MP Komatireddy Venkat Reddy: ఇకపై నా దృష్టి అంతా దానిపైనే.. మరోసారి కీలక వ్యాఖ్యలు చేసిన ఎంపీ కోమటిరెడ్డి..

MP Komatireddy Venkat Reddy: ఆశించిన పీసీసీ పదవి దక్కకపోవడంతో.. గాంధీ భవన్ మెట్లెక్కబోనంటూ సంచలన ప్రకటన చేసిన..

MP Komatireddy Venkat Reddy: ఇకపై నా దృష్టి అంతా దానిపైనే.. మరోసారి కీలక వ్యాఖ్యలు చేసిన ఎంపీ కోమటిరెడ్డి..
Komatireddy Venkat Redddy
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 29, 2021 | 5:48 AM

MP Komatireddy Venkat Reddy: ఆశించిన పీసీసీ పదవి దక్కకపోవడంతో.. గాంధీ భవన్ మెట్లెక్కబోనంటూ సంచలన ప్రకటన చేసిన కాంగ్రెస్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. తాజాగా మరోసారి తన రాజకీయ భవిష్యత్ కార్యాచరణపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక‌పై ప్రజా స‌మస్యలు తీర్చేందుకు ప్రజ‌ల‌కు 24 గంట‌లు అందుబాటులో ఉంటాన‌ని అన్నారు. తన‌ను రాజ‌కీయాల్లోకి లాగ‌వ‌ద్దని కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటి నుంచి రాజకీయప‌ర‌మైన‌ విష‌యాల‌పై ఎటువంటి వ్యాఖ్యలు చేయ‌న‌ని.. దానికి స‌హ‌క‌రించాల‌ని జ‌ర్నలిస్టుల‌ను కోరారు.

తాను భువ‌న‌గిరి ఎంపీగా ఎన్నికైన నాటి నుంచి అన్ని గ్రామాల్లో ప‌ర్యటించలేద‌న్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. క‌రోనా కాలంగా కొద్ది గ్రామాలకు మాత్రమే వెళ్లిన‌ట్లు చెప్పుకొచ్చారు. ఇక నుంచి భువ‌న‌గిరి, న‌ల్గొండ పార్లమెంట్ ప‌రిధిలోని ప్రతి గ్రామంలో ప‌ర్యటించి అక్కడ తిష్ట వేసిన స‌మ‌స్యల‌ను తెలుసుకుని వాటి ప‌రిష్కారానికి కృషిచేస్తాన‌ని చెప్పారు. అలాగే గ్రామాల అభివృద్దికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల‌తో పోరాడి నిధులు తీసుకు వ‌చ్చేందుకు ప్రయత్నం చేస్తాన‌ని అన్నారు. అలాగే పూర్తిస్థాయిలో సేవా కార్యక్రమాలపైనే దృష్టి పెట్టాల‌ని నిర్ణయించుకున్నట్లు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రతీక్ ఫౌండేష‌న్ ద్వారా వీలైనంత ఎక్కువ‌గా సేవా కార్యక్రమాలు చేప‌డుతాన‌న్నారు. న‌ల్గొండ జిల్లాతో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఎవ‌రైనా త‌న తలుపు త‌ట్టవ‌చ్చని పేర్కొన్నారు.

ఇక ప్రభుత్వ నిర్లక్ష్యం, ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్టు జాప్యం వ‌ల్ల న‌ల్గొండ జిల్లాలో వేలాది ఎక‌రాలు బీడు వారుతున్నాయని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువ‌స్తాన‌ని తెలిపారు. అలాగే 90 శాతం పూర్తయిన బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టుకు మరో వంద కోట్లు ఖ‌ర్చు చేయాల్సి ఉంది. అది పూర్తయితే.. వేల ఎక‌రాల‌కు సాగునీరు అందుతుంద‌ని ఎంపీ పేర్కొన్నారు. దీనిని పూర్తి చేయించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తానని చెప్పారు. వీటితో పాటు భువ‌న‌గిరి పార్లమెంట్ ప‌రిధిలోని గంధ‌మ‌ల్ల, బ‌స్వాపురం రిజ‌ర్వాయ‌ర్లు త్వరగా అందుబాటులోకి వ‌చ్చేలా స‌ర్కార్‌పై ప్రజ‌ల ప‌క్షాన యుద్ధ చేస్తాన‌ని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటనను విడుదల చేశారు.

ఇంతకాలం పీసీసీ పదవి తనకే వస్తుందని ఆశించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. కొన్ని రోజులు హస్తిన లోనే తిష్టవేసి లాబీయింగ్ చేశారు. చివరికి పీసీసీ పదవికి రేవంత్ రెడ్డిని పేరును అధిష్టానం ఖరారు చేయడంతో ఆయన ఆశలు అడిఆశలయ్యాయి. తీవ్ర అసంతృప్తితో హస్తిన నుంచి తెలంగాణకు వచ్చిన ఆయన.. రావడం రావడంతోనే పీసీసీ చీఫ్ ఎంపికపై సంచలన కామెంట్స్ చేశారు. పీసీసీ పదవిని అమ్ముకున్నారని, కాంగ్రెస్ పీసీసీ కాస్తా టీడీపీ పీసీసీ అయిందంటూ తీవ్ర వ్యాఖ్యలే చేశారు. అంతేకాదు.. తాను అసలు గాంధీ భవన్ మెట్లే ఎక్కబోనని తేల్చి చెప్పారు.

Also read:

JEE Advanced 2021: జేఈఈ అడ్వాన్స్‌ 2021 బ్రోచర్‌ విడుదల.. పూర్తి వివరాలు తెలుసుకోండి..!

Greater Noida: కారులో లిఫ్ట్ ఇచ్చారు.. ఆ తరువాత మెడపై కత్తి పెట్టి లక్ష రూపాయలు దోచుకున్నారు..

Air India Service: ఎయిర్‌ ఇండియా కీలక నిర్ణయం.. జూలై 20 నుంచి గర్నవరం నుంచి మస్కట్‌కు విమాన సర్వీస్‌