AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyperpigmentation: నిద్ర లేకపోవడమే కాదు.. ఎక్కువైనా కూడా కళ్ళ కింద నలుపు వస్తుంది..దీనిని ఎలా నివారించాలి?

Hyperpigmentation: సాధారణంగా అందరూ తమ ముఖంలో ఎటువంటి మచ్చలూ ఉండకూడదనే భావిస్తారు. ముఖ్యంగా కళ్ళచుట్టూ నల్లటి వలయాలు రాకూడదని కోరుకుంటారు.

Hyperpigmentation: నిద్ర లేకపోవడమే కాదు.. ఎక్కువైనా కూడా కళ్ళ కింద నలుపు వస్తుంది..దీనిని ఎలా నివారించాలి?
Hyperpigmentation
KVD Varma
|

Updated on: Jun 28, 2021 | 10:15 PM

Share

Hyperpigmentation: సాధారణంగా అందరూ తమ ముఖంలో ఎటువంటి మచ్చలూ ఉండకూడదనే భావిస్తారు. ముఖ్యంగా కళ్ళచుట్టూ నల్లటి వలయాలు రాకూడదని కోరుకుంటారు. కళ్ళ కింద వచ్చే నలుపు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తుంది. ఎందుకంటే, అది ఏకారణం చేత వచ్చినా మనిషి సంతోషంగా లేనట్టు కనిపిస్తాడు. మహిళలు కాళ్ళకింద నలుపు కనిపించింది అంటే ఇక వారికి టెన్షన్ మొదలైపోతుంది. నల్లటి మచ్చలు రావడం వేరు.. మొత్తం నల్లగా అయిపోవడం వేరు. సాధారణంగా అందరూ కళ్ళ కింద నలుపు నిద్రలేమి వల్ల వస్తుందని భావిస్తారు. కానీ, వేరే కారణాలూ దానికి ఉన్నాయంటున్నారు నిపుణులు.

ముఖంలోని కొంతభాగం నల్లదనం కారణంగా భిన్నంగా కనిపించడం ప్రారంభిస్తుంది. ఈ నల్లబడటం మొటిమల వల్ల లేదా హైపర్పిగ్మెంటేషన్ వల్ల వస్తుంది. పెదవులు, కళ్ళ చుట్టూ ఉన్న నల్లదనం గురించి చాలా మంది మహిళలు ఆందోళన చెందుతుంటారు. హైపర్పిగ్మెంటేషన్ అంటే నోరు మరియు కళ్ళ చుట్టూ చర్మం నల్లబడటం అని ఫోర్టిస్ ఎస్కార్ట్స్ హాస్పిటల్, డెర్మటాలజీ విభాగం సీనియర్ కన్సల్టెంట్ స్వాతి మోహన్ చెప్పారు. జీవనశైలి సరిగా లేకపోవడం వల్ల, కొన్ని ప్రాంతాల్లో మెలనిన్ అధికంగా మారడం మొదలవుతుంది, ఈ కారణంగా ఆ ప్రాంతంలోని చర్మం నల్లగా మారుతుంది. అదేవిధంగా పాచెస్ లాగా కనిపిస్తుంది.

అధిక నిద్ర కారణంగా డార్క్ సర్కిల్స్ కూడా వస్తాయి. సర్కిల్స్ ఏర్పడతాయి. నిద్ర లేకపోవడం వల్ల మీ చర్మం నీరసంగా, లేతగా కనబడుతుంది, ఇది మీ చర్మం కింద ఉన్న కణజాలాలను, రక్త నాళాలను బహిర్గతం చేస్తుంది. అలెర్జీలు లేదా కళ్ళు పొడిబారడం వల్ల హైపర్పిగ్మెంటేషన్ వస్తుంది.

హైపర్‌పిగ్మెంటెషన్ ఎండలో ఎక్కువసేపు ఉండటం కూడా అతి పెద్ద కారణంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇది శరీరంలో మెలనిన్ పెంచడానికి సహాయపడుతుంది. హైపర్పిగ్మెంటేషన్ ఏ వయసులోనైనా సంభవిస్తుంది. చర్మం వృద్ధాప్యం వల్ల కూడా ఇది వస్తుంది. అందువల్ల, ఇంటి నుండి బయటకు వచ్చినప్పుడల్లా, మంచి సన్ గ్లాసెస్ ధరించడం అవసరం. అదేవిధంగా ఎస్పీఎఫ్ 30 లేదా 50 తో ఉండే సన్‌స్క్రీన్‌ను ఉపయోగించడం మంచిది. అలాగే, మంచి నిద్ర, ఆరోగ్యకరమైన ఆహారం హైపర్పిగ్మెంటేషన్ నిరోధిస్తుంది. తగినంత నిద్ర పొందండి, పుష్కలంగా నీరు త్రాగండి, విటమిన్ కె అధికంగా ఉన్న ఆహారం తినండి. ఇవన్నీ కూడా హైపర్‌పిగ్మెంటెషన్ నిరోధిస్తాయి అని నిపుణులు చెబుతున్నారు.

Also Read: Obesity: పిల్లల్లో పెరుగుతున్న ఊబకాయం..ఇప్పుడు మరింత వేగంగా..

Workouts: ప్రతిరోజూ వ్యాయామం చేస్తే డబ్బు ఆదా చేసినట్టే అంటున్నారు పరిశోధకులు..అలా ఎలా?