Air India Service: ఎయిర్‌ ఇండియా కీలక నిర్ణయం.. జూలై 20 నుంచి గర్నవరం నుంచి మస్కట్‌కు విమాన సర్వీస్‌

Air India Service: కరోనా కారణంగా చాలా విమాన సర్వీసులన్నీ మూతపడిపోయాయి. కరోనా పాజిటివ్‌ కేసులు తగ్గుముఖం పడుతుండటంతో ఇప్పుడిప్పుడే విమాన సర్వీసులు..

Air India Service: ఎయిర్‌ ఇండియా కీలక నిర్ణయం.. జూలై 20 నుంచి గర్నవరం నుంచి మస్కట్‌కు విమాన సర్వీస్‌
Follow us

|

Updated on: Jun 29, 2021 | 5:37 AM

Air India Service: కరోనా కారణంగా చాలా విమాన సర్వీసులన్నీ మూతపడిపోయాయి. కరోనా పాజిటివ్‌ కేసులు తగ్గుముఖం పడుతుండటంతో ఇప్పుడిప్పుడే విమాన సర్వీసులు తిరిగి ప్రారంభం అవుతున్నాయి. ఇక మరికొన్ని ప్రాంతాల్లో కరోనాతో కాకుండా ఇతర కారణాల వల్ల లేని సర్వీసులను సైతం ప్రారంభం అవుతున్నాయి. ఇక ఎయిర్‌ ఇండియా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. గర్నవరం విమానాశ్రయం నుంచి దేశాలకు విమాన సర్వీసులు నడిపేందుకు ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా జూలై 20 నుంచి ఒమాన్‌ దేశ రాజధాని మస్కట్‌కు డైరెక్ట్‌ విమాన సర్వీసును ఎయిర్‌ఇండియా ప్రారంభించనుంది.

ఎయిర్‌బస్‌ ఎ-21 విమానం ప్రతి మంగళవారం మధ్యాహ్నం 12 గంటల ఇక్కడి నుంచి బయలుదేరి ఒమాన్‌ దేశ కాలమాన ప్రకారం.. మస్కట్‌కు మధ్యాహ్నం 2 గంటలకు చేరుకుంటుందని ఎయిర్‌ఇండియా వర్గాలు పేర్కొన్నాయి. అయితే వారంలో ఒక రోజు మాత్రమే నడిచే ఈ సర్వీస్‌కు సంబంధించి ఆ సంస్థ ఇప్పటికే ప్రయాణ షెడ్యూల్‌ను ప్రకటించడంతో పాటు టిక్కెట్‌ బుకింగ్‌ను కూడా ప్రారంభించింది.

ఇవీ కూడా చదవండి:

Investment Scheme: రోజుకు రూ. 200 ఇన్వెస్ట్‌మెంట్‌తో రూ. 14 లక్షల వరకు ఆదాయం.. ఈ స్కీమ్‌ పూర్తి వివరాలు..!

Electric Vehicles: మార్కెట్లో పెరుగుతున్న ఎలక్ట్రిక్‌ వాహనాల పోటీ.. బజాజ్‌ నుంచి మరో ఎలక్ట్రిక్‌ వెహికల్‌