Obesity: పిల్లల్లో పెరుగుతున్న ఊబకాయం..ఇప్పుడు మరింత వేగంగా..
Obesity: గత నాలుగు దశాబ్దాలుగా అమెరికాలో పిల్లలలో ఊబకాయం గణనీయంగా పెరిగింది. 1980 లో, రెండు, 19 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలు, యువతలో ఐదు శాతం మంది ఊబకాయం కలిగి ఉన్నారు.
Obesity: గత నాలుగు దశాబ్దాలుగా అమెరికాలో పిల్లలలో ఊబకాయం గణనీయంగా పెరిగింది. 1980 లో, రెండు, 19 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలు, యువతలో ఐదు శాతం మంది ఊబకాయం కలిగి ఉన్నారు. 2018 లో ఇది 19 శాతానికి పెరిగింది. అదనంగా, 16 శాతం మంది పిల్లలు అధిక బరువుతో ఉన్నారు. మహమ్మారి కారణంగా నిరవధిక పాఠశాల మూసివేత పిల్లలలో ఊబకాయం పెరిగే అవకాశం మరింత ఎక్కువగా ఉందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. జూన్ 2020 లో ఊబకాయం(Obesity) అనే జర్నల్‌లోని పరిశోధనా పత్రంలో, కొలంబియా విశ్వవిద్యాలయంలోని మెయిల్‌మన్ పబ్లిక్ హెల్త్ స్కూల్ పరిశోధకులు ఈ అంటువ్యాధి పిల్లలలో ఊబకాయం సమస్యను పెంచుతుందని భయపడ్డారు. అలాంటి పిల్లలు టైప్ -2 డయాబెటిస్, అధిక రక్తపోటు అదేవిధంగా కాలేయ వ్యాధుల బారిన పడవచ్చు. మేలో పీడియాట్రిక్స్ పత్రికలో జరిపిన అధ్యయనంలో ఈ భయాలు సరైనవని తేలింది. ఫిలడెల్ఫియాలోని చిల్డ్రన్స్ హాస్పిటల్ పరిశోధకులు రెండు నుండి 17 సంవత్సరాల మధ్య వయస్సు గల 5,00,000 మంది పిల్లలు, కౌమారదశలో ఉన్న వారి శరీర ద్రవ్యరాశి సూచిక(BMI)ను కొలిచారు.2019 జనవరి, 2020 డిసెంబర్ మధ్య పిల్లల ఊబకాయం మొత్తం 2 శాతం పెరిగి 15.4 శాతానికి చేరిందని కనుగొన్నారు. ఇది చాలా ఆన్దోలనకరమైన పెరుగుదల అని వారు చెబుతున్నారు.
తక్కువ ఆదాయ కుటుంబాల పిల్లలలో కూడా ఊబకాయం విషయంలో గణనీయమైన పెరుగుదల ఉండటం గమనించారు పరిశోధకులు. చిన్నతనంలోనే ఊబకాయం ఉన్న పిల్లలు పెద్దయ్యాక కూడా అలానే ఉంటారు. ఇప్పటికే యుఎస్‌లో 40% పెద్దలు ఊబకాయం బారిన పడ్డారు. పిల్లల బరువు పెరగడానికి గల కారణాలను పరిశోధకులు విశ్లేషించారు.
పిల్లలు ఇంట్లో కంటే పాఠశాలల్లో ఎక్కువ పోషకమైన, సమతుల్య ఆహారం పొందుతారు. వారు పాఠశాలలో నియమిత సమయాల్లో తింటారు, త్రాగుతారు. రోజంతా వారికి అక్కడ తినడానికి వారికి స్నాక్స్ రావు. పాఠశాలల్లో కూడా శారీరక శ్రమలు జరుగుతాయి. మరోవైపు ఇళ్లదగ్గర ఖాళీగా ఉండాల్సి రావడంతో పిల్లల్లో శారీరక శ్రమ తగ్గిపోయింది. అదేవిధంగా చిరుతిళ్ళు అదుపులో లేకుండా ఉంటున్నాయి. అందుకే, పిల్లల్లో ఊబకాయం సమస్య పెరిగిపోతోందని నిపుణులు అంటున్నారు. ఇంటివద్ద ఉన్న పిల్లలకు కూడా శారీరక శ్రమ కలిగించే పనులు చెప్పాలని వారు సూచిస్తున్నారు. ఆహారం విషయంలో కఠినమైన చర్యలు తీసుకోవాలనీ, సమయానుసారంగా తినే అలవాటు కచ్చితంగా పిల్లలకు చేయాలనీ వారు సూచిస్తున్నారు. ఆహారంలో కొవ్వు పదార్ధాలు పూర్తిగా తగ్గించాలనీ, కూరగాయలు, పండ్లు వంటివి ఎక్కువగా ఉండేలా చూసుకోవాలనీ కూడా నిపుణులు చెబుతున్నారు. ఊబకాయం తో వచ్చే ఆరోగ్య సమస్యలు ఒక్కోసారి ప్రాణాల మీదకు కూడా తెస్తాయని తల్లిదండ్రులు కూడా గుర్తించాలని వారంటున్నారు.
Also Read: Workouts: ప్రతిరోజూ వ్యాయామం చేస్తే డబ్బు ఆదా చేసినట్టే అంటున్నారు పరిశోధకులు..అలా ఎలా?