Telangana online classes: ఓన్లీ ఆన్‌లైన్ క్లాసులు.. రిస్క్ చెయ్య‌లేం.. ఎవ‌రెవ‌రికీ ఎప్ప‌ట్నుంచి అంటే

జులై 1 నుంచి అన్ని విద్యాసంస్థలు ప్రారంభించనున్నట్లు గతంలో ప్రకటించిన తెలంగాణ స‌ర్కార్... కరోనా తీవ్రత, డెల్టా ప్ల‌స్ వార్నింగ్స్, హైకోర్టు ప్రశ్నలతో వెనక్కి తగ్గింది.

Telangana online classes: ఓన్లీ ఆన్‌లైన్ క్లాసులు.. రిస్క్ చెయ్య‌లేం.. ఎవ‌రెవ‌రికీ ఎప్ప‌ట్నుంచి అంటే
Minister-Sabitha-Indra-Reddy
Follow us
Ram Naramaneni

| Edited By: Anil kumar poka

Updated on: Jun 29, 2021 | 1:00 PM

జులై 1 నుంచి అన్ని విద్యాసంస్థలు ప్రారంభించనున్నట్లు గతంలో ప్రకటించిన తెలంగాణ స‌ర్కార్… కరోనా తీవ్రత, డెల్టా ప్ల‌స్ వార్నింగ్స్, హైకోర్టు ప్రశ్నలతో వెనక్కి తగ్గింది. కొన్నాళ్ల పాటు ఆన్​లైన్ బోధనే కొనసాగించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ఈ నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. సోమ‌వారం ఆ శాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. స్కూల్స్, ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ సహా కేజీ నుంచి పీజీ వరకు అన్ని క్లాసుల‌కు ఆన్​లైన్ పాఠాలు ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. జులై 1 నుంచి మూడో తరగతి నుంచి పీజీ వరకు ఆన్​లైన్ బోధన మొదలు పెట్టనున్నట్లు తెలిపారు. కేజీ నుంచి రెండో తరగతి వరకు ఆగస్టు 1 నుంచి ఆన్​లైన్​ క్లాసులు స్టార్ట్ చేస్తామ‌న్నారు. గ‌వ‌ర్న‌మెంట్ స్కూల్స్, కాలేజీల‌ విద్యార్థులకు గతేడాది మాదిరిగానే దూరదర్శన్ యాదగిరి, టీ శాట్ ఛానళ్ల ద్వారా పాఠాలు ప్రసారమవుతాయన్నారు. దూరదర్శన్ యాదగిరి, టీశాట్ యాప్, ఎన్​​సీఈఆర్​ట్​ వెబ్​సైట్​లోనూ అందుబాటులో ఉంటాయని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఎంసెట్ సహా ఎంట్ర‌న్స్ టెస్టుల‌న్నీ ప్రకటించిన తేదీల్లోనే యథాతథంగా జరుగుతాయన్నారు. అందులో ఎలాంటి మార్పులు ఉండవని వెల్ల‌డించారు. అదే విధంగా వచ్చే నెలలో జరగనున్న డిగ్రీ, పీజీ, డిప్లొమా పరీక్షలన్నీ ఆఫ్​లైన్​లోనే జరుగుతాయని మంత్రి వివ‌రించారు.

ప్రైవేట్ స్కూల్స్ ఈ విద్యాసంవత్సరంలోనూ జీవో 46 ప్రకారమే ఫీజులు వసూలుచేయాలని సబితా స్పష్టం చేశారు. కేవలం బోధన రుసుమును మాత్రమే తీసుకోవాల‌ని. అదీ నెలవారీగా తీసుకోవాల‌ని పేరెంట్స్‌ను ఒత్తిడి చేయెద్ద‌ని సూచించారు. కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వీలైతే ఫీజులను మరింత తగ్గించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు.. రోజుకు 50 శాతం మాత్రమే హాజరయ్యేలా ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలిపారు. సర్కారు బడుల విద్యార్థుల కోసం 90 శాతం పుస్తకాలు ఆయా పాఠశాలలకు చేరాయన్నారు.

Also Read: హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. మ‌రిన్ని ఎంఎంటీఎస్ సర్వీసులు అందుబాటులోకి

ఒక్కసారి ప్రీమియం చెల్లించి లైఫ్‌లాంగ్ ధీమాగా ఉండండి..! తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం