AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

These Foods in Your Diet : వర్షాకాలంలో వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే ఈ ఆహార పదార్థాలను మీ డైట్‌లో చేర్చుకోవాల్సిందే..

These Foods in Your Diet : వర్షకాలం ప్రారంభమైంది. టీ, పకోడి ఆరోగ్యకరమైనవి కావని అందరికి తెలుసు. అయినా

These Foods in Your Diet : వర్షాకాలంలో వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే ఈ ఆహార పదార్థాలను మీ డైట్‌లో చేర్చుకోవాల్సిందే..
These Foods In Your Diet
uppula Raju
|

Updated on: Jun 28, 2021 | 10:56 PM

Share

These Foods in Your Diet : వర్షకాలం ప్రారంభమైంది. టీ, పకోడి ఆరోగ్యకరమైనవి కావని అందరికి తెలుసు. అయినా అందరు ఇష్టపడతారు. కానీ సాధారణ పరిమాణంలో తింటే ఏది హానికరం కాదు. వర్షకాలంలో వ్యాధుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కనుక ఆరోగ్యకరమైన, రోగనిరోధక శక్తిని పెంచే వస్తువులను తీసుకోవాలి. అవేంటో ఒక్కసారి తెలుసుకుందాం.

1. కాలానుగుణ పండ్లు బొప్పాయి, లిట్చి, ఆపిల్, పియర్ వంటి సీజనల్ పండ్లను తీసుకోవాలి. ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. మీ రోజువారి డైట్‌లో కచ్చితంగా వీటిని చేర్చుకోవాలి. ఇందులో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.

2. వెల్లుల్లి వెల్లుల్లి అనేది జీవక్రియను పెంచడానికి ఉపయోగించే సూపర్ ఫుడ్. మీరు దీనిని పప్పు, సాంబార్, రసం, అనేక ఇతర విషయాలలో ఉపయోగించవచ్చు. మీరు వెల్లుల్లి, అల్లం, జీలకర్ర, కొత్తిమీర, పసుపును ఆహారంలో ఉపయోగించవచ్చు. ఇవి జలుబు, ఫ్లూ వంటి వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి.

3. చేదు పదార్థాలు తినండి మీ ఆహారంలో మెంతి, వేప, వంటి వాటిని చేర్చండి. ఇది మీ రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. కాలానుగుణ అంటువ్యాధుల నుంచి మిమ్మల్ని దూరంగా ఉంచుతుంది. ఇందులో విటమిన్లు ఎ, సి, బి, ఖనిజాలు, ఇనుము, జింక్ పోషకాలు ఉంటాయి. వేపలో యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇది అనేక వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది.

4. పెరుగు పెరుగులో ప్రోబయోటిక్ లక్షణాలు ఉంటాయి. ఇవి మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. ఇందులో ఉన్న మంచి బ్యాక్టీరియా పేగులను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

5. తేనె తేనె జీర్ణవ్యవస్థ, రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి పనిచేస్తుంది. ఇందులో ఉండే ఫైటోన్యూట్రియెంట్స్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ నిరోధకతలా పనిచేస్తాయి.

6. నీరు ఈ సీజన్లో తగినంత నీరు తాగాలి. నీరు శరీరంలో శక్తిని పెంచుతుంది. ఇది కాకుండా మొటిమలను వదిలించుకోవడానికి సహాయపడుతుంది. మీరు నిమ్మ, నారింజ, దోసకాయ, పుదీనాను నీటిలో కలుపుకొని డిటాక్స్ పానీయంగా తాగవచ్చు.

MMTS Services: హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. మ‌రిన్ని ఎంఎంటీఎస్ సర్వీసులు అందుబాటులోకి

Oldest Bank in World : ఇది ప్రపంచంలోనే అతి పురాతన బ్యాంకు..! డబ్బుకు బదులు విలువైన వస్తువులను ఉంచేవారు..

Rare Pearl Cone: వలలోకి చిక్కిన అరుదైన శంఖం…!! కొనేందుకు పోటీపడ్డ వ్యాపారులు… ( వీడియో )