సదుపాయం.. ఏఏ పాలసీలపై అంటే..!
పాలసీ సమయంలో పాలసీదారు మరణించినట్లయితే.. కుటుంబ సభ్యులు లేదా నామినీగా ఉన్నవారికి ప్రతి సంవత్సరం కంపెనీ నుండి రెగ్యులర్‌గా ఆదాయాన్ని పొందుతారు.
Subhash Goud
|

Updated on: Jun 29, 2021 | 6:40 AM

Share

LIC Loan: ప్రస్తుతం రుణాలు తీసుకోవడం అనేది సులభతరమైంది. వివిధ రకాల బ్యాంకులు, బీమా సంస్థల రుణాలు పొందాలంటే సులభతరమైన పద్దతులను అందుబాటులోకి వచ్చాయి. అయితే మీకు ఎల్‌ఐసీ పాలసీ ఉందా..? అయితే మీరు సులభంగానే రుణం పొందే వెసులుబాటు ఉంది. ఎల్ఐసీ పాలసీదారులు వారి పాలసీపై వ్యక్తిగత రుణం పొందవచ్చు. అంటే పాలసీని తనఖా పెట్టాలి. వ్యక్తిగత రుణంపై బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేటు కన్నా .. ఎల్‌ఐసీ పాలసీపై పొందే రుణాలపై వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది. అయితే అన్ని రకాల పాలసీలపై రుణ సౌకర్యం పొందటానికి వీలు ఉండదు. టర్మ్, హెల్త్ ప్లాన్లపై రుణాలు తీసుకునేందుకు అవకాశం ఉండదు. మనీ బ్యాక్, ఎండోమెంట్, యాన్యుటీ వంటి పలు రకాల పాలసీలపై రుణం పొందేందుకు వీలుంటుంది.

మీ పాలసీ విలువలో 90 శాతం మొత్తం వరకే ఎల్‌ఐసీ రుణం అందిస్తుంది. బ్యాంక్ స్టేట్‌మెంట్, శాలరీ స్లిప్, ఆధార్ కార్డు, క్యాన్సల్ చెక్ వంటి డాక్యుమెంట్లు అందించాల్సి ఉంటుంది. పాలసీ డాక్యుమెంటు కచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇకపోతే పాలసీపై లోన్ తీసుకోవడానికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. అయితే ఎల్‌ఐసీ పాలసీ ప్రీమియం కచ్చితంగా మూడేళ్లు చెల్లించి ఉండాలి. కనీసం 6 నెలల టెన్యూర్‌తో రుణం పొందాల్సి ఉంటుంది. లోన్ వడ్డీ డబ్బులను ఏడాదికి రెండు సార్లు కట్టేస్తూ రావాలి. మీరు లోన్ డబ్బులు కట్టకపోతే.. ఎల్‌ఐసీ మీ పాలసీ డబ్బుల్లో లోన్ డబ్బులను కట్ చేసుకుంటుంది. అలాగే మీరు రుణం కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. లేదంటే ఎల్‌ఐసీ కార్యాలయానికి వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

ఇవీ కూడా చదవండి:

Investment Scheme: రోజుకు రూ. 200 ఇన్వెస్ట్‌మెంట్‌తో రూ. 14 లక్షల వరకు ఆదాయం.. ఈ స్కీమ్‌ పూర్తి వివరాలు..!

DOOSRA: సిమ్‌ కార్డు లేకుండానే ఫోన్‌ కాల్స్‌.. రాంగ్ కాల్స్‌కు చెక్‌ పెట్టేందుకు కొత్త యాప్‌ను సృష్టించిన హైదరాబాది

Follow Us
కుర్రకారును ఆకట్టుకుంటున్న ట్రెండింగ్ హీరోయిన్స్
కుర్రకారును ఆకట్టుకుంటున్న ట్రెండింగ్ హీరోయిన్స్
రాబోయే భారీ చిత్రాలకు తప్పని గ్రాఫిక్స్ కష్టాలు
రాబోయే భారీ చిత్రాలకు తప్పని గ్రాఫిక్స్ కష్టాలు
వాహనదారులకు బిగ్‌ అలర్ట్.. త్వరలో పెట్రోల్‌ బైక్స్‌ బ్యాన్..!
వాహనదారులకు బిగ్‌ అలర్ట్.. త్వరలో పెట్రోల్‌ బైక్స్‌ బ్యాన్..!
వందల కోట్లు బూడిదలో పోసిన పన్నీరేనా ?? కారణాలివే
వందల కోట్లు బూడిదలో పోసిన పన్నీరేనా ?? కారణాలివే
స్పిరిట్ పై విమర్శలు.. ఐ డోంట్ కేర్ అంటున్న సందీప్ వంగా
స్పిరిట్ పై విమర్శలు.. ఐ డోంట్ కేర్ అంటున్న సందీప్ వంగా
కలిసి 20 సినిమాలు.. అయినా ఆమెతో 30ఏళ్లు మాట్లాడని హీరో కృష్ణ
కలిసి 20 సినిమాలు.. అయినా ఆమెతో 30ఏళ్లు మాట్లాడని హీరో కృష్ణ
జన నాయగన్‌ను వాళ్లే లీక్ చేశారా ?? పైరసీ వెనుక రాజకీయ కుట్ర
జన నాయగన్‌ను వాళ్లే లీక్ చేశారా ?? పైరసీ వెనుక రాజకీయ కుట్ర
చికెన్‌లోని ఈ పార్ట్స్‌తో జాగ్రత్త.. మర్చిపోయి కూడా తినొద్దు..
చికెన్‌లోని ఈ పార్ట్స్‌తో జాగ్రత్త.. మర్చిపోయి కూడా తినొద్దు..
వంటగది టైల్స్‌పై జిడ్డు మరకలా? ఆ సమస్యకు చెక్ పెట్టండిలా!
వంటగది టైల్స్‌పై జిడ్డు మరకలా? ఆ సమస్యకు చెక్ పెట్టండిలా!
బంగారమే కాదు, అక్షయతృతీయ రోజు ఇవి కొన్నా అదృష్టం కలిసొస్తది!
బంగారమే కాదు, అక్షయతృతీయ రోజు ఇవి కొన్నా అదృష్టం కలిసొస్తది!