MMTS Services: హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. మ‌రిన్ని ఎంఎంటీఎస్ సర్వీసులు అందుబాటులోకి

క‌రోనా మహమ్మారి తీవ్రత క్రమంగా తగ్గుతుండడంతో.. ప్ర‌జ‌లు ఇప్పుడిప్పుడే సాధార‌ణ జీవ‌నానికి అలవాటు ప‌డుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ వాసులకు దక్షిణ మధ్యరైల్వే...

MMTS Services:  హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. మ‌రిన్ని ఎంఎంటీఎస్ సర్వీసులు అందుబాటులోకి
Hyderabad Mmts
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 28, 2021 | 10:29 PM

క‌రోనా మహమ్మారి తీవ్రత క్రమంగా తగ్గుతుండడంతో.. ప్ర‌జ‌లు ఇప్పుడిప్పుడే సాధార‌ణ జీవ‌నానికి అలవాటు ప‌డుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ వాసులకు దక్షిణ మధ్యరైల్వే మరో గుడ్ న్యూస్ చెపింది. కొద్ది రోజుల క్రితం 10 ఎంఎంటీఎస్ సర్వీసులను ప్రారంభించిన దక్షిణ మధ్య రైల్వే శాఖ తాజాగా జులై 1 నుంచి వాటికి అదనంగా మరో 45 సర్వీసులను పెంచడానికి ప్ర‌ణాళిక‌లు రూపొందించింది. ఈ మేరకు బోర్డు అనుమతి మంజూరు చేసిందని అధికారులు వెల్లడించారు. జులై 1నుంచి అదనంగా నడపనున్న 45 ఎంఎంటీఎస్​ ట్రైన్స్‌లో ఫలక్​నుమా- లింగంపల్లి- రామచంద్రాపురం మార్గంలో 13, లింగంపల్లి- రామచంద్రాపురం-ఫలక్​నుమా రూట్‌లో 12, హైదరాబాద్- లింగపల్లి రూట్​లో 10, లింగంపల్లి- హైదరాబాద్​ మార్గంలో 10 చొప్పున​ సర్వీసెస్ ర‌న్ చేయ‌నున్న‌ట్లు దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురుకాకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిపారు. అయితే ఈ రైళ్లను ఏ సమయం నుంచి ఏ సమయం వరకు నడపనున్నారు అనే విషయంపై క్లారిటీ రావాల్సిఉంది.

తెలంగాణలో ఇటీవ‌ల‌ లాక్‌డౌన్ ఎత్తివేయడంతో జూన్ 23వ తేదీ నుంచి హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్ రైళ్లు పరుగులు పెడుతున్నాయి. గత ఏడాది దేశంలో కరోనా వ్యాప్తి సమయంలో మార్చి 23న రద్దుచేసిన హైద‌రాబాద్ ఎంఎంటీఎస్ రైలు సర్వీసులు 15 నెలల తరువాత మళ్లీ సేవలు అందిస్తున్నాయి. కాగా ఆర్టీసీ బస్సు సర్వీసులు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు యథాతథంగా తెలంగాణలో సేవలు అందిస్తున్న విష‌యం తెలిసిందే.

Also Read: చీరకట్టులో స్కేటింగ్.. 46 ఏళ్ల ఆంటీ సాహసానికి ఫిదా అవుతున్న నెటిజన్లు.. వీడియో వైరల్..

పిల్లల్లో పెరుగుతున్న ఊబకాయం..ఇప్పుడు మరింత వేగంగా..