Viral Video: గుంపుగా వచ్చిన సింహాలను సింగల్‌గా ఎదిరించిన అడవిదున్న.. గగుర్పొడిచే వీడియో వైరల్!

సింహం సింగిల్‌గా ఎటాక్ చేస్తే.. దానిని తప్పించుకోవడం అసాధ్యం. ఇది జగమెరిగిన సత్యం. అయితే ఇక్కడ ఒకటి కాదు.. ఏకంగా మూడు సింహాలు ఓ అడవి..

Viral Video: గుంపుగా వచ్చిన సింహాలను సింగల్‌గా ఎదిరించిన అడవిదున్న.. గగుర్పొడిచే వీడియో వైరల్!
Lion Video
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 28, 2021 | 7:31 PM

సింహం సింగిల్‌గా ఎటాక్ చేస్తే.. దానిని తప్పించుకోవడం అసాధ్యం. ఇది జగమెరిగిన సత్యం. అయితే ఇక్కడ ఒకటి కాదు.. ఏకంగా మూడు సింహాలు ఓ అడవి దున్నపై దాడి చేశాయి. ఆ దున్న భయపడలేదు.. ఎదురొడ్డి పోరాడింది. సింగిల్‌గా ఆ సింహాలకు ధీటైన జవాబిచ్చింది. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఓ అడవిదున్న.. మూడు సింహాల మధ్య ఇరుక్కుపోయినట్లు మీరు వీడియోలో చూడవచ్చు. ఏం జరిగిందో తెలియదు గానీ.. అనూహ్యంగా ఆ అడవిదున్న గుంపు నుంచి తప్పిపోయింది. ఇంకేముంది ఎరను వేటాదేందుకు మూడు సింహాలు దండయాత్ర చేశాయి. అయితే ఆ అడవిదున్న సింహాలను చూసి బెదరలేదు. ధీటుగా ఆ గుంపుకు ఎదురెళ్లింది. వాటికి ఛాన్స్ ఇవ్వకుండా పోరాడింది. ఈలోపు ఇంకొన్ని అడవి దున్నలు తమ మిత్రుడిని కాపాడుకోవడానికి అక్కడికి చేరుకున్నాయి. మిషన్‌ను విజయవంతం చేశాయి. ఈ వీడియోను ‘@afaf66551’ అనే యూజర్ ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా.. ఇప్పటిదాకా 4 వేల 7 వందల వ్యూస్ వచ్చాయి. నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.

Also Read: ఈ ఫోటోలో మరో చిరుత దాగుంది.. కనిపెట్టగలరా! గుర్తు పట్టలేదా.? అయితే ఈ క్లూ ట్రై చేయండి..

తెలుగు వార్తలు లైవ్ ఇక్కడ చూడండి