Viral Pic: ఢిల్లీ రెస్టారెంట్‌లో సన్నీ లియోన్, మియా ఖలిఫా ఫుడ్.. ఎగబడుతున్న జనాలు.. మ్యాటర్ తెలిస్తే షాక్ అవుతారు..
Viral Pic: ఢిల్లీలోని ఓ రెస్టారెంట్‌లో విక్రయిస్తున్న పలు వంటకాల పేర్లు ఇప్పుడు నెట్టింట రచ్చ రచ్చ చేస్తున్నాయి. వాస్తవానికి మంచి ఫుడ్‌ని..
Viral Pic: ఢిల్లీలోని ఓ రెస్టారెంట్‌లో విక్రయిస్తున్న పలు వంటకాల పేర్లు ఇప్పుడు నెట్టింట రచ్చ రచ్చ చేస్తున్నాయి. వాస్తవానికి మంచి ఫుడ్‌ని తినాలని అందరూ భావిస్తుంటారు. అందకే నిత్యం టేస్టీ ఫుడ్ కోసం ప్రయత్నిస్తుంటారు. ఇక మనదేశంలో వైవిధ్యమైన వంటకాలకు కొదవే లేదని చెప్పాలి. ప్రాంతానికొక వెరైటీ ఫుడ్ లభిస్తుంది. ఈ మాదిరిగానే ఢిల్లీలోనూ ఓ రెస్టారెంట్‌లో ఆసక్తికరమైన పేరుతో ఉన్న ఫుడ్‌ను విక్రయిస్తున్నారు. ఆ ఫుడ్‌కు విపరీతమైన డిమాండ్ ఉంది. ఎక్కడెక్కడి నుంచో వచ్చి కస్టమర్లు దానిని కొనుగోలు చేస్తారు. ఆ ఫుడ్ పేర్లే వాటికి అంత క్రేజ్ తీసుకువచ్చాయి. ఇంతకీ వాటి పేర్లు తెలిస్తే నిజంగా మీరు కూడా షాక్ అవుతారు.
మీకు బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ సన్నీలియోన్, మాజీ పోర్న్ స్టార్ మియా ఖలీఫా పేర్లు తెలిసే ఉంటాయి కదా! ఫుడ్ అని చెబుతూ వీళ్ల పేర్లెందుకు మధ్యలో అని కంగారు పడకండి. అసలు మ్యాటర్ ఇక్కడే ఉంది. ఢిల్లీలోని వీర్ జీ మలై చాప్ రెస్టారెంట్ మెనూలో ‘సన్నీ లియోన్ చాప్’, మియా ఖలీఫా చాప్’ అని రెండు ప్రత్యేక పేర్లతో కూడిన చాప్‌లను అందిస్తోంది ఆ రెస్టారెంట్. ఈ రెండు డిష్‌లకు అక్కడ విపరీతమైన క్రేజ్ ఉంది. అంతేకాదు.. ‘బేబీ డాల్ చాప్’ కూడా ఉంది. ఇలా పేరు పెట్టడానికి రాగిణి ఎంఎంఎస్ 2 సినిమానే కారణం అని చెబుతున్నారు రెస్టారెంట్ నిర్వాహకులు. ఈ సినిమాలో సన్నీ లియోన్ పాట ప్రేరణతోనే ఈ వంటకాలకు ఆ పేర్లు పెట్టడం జరిగిందని, వీటికి విపరీతమై గిరాకీ ఉంటోందని రెస్టారెంట్ నిర్వాహకులు చెబుతున్నారు.
కాగా, ఆన్‌లైన్ పేమెంట్ యాప్ పేటీఎం వ్యవస్థాపకుడు, సీఈఓ విజయ్ శేఖర్ శర్మ ఈ రెస్టారెంట్ ఫోటోను ట్విట్టర్‌లో షేర్ చేశాడు. దాంతో ఈ రెస్టారెంట్ మరింత ఫేమస్ అయిపోయింది. దేశ వ్యాప్తంగా ఈ రెస్టారెంట్ మెనూ చర్చనీయాంశంగా మారింది. బిజినెస్ చేయడానికి ఇదొక అద్భుతమైన ట్రిక్ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరైతే నెగెటీవ్‌గా కామెంట్స్ చేస్తున్నారు. మహిళల పేరు మీద వంటలకు పేరు పెట్టడం సరికాదంటున్నారు.
Viral Pic:
Seriously ! pic.twitter.com/nWJyIos9i1
— Vijay Shekhar Sharma (@vijayshekhar) June 26, 2021
Also read:
Gold and Silver Price Today: దేశీయంగా నిలకడగా ఉన్న బంగారం ధరలు.. అక్కడ మాత్రం స్వల్పంగా తగ్గింది
Telangana Govt: ప్రైవేటు పాఠశాలలకు తెలంగాణ సర్కార్ అల్టిమేటం.. నిబంధనలు ఉల్లంఘించారో..