Scholarship 2021 Apply: పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు.. దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 30
Scholarship 2021 Apply: కేంద్ర సర్కార్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్‌మెంట్ మంత్రిత్వశాఖకు చెందిన సామాజిక న్యాయం, సాధికారత విభాగం 2021-22 విద్యా సంవత్సరానికి..
Scholarship 2021 Apply: కేంద్ర సర్కార్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్‌మెంట్ మంత్రిత్వశాఖకు చెందిన సామాజిక న్యాయం, సాధికారత విభాగం 2021-22 విద్యా సంవత్సరానికి గాను అర్హులైన ఎస్సీల నుంచి పోస్ట్‌మెట్రిక్ స్కాలర్‌షిప్‌లకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఆన్‌లైన్ దరఖాస్తులు ఈనెల 30 వరకు అందుబాటులో ఉంటాయి. చదువుతున్న కోర్సుల ఆధారంగా ప్రతి ఏడాది రూ.2500 నుంచి రూ.13,500 వరకు అందిస్తారు. ఇలా ఐదేళ్లలో మొత్తం 63 లక్షల మందికి చెల్లిస్తారు. అభ్యర్థులు పూర్తి వివరాలకు http://socialjustice.nic.in/ వెబ్‌సైట్ చూడవచ్చు.
ముఖ్య సమాచారం:
అర్హత: టెన్త్ క్లాస్ పూర్తి చేసి గుర్తింపు పొందిన విద్యా సంస్థలో ఇంటర్మీడియట్ ఆపై ఉన్నత విద్య చదువుతున్న వారై ఉండాలి. ఎస్సీ విద్యార్థులై ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం రూ.2.5 లక్షలు మించకుండా ఉండాలి.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 30, 2021 వెబ్‌సైట్:http://socialjustice.nic.in/