REPCO Bank Recruitment: రెప్కో బ్యాంక్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. షార్ట్ లిస్టింగ్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక‌..

REPCO Bank Recruitment: చెన్నైలో ఉన్న భార‌త ప్ర‌భుత్వ రంగానికి చెందిన రెప్కో బ్యాంక్ లిమిటెడ్ ప‌లు ఉద్యోగాల భ‌ర్తీకి నోటిటిఫికేష‌న్ జారీ చేసింది. ఇందులో భాగంగా స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయనున్నారు. ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌కు...

REPCO Bank Recruitment: రెప్కో బ్యాంక్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. షార్ట్ లిస్టింగ్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక‌..
Repco Bank Jobs
Follow us
Narender Vaitla

|

Updated on: Jun 29, 2021 | 8:21 AM

REPCO Bank Recruitment: చెన్నైలో ఉన్న భార‌త ప్ర‌భుత్వ రంగానికి చెందిన రెప్కో బ్యాంక్ లిమిటెడ్ ప‌లు ఉద్యోగాల భ‌ర్తీకి నోటిటిఫికేష‌న్ జారీ చేసింది. ఇందులో భాగంగా స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయనున్నారు. ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌కు చివ‌రి తేదీ వ‌చ్చే నెల 12వ‌ర‌కు ఉంది. ఈ నేప‌థ్యంలో నోటిఫికేష‌న్‌కు సంబంధించిన పూర్తి వివ‌రాల‌పై ఓ లుక్కేయండి..

భ‌ర్తీ చేయ‌నున్న ఖాళీలు, అర్హ‌త‌లు..

* మొత్తం 10 ఖాళీల‌కు గాను మేనేజ‌ర్ (03), అసిస్టెంట్ మేనేజ‌ర్ (07) పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. * చార్ట‌ర్డ్ అకౌంటెంట్ విభాగంలో మేనేజ‌ర్ పోస్టుకు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు.. లా గ్రాడ్యుయేషన్, గ్రాడ్యుయేషన్‌తోపాటు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌లో అసోసియేట్‌ అయి ఉండాలి. సంబంధిత పనిలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి. ఇక అభ్య‌ర్థుల వ‌య‌సు 31.05.2021 నాటికి 40 ఏళ్లు మించకూడదు.

* అసిస్టెంట్ మేనేజ‌ర్ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు.. లీగ‌ల్ హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్ విభాగాల్లో లా గ్రాడ్యుయేషన్, బీఈ/ బీటెక్‌/ఎంసీఏ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి. అభ్య‌ర్థుల వ‌య‌సు 31-05-2021 నాటికి 30 ఏళ్లు మించ‌కూడ‌దు.

ముఖ్య‌మైన విష‌యాలు..

* మేనేజ‌ర్ పోస్టుల‌ను షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వూ ఆధారంగా ఎంపిక చేస్తారు. * అసిస్టెంట్ మేనేజ‌ర్ పోస్టుల‌ను రాతపరీక్ష, ఇంటర్వూ ఆధారంగా ఎంపికచేస్తారు. * అర్హ‌త‌, ఆస‌క్తి ఉన్న అభ్య‌ర్థులు ఆఫ్‌లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. * ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌కు చివ‌రి తేదీగా 12-07-2021ని నిర్ణ‌యించారు. * పూర్తి వివ‌రాల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి..

Also Read: Scholarship 2021 Apply: పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు.. దరఖాస్తుకు చివరి తేదీ జూన్‌ 30

JEE Advanced 2021: జేఈఈ అడ్వాన్స్‌ 2021 బ్రోచర్‌ విడుదల.. పూర్తి వివరాలు తెలుసుకోండి..!

AP Exams: వారం రోజుల్లో ఏపీ టెన్త్‌, ఇంట‌ర్ ఫ‌లితాలు.. పాఠ‌శాల‌లు పునఃప్రారంభంపై.. మంత్రి ఆదిమూలపు వ్యాఖ్య‌లు..