Viral Video: చీరకట్టులో స్కేటింగ్.. 46 ఏళ్ల ఆంటీ సాహసానికి ఫిదా అవుతున్న నెటిజన్లు.. వీడియో వైరల్..

ఇష్టమైన పనిని.. కొన్ని సమస్యలతో దూరం చేసుకొని.. ఎప్పటికీ తమ ఇష్టాన్ని వదిలిపెట్టనివారు చాలా మందే ఉంటారు. మనసులో ధైర్యం.. చేయగలననే నమ్మకం ఉంటే..

Viral Video: చీరకట్టులో స్కేటింగ్.. 46 ఏళ్ల ఆంటీ సాహసానికి ఫిదా అవుతున్న నెటిజన్లు.. వీడియో వైరల్..
Woman Skates In Saree
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 28, 2021 | 10:05 PM

ఇష్టమైన పనిని.. కొన్ని సమస్యలతో దూరం చేసుకొని.. ఎప్పటికీ తమ ఇష్టాన్ని వదిలిపెట్టనివారు చాలా మందే ఉంటారు. మనసులో ధైర్యం.. చేయగలననే నమ్మకం ఉంటే.. ఎనాటికైనా అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తుంటాం. ఈ మాటను నిజం చేసింది.. ఇండో కెనడియన్ కు చెందిన మహిళ. ఓర్బీ రాయ్. 9/11 దాడుల నుంచి బతికి బయటపడిన ఆమె.. తన జీవితాన్ని ఇప్పుడు పూర్తిగా ఆస్వాదిస్తుంది. ఓ వైపు తన డిజైనింగ్ వృత్తిని కొనసాగిస్తూనే.. మరోవైపు స్కేటింగ్ ని ప్రవృత్తిగా మార్చుకున్నారు. 46ఏళ్ల వయసున్న ఓర్బీ.. ఎంతో చలాకీగా స్కేటింగ్ బోర్డ్ పై చక్కర్లు కొడుతుంది. ఈమెకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఓర్బీకి ఇద్దరు పిల్లలు.. దాదాపు వయసు యాభైకి సమీపిస్తున్న ఎంతో హుషారుగా స్కేటింగ్ బోర్డు పై చక్కర్లు కొడుతుంది. ఇటీవల ఓర్బీ.. భారతీయ సంప్రదాయపు చీరకట్టులో స్కేటింగ్ చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. చీరకట్టులో అలవోకగా స్కేటింగ్ చేస్తున్న ఓర్బీ వీడియోకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. తనలో ఉన్న స్కీల్స్ కు.. ధైర్యాన్ని ప్రశంసిస్తూ కామెంట్స్ చేస్తుండగా.. మరో వైపు.. ఈ వయసులో నీకు స్కేటింగ్ అవసరమా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఓర్బీ మాత్రం.. జీవితం చాలా చిన్నది.. అందులోని ప్రతి క్షణాన్నీ ఆస్వాదించాలని.. దాన్ని వయసుతో ముడిపెట్టే మాటల్ని తాను పట్టించుకోనని అంటున్నారు.

ట్వీట్..

View this post on Instagram

A post shared by Aunty Skates (@auntyskates)

Also Read: Worlds Photos: ప్రపంచంలోనే అత్యంత అందమైన ద్వీపాలు ఇవే.. ఎక్కడెక్కడున్నాయో తెలుసా..

Covishield Excluded EU: ఈయూ సభ్యదేశాల కీలక నిర్ణయం.. గ్రీన్ పాస్ అర్హత జాబితా నుంచి కొవిషీల్డ్ తొలగింపు

C Ramachandraiah : టీఆర్ఎస్ నేతలు అందుకే.. వైయస్‌ రాజశేఖరరెడ్డి మీద కామెంట్లు చేస్తున్నారు : ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య

Mysteries Temple: ఆ గుడిలో దీపం నీటితో వెలుగుతోంది… వర్షాకాలంలో పూర్తిగా మునిగే దేవాలయం ఎక్కడుందంటే..