Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

C Ramachandraiah : టీఆర్ఎస్ నేతలు అందుకే.. వైయస్‌ రాజశేఖరరెడ్డి మీద కామెంట్లు చేస్తున్నారు : ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య

కాళేశ్వరం ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు అని చెప్పబడుతుందే.. దానికి అంకురార్పణ చేసిందెవరూ..? తెలంగాణ నాయకులు సమాధానం చెప్పాలని రామచంద్రయ్య డిమాండ్ చేశారు...

C Ramachandraiah : టీఆర్ఎస్ నేతలు అందుకే..  వైయస్‌ రాజశేఖరరెడ్డి మీద కామెంట్లు చేస్తున్నారు :  ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య
C Ramachandraiah
Follow us
Venkata Narayana

|

Updated on: Jun 28, 2021 | 9:37 PM

C Ramachandraiah : దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి మీద టీఆర్ఎస్ నేతలు రాజకీయ లబ్ది కోసమే  విమర్శలు చేస్తున్నారని వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య అన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలోనే టీఆర్ఎస్ నేతలు ఈ వ్యాఖ్యలకు దిగుతున్నారని చెప్పుకొచ్చారు.  ఏ కార్యక్రమం అయినా తెలంగాణలోని చేవెళ్ల నుంచే వైయస్ మొదలుపెట్టారని..  విశాల దృష్టితో వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించారని  చెప్పారు. వైయస్‌ఆర్‌ది సంకుచిత మనస్తత్వం కాదని, తెలంగాణ, రాయలసీమ, ఉత్తరాంధ్రలో వెనుకబడిన ప్రాంతాలకు సాగునీరు, తాగునీరు అందించేందుకు ముఖ్యమంత్రి ఐన తరువాత వైయస్ అనేక ప్రాజెక్టులను రూపొందించారని ఆయన గుర్తు చేశారు. అలాంటి మహానాయకుడి గురించి టీఆర్ఎస్ నాయకులు దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు.

పోలవరం, ఇప్పుడు కాళేశ్వరంగా పిలవబడుతున్న ప్రాణహిత–చేవెళ్ల వంటి ప్రాజెక్టులకు వైయస్‌ఆర్‌ చేతుల మీదగానే అంకురార్పణ జరిగిందని రామచంద్రయ్య చెప్పారు. అలాంటి వ్యక్తిని తెలంగాణ ద్రోహి అంటారా..? చరిత్ర తెలుసా మీకు..? అన్ని ప్రాంతాల మధ్య ఉండే అసమానతలు తొలగిపోవాలని ప్రయత్నం చేసింది వైయస్‌ఆర్‌. ఎవరైనా కాదనగలరా..? అంటూ తెలంగాణ నేతల్ని ప్రశ్నించారు. ఏదైనా ప్రాంతం అభివృద్ధి చెందాలంటే నీటి వసతి కల్పిస్తేనే రైతాంగం అభివృద్ధి చెందుతుంది.. రైతాంగం అభివృద్ధి చెందితేనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుంటుందనే దృక్పథంతో అసమానతలు తొలగించడంలో భాగంగా ప్రాజెక్టులకు వైయస్ఆర్ రూపకల్పన చేశారని తెలిపారు.

సాక్షాత్తు కేసీఆర్‌ రాయలసీమకు అన్యాయం జరిగిందని గతంలో అన్నారని గుర్తు చేసిన రామచంద్రయ్య.. న్యాయబద్ధంగా రాయలసీమలో వర్షపాతం తక్కువ, వెనుకబాటు తనం ఎక్కువ. సామాజిక న్యాయం చేయాలంటే ఎక్కువగా నీళ్లు ఇవ్వాలి. అటువంటిది బచావత్‌ అవార్డులో తక్కువగా ఇచ్చారు. దాన్ని సరిచేయడానికే వైయస్‌ఆర్‌ జలయజ్ఞం చేపట్టారు. ఆంధ్రలో 22, తెలంగాణలో 26, రాయలసీమలో 11 ప్రాజెక్టులు చేపట్టారు. లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టులు చేపడితే కరెంట్‌ ఎక్కడ నుంచి తీసుకొస్తారని కొందరు ఎగతాళి చేశారు. కానీ, రెండు రాష్ట్రాల్లో లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ఆధారంగా మారింది. కాళేశ్వరం ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు అని చెప్పబడుతుందే.. దానికి అంకురార్పణ చేసిందెవరూ..? తెలంగాణ నాయకులు సమాధానం చెప్పాలని రామచంద్రయ్య డిమాండ్ చేశారు.

Read also : Insane uncle : మతిస్థిమితం లేని బాబాయి చేతిలో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు చిన్నారులు.. రేపల్లెలో ఘోరం